తెలుగుముచ్చట్లు రంజాన్‌ శుభాకాంక్షలు

Date:04/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ యాజమాన్యం , సిబ్బంది శుబాకాంక్షలు తెలిపారు. ముస్లింలు సుఖసంతోషాలతో రంజాన్‌ పండుగను కుటుంబ సభ్యులతో కలసి నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

ఇట్లు…

తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ , పుంగనూరు .

9న బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక

Tags: Congratulations to Ramzan

మధులిక ఆరోగ్య పరిస్థితిపై యశోదా వైద్యులు హెల్త్‌ బులెటిన్‌

Date:07/02/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ఇంటర్‌ విద్యార్థిని మధులిక పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆమె మలక్‌పేటలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మధులిక ఆరోగ్య పరిస్థితిపై యశోదా వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం నిన్నంటి కంటే కాస్త మెరుగుపడినా.. ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలిపారు. మరో 24 గంటలు గడిస్తే గానీ మధులిక పరిస్థితి చెప్పలేమని చెప్పారు. ఆమె తలకు బలమైన గాయమైందని.. ఇంకా స్పృహలోకి రాలేదని తెలిపారు. మధులికకు పూర్తి స్థాయిలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. మధులిక తల కింది భాగంలో ఉండే ఒక ఎముక ఫ్యాక్చర్‌ అయిందని తెలిపారు.. బ్రెయిన్‌కు గాయం కావడంతో అపస్మారక స్థితికి చేరుకుందని వెల్లడించారు. అయితే.. నిన్నటి కంటే ఇవాళ రక్తపోటు కాస్త మెరుగైందని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ బర్కత్‌పుర ప్రాంతానికి చెందిన మధులిక (17)పై వాళ్లింటి సమీపంలో ఉండే భరత్‌ అలియాస్‌ సోను (20) అనే యువకుడు బుధవారం (ఫిబ్రవరి 6) ఉదయం కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడి చేశాడు. ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న మధులికను డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న భరత్ రెండేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. భరత్ వేధింపులు తీవ్రమవడంతో మధులిక నెల కిందట పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత అతడికి భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా.. అతడి ప్రవర్తనలో మార్పు కాకపోగా.. మధులికపై మరింత కోపం పెంచుకున్నాడు. తనను ప్రేమించడం లేదనే కక్షతో అమ్మాయిపై కొబ్బరి బొండాల కత్తితో దాడికి పాల్పడ్డాడు.
Tags: Health care physicians are health bulletin

తెలుగుముచ్చట్లు దీపావళి శుభాకాంక్షలు

Date:06/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

తెలుగుముచ్చట్లు పాఠకులకు , ప్రకటన దారులకు తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌, టీవిఛానల్‌ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పాఠకులు, ప్రకటనదారుల జీవితాల్లో దీపావళి వెలుగులు నిండి, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుతున్నారు.

తెలుగుముచ్చట్లు యాజమాన్యం .
(సౌదీ అరేబియా/ ఇండియా)

పుంజుకుంటేనే..ప్రభావం.. 

Tags: Congratulations Diwali