Date:24/01/2021
తిరుమలముచ్చట్లు:
తిరుమల శ్రీవారిని ఆదివారం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టిటిడి అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, అర్చక బృందం కలిసి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గవర్నర్ ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం, డైరీ, క్యాలెండర్ అందించారు.ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, రిసెప్షన్ డెప్యూటీ ఈవో బాలాజి, పేష్కార్ జగన్మోహనాచార్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి
Tags: Telangana Governor Tamilisai Soundararajan visited Srivastava