తెలంగాణ ఎగుమతులపై సమీక్ష

Telangana Exports Review

Telangana Exports Review

Date:13/04/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్రం నుండి ఎగుమతులు మరింత  పెంచే విషయమై కేంద్ర వాణిజ్య శాఖ సూచించిన మేరకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు.
శుక్రవారం సచివాలయంలో కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా టియోటియాతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఎగుమతుల పెంపుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి  జయేష్ రంజన్, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్ధసారధి, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, టిఎస్ఐటిసి యం.డి  వెంకటనర్సింహారెడ్డిలతో పాటు కేంద్ర వాణిజ్య శాఖాధికారులు పాల్గొన్నారు. కేంద్ర వాణిజ్య శాఖ ఇటువంటి సమావేశం నిర్వహించడం రాష్ట్రానికి ఎంతో ఉపయోగమని, ఇందులో లేవనెత్తిన విషయాలపై తప్పనిసరిగా దృష్టి సారిస్తామని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సి.యస్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఐటి, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నామని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పర్యాటకం, మెడికల్ టూరిజం, సర్వీసెస్, హాస్పిటాలటీ లాంటి రంగాలలో విస్తృత అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని, ఎగుమతుల పెంపుకు కృషి చేస్తామని సి.యస్ వివరించారు. దేశ ఫార్మా ఉత్పత్తులలో 30శాతం తెలంగాణలో తయారు అవుతున్నాయని, ఎగుమతులలో 20శాతం ఇక్కడనుండే జరుగుతున్నాయని అన్నారు. 2016-17 లో 85,470 కోట్ల విలువగల వాటి ఎగుమతులు జరిగాయని అన్నారు. కేంద్ర వాణిజ్య కార్యదర్శి రీటా టియోటియా మాట్లాడుతూ రాష్ట్ర ఎగుమతుల పెంపుకు సంబంధించి వ్యూహాన్ని రూపొందించుకోవాలని, ఫార్మా, ఐటీలతో పాటు మరిన్ని రంగాలకు విస్తరించాలన్నారు. వివిధ దేశాలకు ఎగుమతులకు గల అవకాశాలపై ఉన్న పరిస్ధితులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ నుండి ఎగుమతి అవుతున్న వస్తువుల వారిగా సమీక్షించారు. ఎగ్ పౌడర్, ఎసెన్షియల్ ఆయిల్స్, మీట్, బియ్యం, టెక్స్ టైల్స్, కాటన్ ఎగుమతులపై చర్చించారు. కేంద్ర వాణిజ్య శాఖ ద్వారా వివిధ దేశాలకు  ఎగుమతుల అవకాశాల పై ప్రచురించే డాటాను రెగ్యులర్ గా విశ్లేషించాలని అన్నారు.ఎగుమతులకు సంబంధించి ముంబాయిలో మే నెలలో నిర్వహించే  గ్లోబల్ ఎగ్జిబిషన్ కు రాష్ట్ర ప్రభుత్వంను ఒక బృందాన్ని పంపించాలని కోరారు. కేంద్ర వాణిజ్య శాఖకు సంబంధించిన విషయాలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించటానికి నోడల్ అఫీసర్ ను నియమిస్తున్నట్లు తెలిపారు.
Tags:Telangana Exports Review

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *