కమలం గూటికి పోంగులేటీ

Date:10/08/2019

ఖమ్మం ముచ్చట్లు:

తెలంగాణలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా మాజీ ఎంపీ వివేక్ బీజేపీలో చేరడంతో… మరికొందరు ముఖ్యనేతలు కూడా తమ పార్టీలోకి వస్తారని తెలంగాణ కమలనాథులు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ… టీఆర్ఎస్,కాంగ్రెస్‌లో అసంతృప్తిగా ఉన్న నేతలకు గాలం వేస్తోంది. ఈ క్రమంలోనే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా త్వరలోనే బీజేపీ గూటికి చేరతారని ఊహాగానాలు జోరందుకున్నాయి.

 

 

 

2014 ఎన్నికల్లో వైసీపీ తరపున ఖమ్మం లోక్ సభ సభ్యుడిగా ఎన్నికైన పొంగులేటి… ఆ తరువాత టీఆర్ఎస్‌లో చేరిపోయారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడ్డ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ సీటు నిరాకరించింది టీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి పొంగులేటి ప్రయత్నించారనే ఆరోపణల కారణంగానే ఆయనను పార్టీ నాయకత్వం పక్కనపెట్టిందనే వార్తలు వినిపించాయి.

 

 

 

అయితే మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో తనకు ఎంపీ సీటు దక్కకపోయిన టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు గెలుపు కోసం కృషి చేశారు పొంగులేటి. అయితే పార్టీ కోసం ఎంతగా కష్టపడినా… తనకు పెద్దగా గుర్తింపు లభించడం లేదనే భావనలో పొంగులేటి ఉన్నట్టు తెలుస్తోంది. తనకు ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పోస్టు ఇస్తామని గతంలో టీఆర్ఎస్ నాయకత్వం హామీ ఇచ్చిందని… కానీ దాన్ని కేసీఆర్, కేటీఆర్ పట్టించుకోవడం లేదనే భావనలో పొంగుటేని ఉన్నట్టు ఖమ్మం రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

 

 

 

 

పొంగులేటి అసంతృప్తిని గమనించిన బీజేపీ నేతలు ఇటీవల ఆయనతో చర్చలు జరిపారని… పార్టీలోకి వస్తే సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే బీజేపీ చీఫ్ అమిత్ షా వస్తారని… అప్పుడు పొంగులేటి బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలంగాణ బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు.

 

ఏపీలో వరద రాజకీయం

Tags: Pomegranate

తెలంగాణలో టిక్ టాక్ బ్యాన్ దిశగా అడుగులు

Date:06/08/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

టిక్ టాక్.. ఇప్పుడు యువతలలో బాగా క్రేజ్ తెచ్చుకున్న యాప్. మరీ ముఖ్యంగా యూత్‌లో టిక్ టాక్ అనే పిచ్చి నరనరాల్లోకి ఎక్కిపోయింది. ఎప్పుడూ చూసిన టిక్ టాక్ వీడియోలు చేస్తూ చూస్తూ అందులో మునిగి తేలిపోతున్నారు యువతీ యువకులు. ఈ క్రమంలోనే అనేకమంతి తమ ఉద్యోగాలను సైతం కోల్పోయే పరిస్థితి. వయస్సుతో పనిలేకుండా ఈ పిచ్చిలో పడి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటుండగా.. మరికొందరు ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా వైరల్‌గా మారిన టిక్‌ టాక్‌ యాప్‌ను పలు రాష్ట్రాలు నిషేధించే పనిలో పడ్డాయి.ఈ మేరకు లేటెస్ట్ గా ఏడు రాష్ట్రాలు కేంద్రానికి ఫిర్యాదులు చేశాయి.

 

 

 

ఆ ఏడు రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. తెలంగాణ, తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌, కర్ణాటక రాష్ట్రాలు ఈ యాప్‌ను బ్యాన్‌ చేయాలని కోరుతూ ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశాయి. దీనిపై స్పందించిన కేంద్రం 24 ప్రశ్నలతో కూడిన నోటీసులను ఆయా యాప్‌ల కంపెనీలకు జారీ చేసింది. ఈ ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుంటే తగిన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో కేంద్రం సదరు కంపెనీలను హెచ్చరించింది.  ఇప్పటికే తెలంగాణలో ఆన్ లైన్ గేమ్ లకు సంబంధించి కొన్నింటిని బ్యాన్ చేసి ఉన్నారు. ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ పై ఎటువంటి నిర్ణయం వస్తుందో చూడాలి.

ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు

Tags: Steps towards Tic Tac Ban in Telangana

గ్రేటర్ నేతలపై కేటీఆర్ సీరియస్ 

Date:01/08/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు  పార్టీ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్. ర్టీ  అధినేత కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ  పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. కేవలం ఒక నెల రోజుల్లో నియోజక వర్గానికి 50000 చొప్పున పార్టీ సభ్యత్వలు చేయాలని నేతలకు టార్గెట్ పెట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి మినహా అన్ని జిల్లాల నేతలు తమ టార్గెట్ ని రీచ్ అయ్యారు . నిన్నటి వరకు పార్టీ సభ్యత్వం 50 లక్షలకు చేరిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.

 

 

 

అయితే, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీ సభ్యత్వ నమోదు మందకొడిగా సాగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టిన టార్గెట్ ని ఒక్క నియోజక వర్గ నేత కూడా చేరలేదు.దీనితో నేరుగా  జిల్లా నేతలందరిందరిని తెలంగాణ భవన్ కి పిలిపించి సమావేశమయ్యారు కేటీఆర్. ఒక్కో నియోజక వర్గ నేతలతో నేరుగా మాట్లాడి ఎందుకు సభ్యత్వ నమోదు చేయలేక పోయారో అని ఆడిగితెలుసుకున్నారు. కొందరు నేతలు తమ నియోజక వర్గాల్లో ఉన్న సమన్వయ లోపం గురించి కేటీఆర్ కి చెప్పుతే..మరికొందరు నేతలు మాత్రం బోనాల పండుగ సందర్భంగా సభ్యత్వాలపై దృష్టి పెట్టలేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

 

 

 

 

 

మంత్రులుగా ఉండి ఎం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.   సభ్యత్వ నమోదు పూర్తి స్థాయిలో చేయడానికి కొంత సమయం కావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేటీఆర్ ని కోరారు. ఈ నెల పది  తేదీ వరకు సభ్యత్వాలు పూర్తి చేస్తామని ఇద్దరు మంత్రులు కేటీఆర్ కి హామీ నిచ్చారు. మరి ఇచ్చిన టైం వరకు అయిన గ్రేటర్ నేతలు సభ్యత్వాలు పూర్తి చేస్తారో లేదో చూడాలి.

 

తల్లిపాల వారోత్సవాలు

Tags: KTR Serious on Greater Leaders

తెరపైకి పసుపు బోర్డుతో…బీజేపీకి చెక్

Date:31/07/2019

నిజామాబాద్ ముచ్చట్లు:

తెలంగాణలో బలోపేతం కావాలిన బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అనిపించుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టడానికి రకరకాల ప్లాన్లు వేస్తోంది. అయితే, తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అందుకు తగ్గట్టు కౌంటర్లు రెడీ చేస్తున్నట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీల్లో ముఖ్యమైనది నిజామాబాద్‌లో పసుపుబోర్డు. నిజామాబాద్‌లో బీజేపీ గెలిపిస్తే ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తీసుకొస్తానని ఆ పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పోటీ చేశారు. దీంతో జనం కూడా బీజేపీని నమ్మారు.

 

 

 

సీఎం కుమార్తె కవితను కాదని, ధర్మపురి అరవింద్‌కు ఓటేసి విజయాన్ని కట్టబెట్టారు. అయితే, ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి కొలువుదీరి 50 రోజులు పూర్తయ్యాయి. అయినా ఇంతవరకు పసుపు బోర్డు మాటెక్కడా వినిపించడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో చాలా బిల్లులను ప్రవేశపెట్టారు.

 

 

 

కానీ, పసుపుబోర్డుకు సంబంధించి ఎలాంటి ప్రకటనా రాలేదు.వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలనేది బీజేపీ ప్లాన్. ముఖ్యంగా బీజేపీ ఎంపీలు గెలిచిన చోట్ల పట్టణ ప్రాంతాల్లోని విజయబావుటా ఎగరేయాలని వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలో ఏ నిజామాబాద్‌లో అయితే బీజేపీ ఘనవిజయం సాధించిందో.. అదే చోట మున్సిపల్ ఎన్నికల్లో జెండా ఎగరేసి కారు జోరు తగ్గలేదని నిరూపించుకోవాలని చూస్తోంది. ఆ రకంగా బీజేపీ గెలుపు కేవలం గాలివాటం మాత్రమేనని, టీఆర్ఎస్ సత్తా తగ్గలేదని నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

టీడీపీలో ఆగస్టు టెన్షన్ 

Tags: With a yellow board on the screen … check for BJP

రాజకీయ వైరాగ్యంతో మధుయాష్కీ

Date:30/07/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ప్రత్యేక స్థానం సంపాయించుకున్న నాయ‌కుడు మ‌ధుయాష్కీ గౌడ్‌. వైఎస్‌కు అత్యంత స‌న్నిహితుడుగా ముఖ్యంగా కేంద్రంలోని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో నేరుగా సంబంధ బాంధ‌వ్యాలు నెరిపే యాక్సెస్ ఉన్న నాయ‌కుడిగా గుర్తింపు పొందిన నాయ‌కుడు. అయితే, ఇప్పుడు మాత్రం ఆయ‌న రాజ‌కీయ వైరాగ్యంతో నిలువునా ఒణికి పోతున్నారు. త‌న‌కు ఇక‌, రాజ‌కీయంగా ఫ్యూచ‌ర్ దాదాపు లేన‌ట్టేన‌ని త‌న అనుచ‌రుల‌తో చెప్పుకొస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అసలు మ‌ధు యాష్కీ గౌడ్ రాజ‌కీయాలు ఏంటి? ఎందుకిలా మారాయి? అనే విష‌యం చ‌ర్చకు వ‌స్తోంది.విష‌యంలోకి వెళ్తే..

 

 

కాంగ్రెస్ కోట‌రీలో కీల‌క నాయ‌కుడిగా ఎదిగారు మ‌ధు యాష్కీ. వైఎస్ సీఎంగా ఉన్న కాలంలో ఆయ‌న‌కు అత్యంత ప్రియ‌మైన నాయ‌కుడిగా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం పెరుగుతున్న ద‌శ‌లో దానిని అణిచి వేసేందుకు వైఎస్ కొంద‌రు నాయ‌కుల‌ను వినియోగించుకుని కేసీఆర్ స‌హా కొంద‌రు తెలంగాణ వాదుల‌పైనా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవ‌స‌రంలేద‌నే విష‌యంపైనా విమ‌ర్శలు చేయించారు. ఇలాంటి వారిలో మ‌ధుయాష్కీ ఒక‌రు వైఎస్ చెప్పిన‌ట్టు మ‌ధుయాష్కీ న‌డుచుకున్నారు.

 

 

 

 

ఈ క్రమంలోనే ఆయ‌న‌కు కేంద్రంలోని కాంగ్రెస్ నేత‌ల‌తోనూ ప‌రిచ‌యం ఏర్పడింది.2004, 2009 ఎన్నిక‌ల్లో నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో మ‌ధుయాష్కీ విజ‌యం సాధించారు. వ‌రుస విజ‌యాల‌తో మ‌ధుయాష్కీ జోరెత్తి పోయారు. చాలా మంది మ‌ధుయాష్కీ సిఫార్సుల‌తో ప‌ద‌వులు పొందిన వారు కూడా ఉన్నారు. అయితే, రాజ‌కీయాల్లో ఓడ‌లు ఎప్పుడు బ‌ళ్లవుతాయో.. బ‌ళ్లు ఎప్పుడు ఓడ‌ల‌వుతాయో చెప్పడం క‌ష్టం. అదేవిధంగా మ‌ధుయాష్కీ రాజ‌కీయాలు కూడా తెలంగాణ ఏర్పాటుతో త‌ల్లకిందుల‌య్యాయి.

 

 

 

కొన్నాళ్ల పాటు తెలంగాణ‌ను వ్యతిరేకించిన ఆయ‌న స్వయంగా తెలంగాణ వాదిగా ముద్ర వేయించుకునేందుకు చాలా కాలం ప‌ట్టింది. అయిన‌ప్పటికీ.. 2014 ఎన్నిక‌ల్లో మ‌ధుయాష్కీ నిజామాబాద్‌లో ఘోరంగా ఓడిపోయారు. కేసీఆర్ కుమార్తె క‌విత‌పై దాదాపు ల‌క్షా అర‌వై వేల ఓట్ల తేడాతో ఓట‌మిని చ‌విచూడాల్సి వ‌చ్చింది.ఇక‌, ఆ త‌ర్వాత మ‌ధుయాష్కీ నిజామాబాద్ మొహం కూడా చూసింది లేదు. ఇక‌, తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌ధుయాష్కీని తిరిగి నిజామాబాద్ నుంచి పోటీ చేయాల‌ని చెప్పినా.. ఆయ‌న సుముఖత వ్యక్తం చేయ‌లేదు.

 

 

 

న‌ల్లగొండ జిల్లా భువ‌న‌గిరి నుంచి పోటీ చేయాల‌ని భావించారు. అయితే, కోమ‌టిరెడ్డి కార‌ణంగా మ‌ధుయాష్కీ దానికి దూర‌మై.. త‌ప్పని ప‌రిస్థితిలో నిజామాబాద్ నుంచే పోటీ చేయాల్సి వ‌చ్చింది. అయితే, ఈ ద‌ఫా మ‌ధుయాష్కీకి మ‌రింత చేదు అనుభ‌వం ఎదురైంది. సిట్టింగ్ ఎంపీ క‌విత ఓడిపోయింది. అదేస‌మ‌యంలో ఇక్కడ నుంచి ప్రయోగాత్మకంగా పోటీ చేసిన బీజేపీ విజ‌యం సాధించింది. ఇక‌, క‌విత‌కు వ్యతిరేకంగా ప‌సుపు రైతులు పోటీ చేయ‌గా వారంతా 98 వేల పైచిలుకు ఓట్లు తెచ్చుకోగా.. యాష్కీ కేవ‌లం 60 వేల ఓట్లతో స‌రిపెట్టుకుని చివ‌ర‌కు డిపాజిట్ కూడా పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేయాల‌నే విష‌యం మ‌ధుయాష్కీకి త‌ల‌నొప్పిగా మారింది.

 

 

 

 

 

రాహుల్ వ‌ర్గంగాపేరు తెచ్చుకున్న ఆయ‌న .. ఇప్పుడు పార్టీ అధ్యక్ష ప‌ద‌వికి రాహులే రాజీనామా చేయ‌డంతో ఫ్యూచ‌ర్ పై విర‌క్తి ఏర్పడింది. ఇక‌, రాజ‌కీయంగా త‌న‌కు ఫ్యూచ‌ర్ లేద‌ని మ‌ధుయాష్కీ భావిస్తున్నారు. ఇక‌, నిజామాబాద్‌లో బీజేపీ పుంజుకోవ‌డం మ‌రింత అశ‌నిపాతంగా మారింది. వాస్తవానికి మ‌ధుయాష్కీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌లోని ఓ వ‌ర్గమే.. నిజామాబాద్‌లో బీజేపీకి అనుకూలంగా వ్యవ‌హ‌రించింద‌నే వ్యాఖ్యలు వినిపించాయి. ఏదేమైనా మ‌ధుయాష్కీ ఫ్యూచ‌ర్ ప్రశ్నార్థకంగా మారింది. మ‌రి ఆయ‌న ఏం చేస్తారో చూడాలి.

ఆసక్తికరంగా మారుతున్న సైకిల్ కమలం పోరు

Tags: Madhuyashki with political rivalry

రోజుకో మలుపు తిరుగుతున్న ఎర్రమంజిల్ వివాదం 

Date:27/07/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ సర్కారు కోత్తగా నిర్మించబోయే అసెంబ్లీ నిర్మాణం సవాల్ చేస్తూ దాఖలైనా పిటీషన్ల పై డివిజెన్ బెంచ్ మరో మారు విచారణ జరిపింది. ఇప్పటికే ఎర్రమంజిల్ కూల్చివేత, కొత్త అసెంబ్లీ నిర్మాణం వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం  ఆర్ అండ్ బి వివరణ తో పాటు అర్బన్ డవలప్ మెంట్ అథారిటీ అనుమతులు,వాటి పరిధుల పై వివరణ కోరింది. ప్రస్తుతం నూతన అసెంబ్లీ భవనానికి ఎంత స్థలం అవసరముంటుందని చీఫ్ ఇంజనీరింగ్ ను ప్రశ్నించగా సుమారు 20 ఏకరాలు అవసరం ఉంటుందని,వీటిలోని నూతన అసెంబ్లీ, మండలి భావనాల తో పాటు స్పీకర్, మండలి చైర్మన్ ,కార్యదర్శులకు అక్కడే ఉండే విధంగా వసతి గృహాలు నిర్మిస్తున్నారని కోర్ట్ కు తెలిపారు.

 

ఇక మరో వైపు అర్బన్ రూరల్ డవలప్ మెంట్ అథారిటీ విధి విధానాలు,అనుమతులు, వాటి చట్టాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ తరపున న్యాయవాది కోర్టుకు  అందజేసారు. ఎర్రమంజిల్ అసెంబ్లీ భవనాల కూల్చివేత పై హెచ్ఎండిఎ  2018 యాక్ట్ పై వాదనలు విన్న న్యాయస్థానం హెచ్ ఎం డి ఎ మాస్టర్ ప్లాన్ సమర్పించాలని  అర్బన్ డవలప్ మెంట్ అథారిటీ కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎర్రమంజిల్ భవనం నిర్మించే ప్రాంతం ఏ జోన్ పరిధిలో కి వస్తుందన్న  విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయని అర్బన్ అండ్ రూరల్ డవలప్ మెంట్ అథారిటీ తరపు న్యాయవాది ని కోరింది.

 

 

 

తదుపరి విచారణను వచ్చే మంగళవారం కు వాయిదా వేసింది హైకోర్టు. అయితే ఒక వైపు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు  ప్రజా సంఘాల నాయకులు న్యాయపోరాటం చేస్తూన్నారు. మరోవైపు అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకు వచ్చి ప్రజా పోరాటాలు చేపట్టారు.

 

 

ఎర్రమంజిల్ పురాతన భవనం కూల్చివేత,నూతన భవనాల నిర్మాణం పై దాఖలైన పిటీషన్ల వాదనలు బలంగా వినిపిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ వాదనలు కూడా ఉన్నాయి.  అయితే తదుపరి విచారణ లో కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందనే ఉత్కంఠ మాత్రం ఇంకా కొనసాగుతుంది.

తిరుమలలో నటుడు పృథ్వీ

 

Tags: The red-moon controversy that is turning into a daily routine

బిజెపి సభ్యత్వ నమోదు ప్రారంభించిన గడ్డంకృష్ణారెడ్డి

Date:27/07/2019

మహబూబ్ నగర్ ముచ్చట్లు:

మల్దకల్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం  సభ్యత్వ నమోదు గడ్డం కృష్ణారెడ్డి రాష్ట్ర నాయకులు చిలువేరు జగన్నాథం రాజశేఖర్రెడ్డి  ప్రారంభించారు ఈ సందర్భంగా గడ్డం కృష్ణారెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి పార్టీ దేశ వ్యాప్తంగా లక్షలాది మంది సభ్యత్వం కలిగి ఉన్నదని భవిష్యత్తులో తెలంగాణలో కూడా బలమైన పార్టీగా ఆవిర్భవిస్తుందని అన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గ్రామ నాగరాజు చంద్రశేఖర్రెడ్డి ఎంపీటీసీ లక్ష్మన్న రాముడు గోవిందు మండల ఇన్చార్జి రాజశేఖర్ రెడ్డి  దామ వెంకటేష్ రఘుపతి ఆయా గ్రామాల బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పేదల పెన్నిది ముఖ్యమంత్రి కేసీఆర్

Tags: Gaddamkrishna Reddy, who launched the BJP membership

పేదల పెన్నిది ముఖ్యమంత్రి కేసీఆర్

– ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

Date:27/07/2019

కొల్లాపూర్ ముచ్చట్లు:

కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామములో   గ్రామ సర్పంచ్  మండ్ల కృష్ణయ్య  అధ్యక్షతన పెంచిన ఆసరా పింఛన్స్  ప్రొసీడింగ్ లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి,  ఎంపీపీ గాదెల సుధారాణి, జడ్పీటీసీ భాగ్యమ్మ, వైస్ ఎంపీపీ భోజ్యా నాయక్ ,గ్రామ సర్పంచ్ కృష్ణయ్యలు అందజేశారు.  తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం, వారి పెద్ద కొడుకుగా  ముఖ్యమంత్రి కేసీఆర్   రూ. 1000 నుండి 2016, దివ్యాంగుల కొరకు రూ.1500 నుండి 3016 వరకు ఆసరా పింఛన్లు పెంచడం జరిగిందని  ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి  అన్నారు.  57 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు ఆసరా పించన్లకు దరఖాస్తు చేసుకోవాలి. దళారులను నమ్మొద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు అందజేస్తామని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చించెట్టి సత్య నారాయణ , వార్డ్ నెంబర్లు, ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు,  గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇల్లెందు  ఆస్పత్రిలో  సమస్యల వెల్లువ

Tags: Chief Minister KCR