తెలంగాణా గవర్నర్ లక్ష్మణరేఖ దాటుతున్నారు-సిపిఐ నారాయణ
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణా గవర్నర్ లక్ష్మణరేఖ దాటుతున్నారని సిపిఐ నేత నారాయణ విమర్శించారు. ఈరోజు మహిళల దర్బార్ దేనికిపెడుతున్నారు ? సహజంగా యెవరయినా ప్రతినిధి వర్గం వస్తే కలవవచ్చు. వారి వినతిపత్రాన్ని స్వీకరించి ప్రభుత్వానికి పంపవచ్చు. . అంతేగాని ఈమే రాజకీయ కార్యకలాపాలకు రాజ్ భవన్ ను దుర్వినియోగం చేస్తున్నది . వీరికి కూడారాజకీయ నేపధ్యంవున్న సంగతి తెలుసు. వేషం మార్చుకుని తటస్థత స్త బాద్యతతో వచ్చారు. ఆమేరకే వారిప్రవర్తన వుండాలని అయన అన్నారు.ఒకవైపు బిజేపి రాజకీయదాడి పెంచింది. మరోవైపు గవర్నర్ పాత్ర అగ్గికీ అజ్యం పోస్తున్నది. తెరాస s ప్రభుత్వంపై విధాదానపరంగా సిపిఐ పోరాడుతున్నది . మైనర్లను పబ్ లోకి అనుమతించడం చట్టరిత్యా నేరం. ఆపబ్ ను సీజ్ చేసి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. అది చేయకపోగా, ఆ సంఘటననే మసిపూసి మారేడుకాయ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. అయితే గవర్నర్ పాత్ర రాజకీయ పరంగావుంది. ఇది ఫెడరల్ రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకం. గవర్నర్ తలపెట్టిన దర్బార్ ను రద్దుచేయాలని కోరుతున్నానని అయన అన్నారు.
Tags: Telangana Governor crosses Lakshmanarekha-CPI Narayana