టీ బీజేపీకి కొత్త బాస్

Date:27/07/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్న బీజేపీ… ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ… మున్సిపల్ ఎన్నికల్లోనూ సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు సాధించి తెలంగాణలో మరింతగా ఎదగాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే అంశంపై ఆ పార్టీ అధినాయక త్వం దృష్టి పెట్టినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 

 

 

ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవిచూసిన బీజేపీ… లోక్ సభ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటింది. అయితే ఆయనకు మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడం కష్టమే అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు ఆ పార్టీలోని పలువురు నాయకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో పాటు మాజీమంత్రి డీకే అరుణ కూడా తెలంగాణ బీజేపీ చీఫ్ పదవిపై కన్నేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ కుమార్తెను కవితను ఓడించిన వ్యక్తిగా అరవింద్‌కు బీజేపీలో మంచి గుర్తింపు వచ్చింది.

 

 

 

దీనికి తోడు బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కూడా కావడం ఆయనకు కలిసొచ్చే విషయం. మరోవైపు తెలంగాణలో కీలకమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన డీకే అరుణకు రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఇవ్వడం ద్వారా ఆ సామాజికవర్గాన్ని ఆకర్షించవచ్చనే భావనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

 

 

 

అయితే ఇందుకోసం ఈ ఇరువురు నాయకులు మధ్య పోటీ ఎక్కువైతే మాత్రం… మధ్యేమార్గంగా మరో నాయకుడికి బీజేపీ నాయకత్వం రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఇచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణ బీజేపీకి కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేయాలని భావిస్తున్న ఆ పార్టీ పెద్దలు… ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

వరదలకు ప్రాణాలు కోల్పయిన మూగజీవాలు

Tags: Tea is the new boss for BJP

తెలంగాణలో బెంగాల్ తరహా బీజేపీ వ్యూహం! 

– అమిత్ షా వ్యూహం ఫలించేనా?

 

Date:25/07/2019

హైదరాబాద్‌ముచ్చట్లు:

;తెలంగాణలో బెంగాల్ తరహా వ్యూహం అమలు చేసేందుకు బీజేపీ రంగం సిద్దం చేస్తోనట్లు తెలుస్తుంది.పార్టీ అధినేత అమిత్ షా మదిలో మెదులుతున్న స్ట్రాటజీ ఇదేనా..  అంటే అవుననే అంటున్నాయి ఆపార్టీ వర్గాలు.  రాష్ట్రంలో నాలుగు ఎంపీ స్థానాలను దక్కించుకున్న బీజేపీ – 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు కదులుతోంది. తెలంగాణలో బలపడేందుకు రకరకాల వ్యూహాలకు పదునుపెడుతోంది. ఈక్రమంలోనే తెలంగాణలోని ఒకప్పటి కమ్యూనిస్టు కంచుకోటలపై కషాయ జెండా ఎగురవేసేందుకు సిద్ధమవుతోంది.

 

 

 

లెఫ్ట్ భావాలు వదిలేసి – రైట్ రైట్ అనే నేతల కోసం ఇప్పటి నుంచే అన్వేషణ మొదలుపెట్టిందట భారతీయ జనతా పార్టీ. ఎలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తోంది బీజేపీ.  ఇందులో భాగంగా తెలంగాణలో కమ్యూనిస్టు కంచుకోటలపై ఆ పార్టీ అధిష్టానం కన్నేసినట్లు తెలుస్తోంది.  పశ్చిమబెంగాల్ అమలు చేసిన విధానాన్ని ఇక్కడ కూడా అప్లై చేయడానికి పకడ్బందీగా ప్లాన్ రెడీ చేస్తోంది. రాష్ట్రంలో వామపక్షపార్టీలు రోజురోజుకూ బలహీనపడుతున్నాయి.ఇక అధికార టీఆర్ ఎస్ ను ఎదుర్కొనే మద్దతు కూడా కమ్యూనిస్టు పార్టీలకు లే కుండాపోయింది. దీంతో అదే పార్టీలోని కొందరు కమ్యూనిస్టు నేతలే – గులాబీని ఢీకొట్టేందుకు కాషాయం వైపు చూస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 

 

 

 

ఒక అధికార పార్టీని ఎదుర్కొవాలంటే – మరో అధికార పార్టీనే సరైన ఆయుధమన్న నిర్ణయానికి కామ్రేడ్లు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే తమ రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి లెఫ్టు పార్టీల నేతలు రైట్ భావాలు తగిలించుకుని బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.ఇప్పటి వరకు కేవలం కాంగ్రెస్ – టీడీపీ నేతలపైనే కన్నేసిన కాషాయ పార్టీ –

 

 

 

ఇక కమ్యూనిస్టులను తమ గూటికి చేర్చుకునేందుకు సిద్దమవుతోంది. గతంలో కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న హుస్నాబాద్ నియోజికవర్గంలో – ఆ జిల్లా సీపీఐ కార్యదర్శి రాంభూపాల్ రెడ్డితో పాటు అదే జిల్లాకు చెందిన కమ్యూనిస్టులను చేర్చుకుంది బీజేపీ. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ – మాజీ మంత్రి డికే అరుణ మధ్యవర్తిత్వం ఫలించడంతో – కమ్యూనిస్టులు కాషాయగూటికి చేరారు. దీంతో బీజేపీ బెంగాల్ వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు సిద్దమవుతోందనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.కరీంనగర్తో ప్రారంభించినా –

 

 

 

 

త్వరలో నల్గొండ – ఖమ్మం జిల్లాల్లో కూడా కమ్యూనిస్టులను తమ పార్టీలో చేర్చుకునేందుకు నేతలు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక కాంగ్రెస్ – టీడీపీ – సీపీఐ – సీ పీఎంలనే కాదు – అధికార టీఆర్ ఎస్ పైనా ఆకర్ష్ మంత్రం ప్రయోగిస్తోంది బీజేపీ. అయితే గులాబీ నుంచి కమలం గూటికి వచ్చేందుకు ఇప్పటివరకైతే ఎవరూ సిద్దంగా లేరని తెలుస్తోంది. అందుకే మిగతా పార్టీల నేతలకు వల వేసేందుకు సిద్ధమవుతున్నారట కమలనాథులు.

చిన్న సమస్యలకే ఆత్మహత్యలు…

 

Tags: Bengal-style BJP strategy in Telangana!

సీనియర్ సిటీజన్ల గిఫ్ట్ ఎస్మైల్  కేటీఆర్ జన్మదిన వేడుకలు

– మొక్కలు  పంపిణీ,నేత్ర, అవయవ దానాలు.

Date:24/07/2019

జగిత్యాల  ముచ్చట్లు:

తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో టీ అర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని  తెలంగాణ పెన్షనర్ల, టీ బీసీ ఐకాస  జిల్లా సంఘాలకు గిఫ్ట్ ఏ స్మైల్  స్పూర్తి గా మొక్కలు అందజేశారు. బుధవారం సంఘ కార్యాలయంలో తెలంగాణ అల్ సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో కేటీ ఆర్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి వివిధ సంఘాలకు మొక్కలు పంపిణీ చేశారు.నేత్ర దాన,అవయవ దానాలకు అంగీకార పత్రాలను స్వీకరించారు.

 

 

 

మాజీ ఎంపీ కవిత గ్రీన్ ఛాలెంజ్ స్ఫూర్తిగా1116 మొక్కలు  నాటిన    పెన్షనర్ల సంఘ కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథ్ కు గ్రీన్ ఛాలెంజ్ పురస్కారాం అందజేశారు.  . ఈ సంధర్బంగా హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ మాజీ ఎంపీ కవిత గ్రీన్ ఛాలెంజ్  స్పూర్తితో 1116 మొక్కలు నాటామని,అలాగే కె టీ ఆర్  స్పూర్తితో 2116 మొక్కలు పంపిణీ చేశామన్నారు.

 

 

 

ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సిటీజన్ల అధ్యక్షుడు హరి అశోక్ కుమార్,కార్యదర్శి గౌరి శెట్టి విష్వనాథం, మాజీ మున్సిపల్ చైర్మన్ జీ ఆర్ దేశాయ్,పెన్షనర్ల జిల్లా కార్యదర్శి  విజయ్,టీబీసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బండారి విజయ్,జిల్లా ఉపాధ్యక్షుడు పంబాల రామ్ కుమార్,సీనియర్ సిటీజన్ల నాయకులు ప్రసాద్,విద్యా సాగర్,నారాయణ,ప్రకాష్ రావు,మానాల కిషన్,చంద్రమౌళి,సింగం గంగాధర్, కరుణ, కమల తదితరులు పాల్గొన్నారు.

హజ్ హౌస్ ను ప్రారంభించిన హోం మంత్రి మహమూద్ అలీ‌

Tags: Birthday Celebrations of Senior Citizens Gift Esmail Ktr

కేసీఆర్ చింతమడక ముఖ్యమంత్రి

Date:24/07/2019

దుబ్బాక ముచ్చట్లు:

రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేసి బీజేపీ ప్రభుత్వం ను ఏర్పాటు చేస్తామని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక లో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమనికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హాజరయ్యారు ఇక దుబ్బాక లో గడప గడపకు తిరుగుతూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రజల చే చేపించారు .అనంతరం దుబ్బాక కు చెందిన తెరాస నాయకులను బీజేపీ పార్టీలోకి కండువా కప్పి ఆయన సాదరంగా ఆహ్వానించారు ఆయన మీడయాతో మాట్లాడుతూ కెసిఆర్  ఒక్క చింతమడక గ్రామానికే ముఖ్యమంత్రి లాగా వ్యాహరిస్తున్నరని మరి తెలంగాణ లో నీ మిగతా ప్రజానీకం ఎం పాపం చేసిందని ఆయన అన్నారు .

 

 

రాష్ట్రంలో విద్యా, ఉద్యోగం, ఉపాధి వంటి సమస్యలు చాలా వున్నాయని మరి
వాటిని గాలికి వదిలేసి మాయ మాటల తో పబ్బం గడుపుకోడం బాధాకరం గడిచిన పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని తెలంగాణ రాష్ట్రన్ని అప్పుల తెలంగాణ గా చేసిన కెసిఆర్ కి రాబోవు కాలంలో ప్రజలు, రైతులు, యువకులు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోకవర్గ ఇంచార్జ్ మాధవనేని. రఘునందన్ రావు బీజేపీ జిల్లా నాయకులు బలేష్ గౌడ్, చింత.సంతోష్ కుమార్, తదితరులు  ఉన్నారు.

కౌలు రైతులను ఆదుకోవాలి

Tags: KCR worried Chief Minister

అలుపెరుగని యువ నాయకుడు కేటీఆర్ 

– ఎమ్మెల్యే వీఎం అబ్రహం

Date:24/07/2019

గద్వాల ముచ్చట్లు:

జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా లోని తెరాస పార్టీ కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ 43 వ జన్మదిన  వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం హజరయ్యారు.  ఈ సందర్భంగా కేకులు కట్చేసి కార్యకర్తలకు ఆయా గ్రామాల ఎంపీటీసీలకు సర్పంచ్లకు మండల జెడ్పిటిసిలకు ఎమ్మెల్యే స్వయంగా కేకు తినిపించి కేటీఆర్ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు, అనంతరం విలేఖర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అలుపెరుగని పోరాట యోధుడు. చిరకాలం ప్రజల  ఆకాంక్షలను నెరవేర్చే యువకిశోరం కల్వకుంట్ల తారక రామారావు అని కొనియాడారు.

 

 

 

ఒకవైపు రాష్ట్ర అభివృద్ధిని మరోవైపు పార్టీ బలోపేతం చేయుటకు ఆయన వంతు కృషిగా ఇప్పటివరకు 70 లక్షల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఘనత కూడా కేటీఆర్ కే దక్కుతుందని ఆయన అన్నారు,  ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన కోరారు.

 

 

 

ఈ కార్యక్రమంలో ఉండవెల్లి టీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ఉండవల్లి ఎంపిపి బిసమ్మా, వైస్ ఎంపిపి దేవన్న, ఉండవెల్లి మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు  లోకేశ్వర్రెడ్డి, మానవపాడు సర్పంచ్   హేమా దామోదరరెడ్డి, వడ్డెపల్లి జడ్పిటిసి  రాజు, ఉండవెల్లి సర్పంచ్ రేఖా  వెంకట్ గౌడ్, నార్టీ నేతలు పల్లెపాడు శంకర్ రెడ్డి, తనగల సీతారామిరెడ్డి, మానోపాడు గొల్ల వెంకట్రాములు, డాక్టర్ రమణ, మాజీ ఎంపిపి సుదర్శన్ గౌడ్ ,మాజీ జోగులాంబ చైర్మన్ నారాయణరెడ్డి, వెంకటరామ శెట్టి,  యువ నాయకులు కిషోర్ సురేష్, గోపల్దిన్నె రవి,    భట్ల దీన్ని సురేష్,  బోరవెల్లి వెంకటేశ్, ఇతరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కారులో చిక్కుకుని ఇద్దరు చిన్నారులు మృతి

Tags: The young leader of the unseen is KTR

టూ టైరి సిటీస్ కు రామంటున్న ఐటీ కంపెనీలు

Date:24/07/2019

వరంగల్ ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఇండస్ట్రీ అద్భుతంగా ఉందని  చెప్పుకుంటున్నా, హైదరాబాద్ మినహా వరంగల్‌‌‌‌, కరీంనగర్‌‌ వంటి టైర్–2 సిటీస్ లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడానికి ఏవీ ముందుకు రావడం లేదు.మన రాష్ట్రం ఐటీ హబ్‌‌గా ఎదుగుతోంది. దేశవ్యాప్తంగా ఐటీ పెరుగుదల రేటుతో పోలిస్తే తెలంగాణ పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది. కొత్తగా ఇండియాకి వచ్చే ఐటీ కంపెనీలు తమ సెంటర్ల
ఏర్పాటుకు తెలంగాణ వైపే చూస్తున్నాయి. ఐటీకి తెలంగాణ కేంద్రస్థానమని చెప్పుకున్నా ఇదంతా హైదరాబాద్‌‌లో అవుతున్న అభివృద్ధి మాత్రమే. వరంగల్‌‌, కరీంనగర్‌‌ వంటి నగరాల ఛాయలకు కూడా ఐటీ కంపెనీలు రావడం లేదు. 2014 లో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఐటీ ఎగుమతుల విలువ రూ.57 వేల కోట్లు ఉండగా, 2018–-19 లో ఇవి రూ.1.08 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

 

 

 

ఐదున్నర లక్షల మంది ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. ఏటా ఉద్యోగాల సంఖ్య14 శాతం  పెరుగుతూనే ఉంది.  హైదరాబాద్‌‌లోని ఐటీ కంపెనీలు తమ సెంటర్లను విస్తరిస్తుండగా కొత్తగా వచ్చే కంపెనీలు కూడా హైదరాబాద్‌‌నే ఎంచుకుంటున్నాయి.ఐటీరంగంలో వివిధ హోదాలకు ఎంపిక కాగల ప్రతిభావంతులకు హైదరాబాద్‌‌లో కొదవ లేదు. తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వమూ ఉంది. మౌలిక
వసతులు బాగా పెరిగాయి. వీటన్నింటితోపాటు హైదరాబాద్‌‌లో సెటిల్ అవ్వాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది.

 

 

 

 

 

బెంగుళూరు, ఢిల్లీ, చెన్నై లాంటి నగరాలతో పోలిస్తే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉండటంతో పాటు విస్తరణకు అవకాశాలు ఎక్కువ.వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి నగరాల్లో ఐటీని విస్తరించాలని ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసింది.  ఆయా నగరాల్లో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని 2017లో  నిర్ణయం తీసుకుంది. ఒక్కో ఇంక్యుబేషన్ సెంటర్ కోసం రూ.25 కోట్లు కేటాయించారు. కొత్తగా ఐటీ పరిశ్రమలు పెట్టాలనుకునేవారికి ఈ ఇంక్యుబేషన్ సెంటర్లు ఉపయోగపడతాయని భావించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ ఇందూరులో మూడు ఎకరాల్లో ఐటీ టవర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2018
ఆగస్టులో అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన కూడా చేశారు.రెండోస్థాయి నగరాల్లోకి ఐటీని విస్తరించాలని ప్రభుత్వం అనుకున్నా,  కంపెనీలు మాత్రం ముందుకు రావడం లేదు.

 

 

 

 

గత ఐదేళ్లుగా ప్రభుత్వం ప్రయత్నించినా ఏ ఒక్కటీ ముందుకు రాలేదు. ఆయా నగరాల్లో ట్యాలెంట్ పూల్ (అర్హులు), వసతులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. చిన్న నగరాల్లో నివాసానికి ఐటీ ఉద్యోగులు కూడా ఇష్టపడటం లేదు. తెలంగాణ ఐటీ ఎగుమతులు విలువ రూ.లక్ష కోట్లు దాటినా, టైర్‌‌ 2 సిటీల వాటా ఒక్కశాతం కూడా లేదు.

అటవీ అధికారులకు ఆధునిక ఆయుధాలు

Tags: IT companies coming to Two Tier Cities

తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్

Date:23/07/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ లో బీజేపీ బలపడుతున్న సంకేతాలు కనపడుతున్నాయి. ఇలాంటి సమయంలో పార్టీ పదవులు కావాలని ఏవరు కోరుకోరు .అనుకున్నట్లుగానే ప్రస్తుతం టీ బీజేపీ లో పార్టీ పదవుల కోసం నేతల మధ్య  పోటీ తీవ్రంగానే  ఉంది.. ఈ  పదవుల పై బీజేపీ నేతల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. డిసెంబర్ లో పార్టీ కి సంబంధించిన అన్ని స్థాయిల్లో కొత్త నాయకత్వానికి భాధ్యతలు అప్పగించనుంది అదిష్టానం… అయితే ఇప్పటికే పలువురు పార్టీ నేతలు తమ తమ స్థాయిల్లో పార్టీ పదవుల కోసం కేంద్ర నాయకత్వం దగ్గర లాబీయింగ్ చేయడం మొదలు పెట్టారట…

 

 

 

ఇది తెలిసిన పార్టీ ఛీఫ్ అమిత్ షా ముందు మెంబర్ షిప్ డ్రైవ్ పై దృష్టి పెట్టండి ఆ తర్వాత పదవుల గురించి ఆలోచిద్దాం అని సూచించారట. ఇది ఇలా ఉంటె పార్టీ పదవులు గతంలో అనుభవించిన వారికి కాకుండా కొత్త వారికి అవకాశం కల్పించాలని కోరుతున్నారట కొంత మంది బీజేపీ నేతలు ,ఎన్నో ఎళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తున్నా పార్టీ పదవులు మాత్రం ఇవ్వట్లేదని అసహనం ఆ నేతల్లో ఉందని ఈ అంశాన్ని కేంద్ర నాయకత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు .

 

 

 

 

ఆ నేతలు….ప్రస్తుతం పార్టీ పదవులు అనుభవిస్తున్న నేతలు మాత్రం మరో సారి ఇదే కార్యవర్గాన్ని కొనసాగించాలని కోరుతున్నారు… ప్రస్తుతం పార్టీ బలపడుతున్న సమయంలో కొత్త వారికి అవకాశం ఇవ్వడం వల్ల పార్టీ లో చేరికలు ,పార్టీ కార్యక్రమాలపై ఎఫెక్ట్ పడుతుందని సూచిస్తున్నారని సమాచారం..

 

 

 

.ఇదిలా ఉంటె పార్టీ లో ప్రస్తుతం చేరిన ,చేరబోయే నాయకులకు  ,పాత నాయకుల మధ్య పార్టీ పదవుల కోసం  కోల్డ్ వార్ జరిగే అవకాశం లేకపోలేదు .ప్రస్తుతం పార్టీ లో చేరేవారంతా పార్టీ పదవుల పై ఆశతోనే చేరుకున్నారు ,పార్టీ నాయకులు కూడా ఏదో ఓక పదవి ఇస్తామని చెప్పి పార్టీ చేర్చుకుంటుంన్నారు అనే ప్రచారం పార్టీ నేతల్లో జరుగుతుంది…

 

 

 

 

ఇదేగనుక నిజమైతే పాత కొత్త నాయకుల మధ్య తీవ్ర పోటీ ఉండబోతోంది..కొన్నేళ్లుగా ఎటువంటి పదవులు లేకపోయినా పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇస్తే పార్టీ లో గ్రూపులు తయారవ్వడం ఖాయం ..అదే జరిగితే పార్టీ పతనానికి పార్టీ నాయకులే నాంది పలికినట్లు అవుతుంది.. పార్టీ  ఈ సంక్షోభాన్ని పరిష్కరించకపోతే ఎన్నికల సమయానికి కుంపట్లు, అసహనాలు బయటపడి కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీ కి పట్టే అవకాశం లేకపోలేదు .

ఆంద్రప్రదేశ్   కొత్త గవర్నర్ కు ఘనస్వాగతం

Tags: Cold War in Telangana BJP

ఎవరి లెక్కలు వారివే

-మూడు పార్టీల ఆశలు

Date:23/07/2019

వరంగల్ ముచ్చట్లు:

తెలంగాణ‌లో గ‌త ఏడాది ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో మొదలైన ఎన్నిక‌ల వేడి.. ఇంకా కొన‌సాగుతూనే ఉంది. వ‌రుసగా ఏదో ఒక ఎన్నిక‌ల హడావుడితో ఇక్క‌డి పార్టీల‌న్నీ త‌ల‌మున‌క‌లై ఉంటున్నాయి. త్వ‌రలో మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్‌, కాంగ్రెస్, కొత్త ఉత్సాహంతో బీజేపీ మూడు పార్టీలూ ఈ ఎన్నిక‌ల్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగానే తీసుకున్నాయి. ఎవ‌రి పాయింటాఫ్ వ్యూలో వారికి ఈ ఎన్నిక‌లు కీల‌కం కాబోతున్నాయి. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ మూడు ప్ర‌ధాన పార్టీల‌కు ఓర‌కంగా దిశానిర్దేశం చేస్తాయ‌ని చెప్పొచ్చు. రాబోయే నాలుగేళ్ల‌పాటు వారి రాజ‌కీయం ఎలా ఉండబోతోందో తేల్చేవిగా ఉంటాయ‌నీ చెప్పొచ్చు.

 

 

 

తెరాస మీద వ్య‌తిరేకత మొద‌లైంద‌ని ఇప్ప‌టికే కాంగ్రెస్, భాజ‌పా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నాయి. దానికి త‌గ్గ‌ట్టుగానే పార్ల‌మెంటు ఎన్నిక‌ల ఫ‌లితాల్లో సారూ కారూ ప‌ద‌హారు లక్ష్యాన్ని తెరాస చేరుకోలేక‌పోయింది. ఆ త‌రువాత‌, జెడ్పీలు కైవ‌సం చేసుకున్నా… ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో కేసీఆర్ పాల‌న మీద వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మౌతోంద‌నే అభిప్రాయం బ‌లంగానే ఉంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆ అభిప్రాయంపై స్ప‌ష్ట‌త వ‌చ్చేస్తుంద‌ని చెప్పొచ్చు. అర్బ‌న్ ప్ర‌జ‌లు నిజంగాన టీఆర్ ఎస్ కొంత విముఖ‌త ఉంటే.. రాబోయే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తెరాస‌కు వ్య‌తిరేకంగా ఓటేస్తారు. లేదంటే, అనుకూలంగా ఓటేస్తారు. సో..

 

 

 

ఈ ఫ‌లితాన్ని బ‌ట్టీ తెరాస భ‌విష్య‌త్తు రాజ‌కీయ వ్యూహంలో కొన్ని మార్పులూ చేర్పుల‌కు క‌చ్చితంగా అవ‌కాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ విష‌యానికొస్తే… వ‌రుస ఫిరాయింపులు కొన‌సాగుతున్నా మూడు చోట్ల ఎంపీ స్థానాల‌ను గెలుచుకుంది. మ‌రో రెండు స్థానాల్లో గ‌ట్టి పోటీని ఇచ్చింది. ఒక‌వేళ‌, పార్టీ నాయ‌కులు కాస్త ఐక‌మ‌త్యంతో ప్ర‌య‌త్నించి ఉంటే మ‌రిన్ని ఎంపీ స్థానాలు ఆ పార్టీకి ద‌క్కేవ‌నేది వాస్త‌వం. సీఎల్పీని గులాబీ పార్టీలో విలీనం చేసుకోవ‌డం, ఫిరాయింపుల్ని య‌థేచ్ఛ‌గా ప్రోత్స‌హిస్తూ ఉండ‌టం… ఇవ‌న్నీ తెరాస మీద ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను పెంచి, త‌మ‌కు అనుకూలంగా మారుతున్న అంశాలుగా కాంగ్రెస్ చెబుతోంది. అయితే, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆ మేర‌కు కాంగ్రెస్ మంచి ఫ‌లితాలు సాధిస్తే… ఇప్ప‌టికే డీలా ప‌డ్డ కేడర్లో కొంత కొత్త ఉత్సాహం రావ‌డం ఖాయం.

 

 

 

భ‌విష్య‌త్తుపై కొత్త ఆశ‌లు రేకెక్క‌త‌డం ఖాయం. ఇక‌, భీజేపీ… ఈ పార్టీకి నాలుగు ఎంపీ స్థానాలు రావ‌డంతో రాష్ట్రంలో తామే తెరాస‌కు ప్ర‌త్యామ్నాయం అంటోంది. పెద్ద ఎత్తున స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం ఇప్పుడు చేస్తోంది. ప్ర‌తిప‌క్ష పార్టీ రాష్ట్రంలో వీక్ గా ఉంది కాబ‌ట్టి, ఆ స్థానాన్ని తామే భ‌ర్తీ చేస్తామ‌ని నేత‌లు అంటున్నారు. తెలంగాణ‌లో త‌మ‌నే ప్ర‌జ‌లు ప్ర‌త్యామ్నాయంగా కోరుకుంటున్నార‌ని ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు.

 

 

 

ఒక‌వేళ ప్ర‌జ‌లు నిజంగానే ఆ త‌ర‌హా మార్పు బ‌లంగా కోరుకుంటే… మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో భాజ‌పాకి కొంత సానుకూల ఫ‌లితాలు రావాలి. ఈ ఫ‌లితాల ఆధారంగానే భాజ‌పా వ్యూహాలూ ఉంటాయి. మొత్తానికి, తెలంగాణ‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. మూడు ప్ర‌ధాన పార్టీల భ‌విష్య‌త్ వ్యూహాల‌ను నిర్దేశించేవిగా క‌నిపిస్తున్నాయి.

జగన్ కు షాకిచ్చిన కేంద్ర సంస్థలు

Tags: Whose calculations are theirs