ఎవరి లెక్కలు వారివే

-మూడు పార్టీల ఆశలు

Date:23/07/2019

వరంగల్ ముచ్చట్లు:

తెలంగాణ‌లో గ‌త ఏడాది ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో మొదలైన ఎన్నిక‌ల వేడి.. ఇంకా కొన‌సాగుతూనే ఉంది. వ‌రుసగా ఏదో ఒక ఎన్నిక‌ల హడావుడితో ఇక్క‌డి పార్టీల‌న్నీ త‌ల‌మున‌క‌లై ఉంటున్నాయి. త్వ‌రలో మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్‌, కాంగ్రెస్, కొత్త ఉత్సాహంతో బీజేపీ మూడు పార్టీలూ ఈ ఎన్నిక‌ల్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగానే తీసుకున్నాయి. ఎవ‌రి పాయింటాఫ్ వ్యూలో వారికి ఈ ఎన్నిక‌లు కీల‌కం కాబోతున్నాయి. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ మూడు ప్ర‌ధాన పార్టీల‌కు ఓర‌కంగా దిశానిర్దేశం చేస్తాయ‌ని చెప్పొచ్చు. రాబోయే నాలుగేళ్ల‌పాటు వారి రాజ‌కీయం ఎలా ఉండబోతోందో తేల్చేవిగా ఉంటాయ‌నీ చెప్పొచ్చు.

 

 

 

తెరాస మీద వ్య‌తిరేకత మొద‌లైంద‌ని ఇప్ప‌టికే కాంగ్రెస్, భాజ‌పా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నాయి. దానికి త‌గ్గ‌ట్టుగానే పార్ల‌మెంటు ఎన్నిక‌ల ఫ‌లితాల్లో సారూ కారూ ప‌ద‌హారు లక్ష్యాన్ని తెరాస చేరుకోలేక‌పోయింది. ఆ త‌రువాత‌, జెడ్పీలు కైవ‌సం చేసుకున్నా… ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో కేసీఆర్ పాల‌న మీద వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మౌతోంద‌నే అభిప్రాయం బ‌లంగానే ఉంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆ అభిప్రాయంపై స్ప‌ష్ట‌త వ‌చ్చేస్తుంద‌ని చెప్పొచ్చు. అర్బ‌న్ ప్ర‌జ‌లు నిజంగాన టీఆర్ ఎస్ కొంత విముఖ‌త ఉంటే.. రాబోయే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తెరాస‌కు వ్య‌తిరేకంగా ఓటేస్తారు. లేదంటే, అనుకూలంగా ఓటేస్తారు. సో..

 

 

 

ఈ ఫ‌లితాన్ని బ‌ట్టీ తెరాస భ‌విష్య‌త్తు రాజ‌కీయ వ్యూహంలో కొన్ని మార్పులూ చేర్పుల‌కు క‌చ్చితంగా అవ‌కాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ విష‌యానికొస్తే… వ‌రుస ఫిరాయింపులు కొన‌సాగుతున్నా మూడు చోట్ల ఎంపీ స్థానాల‌ను గెలుచుకుంది. మ‌రో రెండు స్థానాల్లో గ‌ట్టి పోటీని ఇచ్చింది. ఒక‌వేళ‌, పార్టీ నాయ‌కులు కాస్త ఐక‌మ‌త్యంతో ప్ర‌య‌త్నించి ఉంటే మ‌రిన్ని ఎంపీ స్థానాలు ఆ పార్టీకి ద‌క్కేవ‌నేది వాస్త‌వం. సీఎల్పీని గులాబీ పార్టీలో విలీనం చేసుకోవ‌డం, ఫిరాయింపుల్ని య‌థేచ్ఛ‌గా ప్రోత్స‌హిస్తూ ఉండ‌టం… ఇవ‌న్నీ తెరాస మీద ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను పెంచి, త‌మ‌కు అనుకూలంగా మారుతున్న అంశాలుగా కాంగ్రెస్ చెబుతోంది. అయితే, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆ మేర‌కు కాంగ్రెస్ మంచి ఫ‌లితాలు సాధిస్తే… ఇప్ప‌టికే డీలా ప‌డ్డ కేడర్లో కొంత కొత్త ఉత్సాహం రావ‌డం ఖాయం.

 

 

 

భ‌విష్య‌త్తుపై కొత్త ఆశ‌లు రేకెక్క‌త‌డం ఖాయం. ఇక‌, భీజేపీ… ఈ పార్టీకి నాలుగు ఎంపీ స్థానాలు రావ‌డంతో రాష్ట్రంలో తామే తెరాస‌కు ప్ర‌త్యామ్నాయం అంటోంది. పెద్ద ఎత్తున స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం ఇప్పుడు చేస్తోంది. ప్ర‌తిప‌క్ష పార్టీ రాష్ట్రంలో వీక్ గా ఉంది కాబ‌ట్టి, ఆ స్థానాన్ని తామే భ‌ర్తీ చేస్తామ‌ని నేత‌లు అంటున్నారు. తెలంగాణ‌లో త‌మ‌నే ప్ర‌జ‌లు ప్ర‌త్యామ్నాయంగా కోరుకుంటున్నార‌ని ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు.

 

 

 

ఒక‌వేళ ప్ర‌జ‌లు నిజంగానే ఆ త‌ర‌హా మార్పు బ‌లంగా కోరుకుంటే… మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో భాజ‌పాకి కొంత సానుకూల ఫ‌లితాలు రావాలి. ఈ ఫ‌లితాల ఆధారంగానే భాజ‌పా వ్యూహాలూ ఉంటాయి. మొత్తానికి, తెలంగాణ‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. మూడు ప్ర‌ధాన పార్టీల భ‌విష్య‌త్ వ్యూహాల‌ను నిర్దేశించేవిగా క‌నిపిస్తున్నాయి.

జగన్ కు షాకిచ్చిన కేంద్ర సంస్థలు

Tags: Whose calculations are theirs

పేద రైతు ఇంటికి ఎస్‌ఐ ఉద్యోగం

Date:22/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పేద రైతులైన తల్లిదండ్రుల కష్టాన్ని చూశాడు. పేదరికం చదువుకు అడ్డుకాదని నిర్ణయించుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని తనకు ఇష్టమైన ఎస్‌ఐ ఉద్యోగాన్ని సాధించుకున్న పెద్దిరెడ్డి వారి లోకేష్‌రెడ్డి గూర్చి వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జువ్వలదిన్నెతాండలో పేద రైతు పద్మావతమ్మ, అప్పిరెడ్డి దంపతుల కుమారుడు లోకేష్‌రెడ్డి బాల్యం నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివాడు. ఇలా ఉండగా ఎస్‌ఐ కావాలన్న ఆలోచనతో పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేటలో ఉన్న కుమార్‌ పోలీస్‌ కోచింగ్‌ సెంటర్‌లోశిక్షణ తీసుకుని 2016లో ఏఆర్‌ పోలీస్‌గా ఎంపికైయ్యాడు. కానీ ఎస్‌ఐ కావాలన్న లక్ష్యాన్ని మరచిపోకుండ పట్టుదలతో ఉద్యోగం చేస్తూ కుమార్‌ కోచింగ్‌ సెంటర్‌లోశిక్షణ తీసుకున్నాడు. కోచింగ్‌ నిర్వాహకులు కుమార్‌ , ఆనందకుమార్‌లు శిక్షణకు అవసరమైన మెలుకవలను నేర్పించారు. లోకేష్‌రెడ్డి 2019లో అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. తెలంగాణ ఏఆర్‌ ఎస్‌ఐగా ఎంపికైనట్లు సోమవారం ఉత్తర్వులు అందాయి. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు సంతోషంతో మునిగిపోయారు. లోకేష్‌రెడ్డి ఎంపిక కావడంపై కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు మిఠాయిలు పంపిణీ చేసి, లోకేష్‌రెడ్డిని పలువురు అబినందించారు.

బిజెపి సభ్యత్వం

Tags; SI job for poor farmer’s house

జోరుగా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు

Date:22/07/2019

మందమర్రి ముచ్చట్లు:

మందమర్రి పట్టణ మున్సిపాలిటి పరిదిలో చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశాల మేరకు 24వ వార్డులో టిఆర్ఎస్ పార్టీ సభ్యవత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమర్రి మండల జెడ్పిటిసి వేల్పుల రవి, పట్టణ టిఆర్ఎస్ పార్టీ సమన్వయ కర్త తోట సురేందర్  హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డు అధ్యక్షులు ఎదుల రాయమల్లు,కంది తిరుపతి,మహిళ నాయకురాలు మైసక్క,పెద్ది రాజాం,అవునూరి పాశం,అల్లంల పవయ్య,ఎండి. ఇబ్రహీం,పట్టణ టిఆర్ఎస్ పార్టీ నాయకులు బొరిగం వెంకటేష్, తుమ్మ శ్రీశైలం, రామక్రిష్ణ, శేఖర్, కె.తిరుపతి, టిఆర్ఎస్వి. టిఆర్ఎస్వై.నాయకులు. అరుణ్,వికాస్,సాయి తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి వృత్తి శిక్షణ కేంద్రం ఎన్.వి.టి.సి లో మెగా రక్తదాన శిబిరం

Tags: TRS party membership registration

టీ కాంగ్రెస్ కు దారేదీ 

-అధ్యక్షుడి కోసం వెయిటింగ్

Date:22/07/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

తెలంగాణలో వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నిలదొక్కుకోవడం కష్టంగానే మారింది. వరస ఓటములతో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో పడింది. నేతలందరూ పార్టీని వీడుతుండటంతో క్యాడర్ కూడా నిస్తేజంలోకి వెళ్లిపోయింది. అసెంబ్లీ, పార్లమెంటు, జిల్లా పరిషత్ ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనైనా నిలదొక్కుకుంటుందా? అన్న చర్చ పార్టీలోనే జరుగుతోంది. మరోవైపు నేతల మధ్య సయోధ్య లేకపోవడం, నాయకత్వ లోపం కాంగ్రెస్ కు తెలంగాణలో శాపంగా మారాయి.

 

 

 

కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువంటారు. అలాగే జిల్లాకో ముఖ్యమంత్రి స్థాయి నేతలు కూడా ఈ పార్టీలోనే కనిిపిస్తారు. అసెంబ్లీ ఎన్నికలలో దారుణ ఓటమిని చవిచూసిన తర్వాత కాంగ్రెస్ ముఖ్యనేతలు మౌనం పాటిస్తుండటంతో క్యాడర్ లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. ఎన్నికల సమయంలో బీఫారం కోసం పోటీ పడే నాయకులు ఎన్నికల అనంతరం కనిపించకుండా పోయారు. పేరుకు జాతీయ స్థాయి నాయకులున్నప్పటికీ పార్టీ కష్టాల్లో ఉన్న ప్పుడు మాత్రం వారు సైలెంట్ గా ఉండటం విశేషం.కాంగ్రెస్ పార్టీకి నాయకుల కొదవలేదు. అలాగని క్యాడర్ కూడా తక్కువేమీ కాదు. సీనియర్ నేతలు జైపాల్ రెడ్డి, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మధు యాష్కీ లాంటి వాళ్లు నోరుమెదపడం లేదు.

 

 

 

 

గత అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది శాసనసభ్యులు గెలిస్తే 12 మంది శానససభ్యులు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని కూడా విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా సీనియర్ నేతలు ఎవరూ దీనిపై పెద్దగా స్పందించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.ఇక కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు శాసనసభ్యులే ఉన్నారు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంటుకు ఎన్నిక కావడంతో తన శాసనసభ్యాత్వానికి రాజీనామా చేయడంతో ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. వీరిలో కూడా ఎవరి దారి వారిదే.

 

 

 

కోమటి రాజగోపాల్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇక జగ్గారెడ్డి సయితం తన నియోజకవర్గ ప్రయోజనాల కోసం పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కోలుకోలేని పరిస్థితిలో ఉంది. మరి సరైన నాయకుడు వస్తేనే తిరిగి పుంజుకునే అవకాశాలున్నాయి.

మున్సిపల్ ఎన్నికలకు కమలం నజర్

Tags: Tea Congress

మున్సిపల్ ఎన్నికలకు కమలం నజర్

-షా డైరక్షన్ లో ఇంచార్జీలు

Date:22/07/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. స్వయంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నేతలతో ఆయన ప్రత్యేకంగా మున్సిపల్ ఎన్నికలపై చర్చించడం విశేషం. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను సాధించిన బీజేపీ ఆ పట్టును నిలుపుకోవాలని భావిస్తుంది. ఇందుకోసం నేతలకు అమిత్ షా టార్గెట్ విధించారని చెబుతున్నారు.మున్సిపల్ ఎన్నికలంటే ప్రధానంగా అర్బన్ ప్రాంతాలు కావడంతో బీజేపీ తమకు పట్టు దొరుకుంతుందని భావిస్తోంది.

 

 

 

ప్రధానంగా ఉద్యోగులు, యువత తమ పార్టీ పట్ల అనుకూలంగా ఉన్నారని, మోదీ నాయకత్వం కూడా తమ గెలుపునకు ఉపకరిస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమాలను నిర్వహించి ప్రజలకు చేరువకావాలని నిర్ణయించింది. సెక్రటేరియట్, అసెంబ్లీ కూల్చివేతలపై కేసీఆర్ పై గళం పెంచాలని పార్టీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు.మరికొద్ది రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలు జరగనుండటంతో పక్కా ప్రణాళికను కమలం పార్టీ రూపొందించుకుంది. పార్టీలోకి వలసలను మరింతగా ప్రోత్సహించాలని నిర్ణయించింది. కీలకమైన నేతలను మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ముందుగానే చేర్చుకోవాలని నిశ్చయించారు.

 

 

 

 

మున్సిపల్ ఎన్నికల్లో పట్టు పెంచుకుంటే వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయవచ్చన్నది కమలనాధుల వ్యూహంగా కన్పిస్తోంది.మున్సిపల్ ఎన్నికల కోసం పకడ్బందీ ప్రణాళికను రూపొందించుకుంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసుకుంది. ఆ పార్లమెంటు పరిధిలోని మున్సిపాలిటీలకు ప్రధానమైన నేతలను ఇన్ ఛార్జిలుగా నియమించనున్నారు. వారికి నలుగురు సహాయకులను కూడా పార్టీ తరుపున ఇస్తారు. ఆ మున్సిపాలిటీలో గెలుపు బాధ్యతను వీరికే అప్పగిస్తారు.

 

 

 

ఈ ఐదుగురు నేతల్లో రాష్ట్ర స్థాయి నేతలతో పాటు స్థానిక నేతలను కూడా నియమించనున్నారు. వీరంతా ఆ మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేయాల్సి ఉంటుంది. ఇలా బీజేపీ పట్టణ ప్రాంతాల్లో జెండా ఎగురవేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాల్సి ఉంది.

రాపాక… కండువా మార్చేస్తారా..

Tags: Kamalam Nazar for municipal elections

ప్రభుత్వ ఇళ్ల కోసం ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు: కేటీఆర్‌

Date:20/07/2019

సిరిసిల్ల ముచ్చట్లు :

ప్రభుత్వ ఇళ్ల కోసం ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఆశావహులు ఎక్కువగా ఉన్న చోట లాటరీ తీసి ఇళ్లను కేటాయిస్తామన్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు అందిస్తామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పింఛన్లను 5 రెట్లకు పెంచుకున్నామని అన్నారు. బీడీ కార్మికులకు కూడా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.

 

 

 

 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆసరా పింఛన్ల ఉత్వర్వుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన సిరిసిల్లలో ప్రారంభించారు. ఈ సందర్భంగా  కేటీఆర్‌ మాట్లాడుతూ.. పింఛను అర్హత వయస్సు తగ్గింపు కూడా జూన్‌ నెల నుంచే వర్తిస్తుందని వెల్లడించారు. బీడీ కార్మికులకు పీఎఫ్‌ కటాఫ్‌ తేదీని తగ్గించడంతో కొత్తగా 2 లక్షల మందికి పింఛను అందుతుందన్నారు.

 

 

 

 

 

17 శాతం వృద్ధిరేటుతో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందని గుర్తు చేశారు.గృహనిర్మాణాల గురించి మాట్లాడుతూ.. పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల కింద విడుదల చేయాల్సిన రూ.65 కోట్లను త్వరలోనే విడుదల చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

నీటిని వృధా చేస్తే భారీ జ‌రిమానాలు

Tags: Don’t give anyone a single rupee for government houses: KTR

పాలమూరులో ఏడువందల చెరువులకు జలకళ

Date:20/07/2019

మహబూబ్ నగర్ ముచ్చట్లు:

పాలమూరు తెలంగాణలోనే అతిపెద్ద జిల్లా. దాదాపు 35లక్షల మంది నివసించే ఈ జిల్లా ప్రజల శ్రమకు ఒక గుర్తింపు ఉంది. అదే పాలమూరు లేబర్. వారు చిందించిన చెమటతో దేశంలోని ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించారు. వారి రక్తం అక్కడి మట్టిలో కలసిపోయింది. కానీ పాలమూరు జీవితాలకు వెలుగులిచ్చే, సాగునీటి ప్రాజెక్టులు మాత్రం దశాబ్దాల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోయి, పాలమూరు తరాల తలరాత మాత్రం మారలేదు. అయితే ఇదంతా గత కాలపు చేదు చరిత్ర. కరువుతో, కడగండ్లతో, కష్టాలతో ఏండ్ల తరబడి సహవాసం చేసిన పాలమూరు మట్టి మనుషులకు కొత్త
జీవితంలోకి అడుగులేస్తున్నారు.

 

 

 

మొత్తము విస్తీర్ణము 43.73 లక్షల ఎకరాలు. ఇందులో సాగుకు యోగ్యమైనది 35 లక్షల ఎకరాలు. రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, జూరాల, ఆర్డీఎస్, తుమ్మిళ్ళ, గట్టు, చిన్న నీటి చెరువుల కింద సుమారు 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మొత్తమ్మీద
తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో మహబూబ్‌నగర్ జిల్లా దశ, వలస జీవుల దిశ మారడం మొదలైంది.అత్యధిక చెరువులున్న జిల్లా కరువు జిల్లాగా, వలసల జిల్లాగా మారడం ఒక విచిత్రం, విషాదం.

 

 

 

 

 

 

పాలమూరు గోస తీర్చేందుకు తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కింద మహబూబ్ నగర్ జిల్లా చెరువుల పునరుద్ధరణ జరిగింది. పునరుద్ధరణ జరిగిన చెరువులను ఎత్తిపోతల పథకాలతో అనుసంధానం చేయడంతో వాటికి పూర్వ వైభవం వచ్చింది. జిల్లాలో దాదాపు 700లకు పైగా చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి.

 

 

 

 

దీనికి తోడు గత ఆరేళ్లుగా వాటర్ షెడ్ కార్యక్రమాల్లో చేపట్టిన జలసంరక్షణ పనులు కూడా పాలమూరు పచ్చగా మారడానికి కారణమయ్యాయి.మొన్నటి దాకా వలసల జిల్లాగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ఆరు లక్షల ఎకరాల బీడు భూములకు సాగు జలాలు అందాయి. కొత్తగా ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు వాటి ద్వారా చెరువులు, కుంటలు నుండి అదనంగా ఆరు లక్షల ఎకరాలు పచ్చబడ్డాయి. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద అదనంగా 25 వేలు, సంగంబండ, భీమా ప్రాజెక్టుల కింద 1.25 వేలు, కల్వకుర్తి కింద లక్ష ఎకరాలు, మిషన్ కాకతీయలో చెరువుల కింద 2
లక్షల ఎకరాలకు నీళ్లు అందాయి.

సీజనల్ వ్యాధులతో జరా భద్రం

Tags: Seven hundred ponds of water

కలెక్టర్ల చేతిలో  మున్సిపల్ ఛైర్మన్లు

Date:20/07/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ కొత్త మున్సిపల్ చట్టంలో అనూహ్యమైన విషయాలు ఉన్నాయి. మున్సిపల్ చైర్మన్‌లు అక్రమాలకు పాల్పడితే సస్పెన్షన్ వేటు వేసే అధికారాన్ని కొత్త చట్టం…కలెక్టర్లకు కల్పిస్తోంది. మున్సిపల్ చట్టం 1965, మున్సిపల్ చట్టం 1994 స్థానంలో కొత్త చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ మినహా.. మొత్తంగా 128 మున్సిపాలిటీలు. , 12 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలను పదిహేను రోజల్లో పూర్తి చేసేలా నిబంధనలు మార్చాలని బిల్లులో ప్రతిపాదించారు. ఎన్నికల నిర్వహణకు కాలవ్యవధిని కుదించారు.

 

 

పదిహేను రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ ముగిసేలా బిల్లులో ప్రతిపాదించారు..నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుండి పదిహేనవ రోజున పోలింగ్ నిర్వహించనున్నారు.. కౌంటింగ్ ఎప్పుడు నిర్వహించాలనేది మాత్రం ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుంది. అంటే రెండు వారాల్లో ప్రక్రియ ముగిసిపోతుంది. గతంలో..వరంగల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించినప్పుడు కూడా ఇంతే వేగంగా ప్రక్రియ పూర్తి చేశారు.  ప్రజలు ఎన్నుకున్నప్పటికీ.. కొత్త చట్టంలో… మున్సిపల్ చైర్మన్లకు విశేషాధికారులు లేవు. సస్పెన్షన్ విధించడానికి కలెక్టర్‌కు… అసలు తొలగించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. మున్సిపాలిటీల పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్లకు ప్రత్యేకమైన, అత్యవసరమైన అధికారాలు కల్పించారు. అక్రమాలకు పాల్పడే ఛైర్మన్లను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్లకు అప్పగించారు.

 

 

 

 

వీరిపై ఆరోపణలు రుజువైతే పూర్తిగా తొలగించే అధికారం ప్రభుత్వానిదేనని కొత్త బిల్లులో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలతో.. ఇక .. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు.. గెలిచినా… చైర్మన్ పీఠంలో ఉండాలంటే… ప్రభుత్వానికి అణిగిమణిగి ఉండాల్సిందే. మున్సిపల్ చైర్మన్లకు.. చట్టం చాలా బాధ్యతలు అప్పగిస్తోంది. ప్రతి నెలా మున్సిపల్ సమావేశాలు ఏర్పాటు చేయడమే కాదు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, చెత్త సేకరణ విషయాల్లో బాధ్యతలు నిర్ణయించారు. ప్రతీ మున్సిపాలిటీలో గ్రీన్ సెల్ ఏర్పాటు చేసి బడ్జెట్లో పది శాతం నిధులు కేటాయించాలని ప్రతిపాదించారు.

 

 

 

 

మొక్కలు నాటడం, నర్సరీలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. పార్క్ ల అభివృద్ధి, నిర్వహణ, నీటి వనరుల సంరక్షణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు చేపట్టాలని బిల్లులో పొందుపరిచారు. బోర్ ల వాడకం తగ్గింపు, వర్షపు నీటిని ఒడిసి పట్టే విధానలు తప్పని సరి చేయాలని బిల్లులో పేర్కొన్నారు.

చెప్పింది చేయడమే… అధికారులకు జగన్ క్లాస్

 

Tags: Municipal Chairmen in the hands of Collectors