ఉద్యోగాల ప్రకటనపై తెలంగాణ ఉద్యోగుల సంఘం హర్షం

హైదరాబాద్  ముచ్చట్లు:
 
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు అసెంబ్లీలో ప్రకటించిన ఉద్యోగుల నియామకాల పట్ల తెలంగాణ ఉద్యోగల సంఘం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల సంఘం చైర్మన్ ఎ. పద్మాచారి మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో ముఖ్య మైన నినాదాలు నీళ్లు,నిధులు,నియామకాలు.. ముఖ్య మంత్రిగారికి పై విషయాలలో నీళ్లు, నిధుల విషయంలో ఎక్కువ శాతం అభివృద్ధిని సాధించాం ఇక మిగిలినవి నియామాకాలు మాత్రమే, అది కూడా ఈరోజు అసెంబ్లీలో కేసీఆర్ ఉద్యోగుల నియామకాల ప్రకటనతో, మూడవ నినాదం కూడా పూరించినట్లు అయ్యింది. సుమారు 11000 జప్పంద ఉద్యోగులను రెగ్యులరైస్ చెయ్యడం చాలా సంతోకరమైన విషయమన్నారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టడం చాలా గొప్ప విషయం అలాగే జిల్లా స్థాయి కాడర్ ఉద్యోగులను డిస్టిక్ సెలక్షన్ కమిటీ నియమించాలని, దానివలన తొందరగా నియామకాలు జరపవచ్చు అని ఆశాభావం వ్యక్తం చేశారు. కోర్టులో న్యాయ సమస్యలు రాకుండా స్పెషల్ అటెన్షన్ తీసుకొని నియమాకాలు ఆలస్యం కాకుండా చూడాలని పద్మాచారి కోరారు. ఈ కార్యక్రమంలో ఎం. రవీందర్ కుమార్ (ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్) హరీష్ కుమార్ రెడ్డి (ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రెటరీ) శ్రీకాంత్ రావు (వర్కింగ్ ప్రెసిడెంట్) ఎన్. నర్సింగ్ రావ్ (తెలంగాణ ఉద్యోగుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్) డా. ఎండీ షరీఫ్, అసోసియేట్ ప్రెసిడెంట్ లు పాల్గొన్నారు.
 
Tags; Telangana Employees Union Harsham on job advertisement

Leave A Reply

Your email address will not be published.