ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై సీఎం ఆగ్రహం

Date:28/06/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ ఆఫీసులో జరిగిన కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన కేసీఆర్… జూలైలో మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని పార్టీ నేతలకు వెల్లడించారు. ఈ ఎన్నికలకు అంతా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నమోదు చేసిన కేసీఆర్… ప్రతి నియోజకవర్గంలో 50 వేలకు తగ్గకుండా సభ్యత్వ నమోదు ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. జూలై 20 నాటికి సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని కేసీఆర్ స్పష్టం చేశారు. టీవీ చర్చల్లో ఎవరు పాల్గొనాలనే అంశాన్ని పార్టీ నిర్ణయిస్తుందని… వారు తప్ప మిగతా వాళ్లు టీవీ చర్చలకు వెళ్లకూడదని కేసీఆర్ నేతలకు సూచించారు. అయితే జూలైలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్న, అంజయ్య యాదవ్ చెప్పడంతో… వారిపై కేసీఆర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఘనవిజయం సాధించాలని కేసీఆర్ వారికి చెప్పినట్టు తెలుస్తోంది.

అయిల్ ఫెడ్ కథ కంచికేనా

 

Tags: CM is outraged over those two MLAs

హిందుత్వ అజెండాతో జగన్, కేసీఆర్

-బీజేపీకి  బ్యాలెన్స్ చేసే పనిలో సీఎంలు

 

Date:28/06/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా పీఠాలకూ, స్వాములకూ విలువ పెరిగిపోతోంది. ఇది మోడీ ఎఫెక్ట్ గా భావిస్తున్నారు. ఉత్తరాదిని జయించిన మోడీ, షా ద్వయం చూపు ఇపుడు దక్షిణాది మీద పడింది. దక్షిణాదిలో కర్నాటక తప్ప ఎక్కడా బీజేపీ విస్తరించలేకపోయింది. కేరళ, తమిళనాడు ఇప్పట్లో కొరుకుడుపడేలా లేవు కానీ, తెలంగాణాలో ఆంధ్ర ప్రదేశ్ లలో బలం పుంజుకునేందుకు కమలానికి దారులు కనిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా నాలుగు సీట్లు గెలుచుకున్న బీజేపీ తెలుగు రాష్ట్రాలలో ఎంట్రీకి తెలంగాణాను గేట్ వేగా చేసుకోవాలనుకుంటోంది.కమలం పువ్వుకు ముల్లుతోనే చెక్ పెట్టాలని తెలంగాణా సీం కేసీయార్ నిర్ణయించారు. హిందుత్వ కార్డు తో తెలంగాణాలో పాతుకుపోవాలని చూస్తున్న బీజేపీకి అదే హిందూత్వ కార్డుతో ఝ‌లక్ ఇవ్వాలన్నది కేసీయార్ ప్లాన్. అందుకే విశాఖ శారదాపీఠం స్వామీజీ ఆసరాను ఆయన తీసుకుంటున్నారు. స్వామితో సాన్నిహిత్యాన్ని రాజకీయంగా వాడుకోవడం ద్వారా హిందువుల మనసు గెలుచుకోవాలని, మెజారిటీ ఓట్లను గంపగుత్తగా పట్టేయాలని ఆలొచన చేస్తున్నారు. తాజా ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంక్ కోసం కేసీయార్ ప్రయోగాలు చేయడంతో హిందువులు బీజేపీ వైపు మళ్ళారు. ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఇపుడు ఇటు వైపు దువ్వుడు కార్యక్రమాన్ని కేసీయార్ మొదలుపెట్టారు. మజ్లిస్ పార్టీతో దోస్తీ తగ్గించి స్వాములతో పీఠాలతో కేసీయార్ గడుపుతున్నారు.ఇక ఏపీ సీఎం జగన్ విషయంలో బీజేపీ సులువుగా హిందుత్వ కార్డ్ ప్రయోగించే అవకాశాలు ఉన్నాయన్నది తెలిసిందే.

 

 

 

 

 

 

 

 

క్రిస్టియన్ మతాన్ని నమ్మే జగన్ కి వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టడం బీజేపీకి సులువైన పని. అయితే జగన్ కూడా రాటుతేలిన రాజకీయమే చేస్తున్నారు. తనకు మొదటి నుంచి ఉన్న ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ ఓటు బ్యాంక్ ని కాపాడుకుంటూనే కొత్తగా బీసీలను దగ్గరకు తీస్తున్నారు. దాంతో పాటుగా అగ్ర కులాల మద్దతు కోసం స్వాములను, గుళ్ళను ఆయన కూడా నమ్ముకున్నారు. కేసీయార్ బాటలోనే జగన్ సైతం శారదాపీఠం స్వరూపానందేంద్ర ఆశీస్సులు కోరుకుంటున్నారు. తద్వారా హిందువుల మనసు గెలుచుకోవాలని. బీజేపీని నిలువరించాలని జగన్ తాపత్రయం. చూడాలి మరి ఏం జరుగుతుందో.

 

పొలం పనుల్లో రైతన్నలు

Tags: Jagan, KCR with Hindutva agenda

సచివాలయానికి భూమి పూజ చేసిన కేసీఆర్

Date:27/06/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

నూతన సచివాలయమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం భూమి పూజ చేసారు. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ భవనం స్థానంలోనే రూ.400 కోట్ల వ్యయంతో కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సచివాలయం డి-బ్లాక్ వెనుక భాగంలోని తోటలో కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కొబ్బ‌రికాయ‌లు కొట్టారు. మంత్రులు మెహ‌మూద్ అలీ, జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, ఈటెల రాజేంద‌ర్‌, త‌లసాని శ్రీనివాస్, ఇంద్ర క‌ర‌ణ్ రెడ్డి, స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కేశ‌వ‌రావు, మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్‌ విద్యాసాగ‌ర్ రావు, డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు హ‌రీశ్ రావు, బాల‌రాజు, జీవ‌న్‌రెడ్డి, రాజ‌య్య‌, ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ముందుగా కేసీఆర్ పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టారు. హారతి అనంతరం ఆత్మ ప్రదక్షిణ చేసి శంకుస్థాపన గోతిలో పూజాద్రవ్యాలు వేసి పనులకు శ్రీకారం చుట్టారు.  కార్యక్రమం తరువాత ఎర్రమంజిల్ లో నిర్మించ తలపెట్టిన నూతన అసెంబ్లీ భవనానికి శంకుస్థాపన చేసారు.

 

22 అక్రమ నిర్మాణాల సంగతేంటీ

Tags: KCR who gave land to the Secretariat

గోదావరి వినియోగమే అజెండా

-కొనసాగుతున్న సాగునీటి రంగ నిపుణుల మేధో మధనం

 

Date:27/06/2019

విజయవాడ ముచ్చట్లు:

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాగునీరందని ప్రదేశాలకు గోదావరి నీటిని తీసుకెళ్లడంపై అధికారులు మేధోమధనం చేస్తున్నారు. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ఆయకట్టును స్థిరీకరించేలా గోదావరి నీటిని ఎక్కడెక్కడి నుంచి ఎంత మేర తీసుకోవచ్చనే అవకాశాలపై అధ్యయనం చేస్తున్నారు. బంగాళాఖాతంలోకి వృధాగా వెళ్లే జలాలను వీలైనంతగా వాడుకుంటూ, తెలంగాణ, ఎపిలోని ప్రతి ఎకరాను తడపాలని ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు సూత్రప్రాయంగా నిర్ణయించినా, చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి.ముఖ్యమంత్రుల స్థాయిలో 27న సమావేశం జరిగే అవకాశం ఉంది. గవర్నర్ సమక్షంలో రాజ్‌భవన్‌లో, ప్రగతిభవన్‌లోనా, లేకపోతే మరో వేధికనా అన్నది కూడా తెలియాల్సి ఉంది. తొలుత ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశం అయ్యాక, తదుపరి ఇరిగేషన్ సెక్రెటరీలు, ఇఎన్‌సిలు, చీఫ్ ఇంజనీర్ల స్థాయిలో వరుస సమావేశాలు ఉంటాయి.రెండు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా చర్చించే అంశాలపై అధికారులు సిద్ధమవుతున్నారు. గోదావరి నదీ జలాల లభ్యత. భవిష్యత్తు డిమాండ్, కృష్ణా జలాల లభ్యత, భవిష్యత్తు డిమాండ్‌పై గణాంకాలు తీస్తున్నారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూమి, సాగు, తాగు నీళ్ల డిమాండ్ ఎంత అనే దానిపై అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణలో సైతం వ్యవసాయ యోగ్యమైన భూమెంత, నీటి వనరులేంటి, ఎంత శాతం, ఇప్పటి వరకు దానికి ఉన్న ఇరిగేషన్ సౌకర్యాలపై పాత లెక్కలు తీస్తున్నారు.

 

 

 

ఆల్మట్టి రిజర్వాయర్ ఎత్తును 5 మీటర్లు పెంచితే భవిష్యత్తులో కృష్ణా జలాల ప్రవాహం భారీగా తగ్గిపోతుంది. ఫలితంగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లపై ఆధారపడి రెండు రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాల ఆయకట్టు ఉంది. తెలంగాణలో శ్రీశైలం ఆధారంగా కల్వకుర్తి ఎత్తిపోతలలో 4 లక్షల ఎకరాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 12.3 లక్షల ఎకరాలు, డిండి ఎత్తిపోతలకు 4 లక్షల ఎకరాలకు సరిపడా నీరు ఇవ్వాల్సి ఉంది. ఇదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలో హంద్రీ నీవా, గాలేరు నగరి, ముచ్చుమర్రి, శ్రీశైలం కుడి గట్టు కాలువ, తెలుగుగంగ, ఇలా లక్షలాది ఎకరాల ఆయకట్టు రాయలసీమలో ఉంది.కరవు జిల్లాగా పేరొందని మహబూబ్‌నగర్, ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలకు సైతం నీటిని తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. వరద జలాలు, నికర జలాలన్న తేడాలు చూపకుండా రైతుల చెం తకు నీళ్లు తీసుకెళ్లడమే ధ్యేయ ంగా, మరో రీడిజైన్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టిం ది. అయితే ఈ రీడిజైనింగ్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ప్రయోజనాలు ఉ న్నాయి. తెలంగాణ ఆవిర్బావం తర్వాత జరిగిన ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌లో తెలంగాణ బహుముఖ ప్రయోజనాలు, ధీర్ఘకాలిక వ్యూహాలు ఉన్నాయి.

 

 

 

 

 

 

 

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలతో పాటు తెలంగాణ ఆ యకట్టు స్థిరీకరణకు వీలవుతుంది.నదీ జలాల వినియోగంతో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టం అమలుకు సంబంధించిన పెండింగ్ అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. అధికారికంగా ఎటువంటి సమాచారం లేకపోయినా, అధికారులు మాత్రం అన్ని అంశాలతో సిద్ధమవుతున్నారు. గోదావరి నీటిని వినియోగించుకోవాలంటే, తెలంగాణ పరిధిలో దుమ్ముగూడెం, ఆంధ్రప్రదేశ్ పరిధిలో పోలవరం ప్రాంతం నుంచే వినియోగించుకోవాల్సి ఉంది. ఇంధ్రావతి నదీ జలాలను వినియోగించుకునేందుకు వీలుగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతుపాకులగూడెం బ్యారేజిని నిర్మిస్తుంది. దీంతో దేవాదుల ఎత్తిపోతల పథకానికి నీటి లభ్యత కొంత పెరిగి, ఎక్కువ నీటిని వినియోగించుకునేందుకు వీలవుతుంది. దిగువ గోదావరిలో ప్రాణహిత, ఇంద్రావతి నదుల్లో వరద జలాలు ఎక్కువగా ఉంటాయి. ఆంధ్రా ప్రాంతంలో శబరి నది సైతం వీటికి పోటీగా ప్రవహిస్తుంది. అయితే ఈ వరద వర్షాకాలంలోనే ఉంటుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో ఈ నదులు నిండుగా ప్రవహిస్తూ, బంగాళాఖాతాన్ని వెతుక్కుంటూ దిగువకు వెళతాయి. నాగార్జునసాగర్ సాగర్‌పై ఆధారపడి తెలంగాణలో ఎడమ గట్టు కింద ఉన్న ఆయకట్టు, హైదరాబాద్ తాగునీటికి ఎఎంఆర్‌పి, నల్లగొండలో ఎఎంఆర్‌పి కింద 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కుడి గట్టు కింద 14 లక్షల ఎకరాల ఆయకట్టు ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఎడమకాలువ కింద కూడా కొంత ఆయకట్టు ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది. మొత్తానికి శ్రీశైలం, నాగార్జునసాగర్‌లపై ఆధారపడి తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు తాగు, సాగునీరు రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని ఆయకట్టుకు సాగు, తాగునీరు ఇవ్వాలి. ఇప్పుడు గోదావరి నీటిని పలు దశల్లో తీసుకువచ్చి, నాగార్జునసాగర్, శ్రీశైలంలను వినియోగించి, ఈ ఆయకట్టును స్థిరీకరించే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున వ్యయం చేయాల్సి ఉన్నప్పటికీ, సాధ్యాసాధ్యాలపై సాంకేతిక అధ్యయనం చేయాల్సి ఉంది. అంతకు ముందుగా ఎక్కడెక్కడ ఏమేం చేస్తే బాగుంటుంది. ఏ విధంగా నీళ్లు తీసుకువస్తే బాగుంటుందన్న దానిపై సూత్రప్రాయంగా నిర్ణయం కావాల్సి ఉంది. ముఖ్యమంత్రుల స్థాయిలో ఓ నిర్ణయం జరిగితే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కమలం అడుగులు…

 

Tags: Godavari consumption is the agenda

తెలంగాణలో  పార్టీల నెంబర్ గేమ్

Date:26/06/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు వ‌డివ‌డిగా మారుతున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ ప‌రిణామాలను అంచ‌నావేయ‌డం ఎవ‌రి సాధ్య‌మూ కావ‌డం లేదు. 2014 వ‌ర‌కు నెంబ‌ర్ 1 పొజిష‌న్‌లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ అనూహ్యంగా దిగ‌జారిపోయింది. తెలంగాణ‌ను మేమే ఇచ్చాం అని చెప్పుకొన్నా ప్ర‌జ‌లు క‌నిక‌రించ‌లేదు. దీంతో విభ‌జ‌న త‌ర్వాత అధికారంలోకి వ‌స్తుంద‌ని అనుకున్న పార్టీ విప‌క్షానికి నెంబ‌ర్‌-2 స్థానంలో ప‌రిమిత‌మైంది. ఉద్య‌మ నేప‌థ్యంలో అవ‌త‌రించిన టీ ఆర్ ఎస్ నెంబ‌ర్ 1 పొజిష‌న్‌కు చేరింది. ఇక 2014 ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత చూస్తే నెంబ‌ర్ -3 స్థానంలో టీడీపీ, నెంబ‌ర్ -4 స్థానంలో బీజేపీ, నెంబ‌ర్ -5లో వైసీపీ ఉన్నాయి. అయితే, ఈ రాజ‌కీయ అంకెలు, సంఖ్య‌ల ప‌రంప‌ర కేవ‌లం ఐదేళ్ల‌లోనే తిర‌గ‌బ‌డింది.
తెలంగాణ‌లో నెంబ‌ర్‌-1 పొజిష‌న్‌లోకి రావాల‌ని ఆశ‌లు పెట్టుకున్న కాంగ్రెస్‌కు ఎక్క‌డిక‌క్క‌డ ఎదురు దెబ్బ‌లు త‌గిలాయి. గ‌త ఏడాది డిసెంబ‌రులో జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తుంద‌ని భావించిన అతిపెద్ద‌పార్టీ పూర్తిగా చిన్న బోయింది. చంద్ర‌బాబుతో పెట్టుకున్న చెలిమి బెడిసి కొట్టింది. ఈ క్ర‌మంలో తిరుగులేని మెజారిటీతో కేసీఆర్ మ‌రోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకుని, పార్టీని ఫ‌స్ట్ పొజిష‌న్‌లో నిల‌బెట్టారు. దీంతో మ‌రోసారి తెలంగాణ కాంగ్రెస్ కు సెకండ్ పొజిష‌నే ద‌క్కింది. అయితే, ఇప్పుడు ఇది కూడా నిల‌బ‌డ‌డం లేదు.

 

 

 

 

ఇప్ప‌టికే నెంబ‌ర్ -3, 5 పొజిష‌న్‌లో ఉన్న టీడీపీ, వైసీపీలు దిక్కుదివాణం లేకుండా పోయాయి. ఈ రెండు పార్టీల‌కు తెలంగాణ‌లో రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేదు. అందుకే తాజా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అస్స‌లు ఈ పార్టీలు పోటీయే చేయ‌లేదు.అదే స‌మ‌యంలో తెలంగాణ కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసి, కేసీఆర్‌ను త‌మ దారిలోకి తెచ్చుకొని.. తెలంగాణాలో జెండా పాతాల‌ని బీజేపీ నాయ‌కులు సిద్ధ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రినీ పార్టీలోకి చేర్చు కున్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ నెంబ‌ర్‌-3 పొజిష‌న్‌కు ప‌డిపోగా.. కాంగ్రెస్ స్థానంలోకి బీజేపీ వ‌చ్చి చేరుతోంది. దీంతో నెంబ‌ర్లాట మ‌రింత ర‌స‌కందాయంగా మారింది. ఇక‌, టీడీపీ ప‌రిస్థితి ఉన్నామంటే ఉన్నామ‌న్న‌ట్టుగానే ఉండ‌డం మ‌రింత శోచ‌నీయం. ఇక‌, తాజాగా మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయ‌న టీ కాంగ్రెస్ నాయ‌క‌త్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.ఇక రేవంత్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డిపై కూడా బీజేపీలోకి వెళ‌తార‌న్న వార్త‌లు అయితే వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే కొంత మంది కాంగ్రెస్‌ మాజీ శాసనసభ్యులతో బీజేపీ నేతలు తాజాగా సంప్రదింపులు ప్రారంభించారు. ఉమ్మడి మెదక్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు వారిలో ఉన్నట్లు సమాచారం.

 

 

 

 

 

 

వారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను కొద్ది రోజుల క్రితం కలిసినట్లు సమాచారం. మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ ముఖ్య నేతలతో ఇప్పటికే పలు మార్లు సమావేశమయ్యారు. చేరికల వ్యూహాన్ని ముమ్మరం చేయాలని, ముందు కు వచ్చే అందరినీ చేర్చుకోవాలని పార్టీ అధినాయ‌క‌త్వం నిర్ణ‌యించింది.ఈక్ర‌మంలోనే మల్కాజిగిరి మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, మహబూబాబాద్‌ మాజీ ఎంపీ బలంరాం నాయక్ బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోం ది. సర్వే దాదాపుగా బీజేపీలో చేరడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.ఇక‌, టీడీపీ బ‌హిష్కృత నాయ‌కుడు ఎస్సీ వ‌ర్గానికి చెందిన మొత్కుప‌ల్లి న‌ర్సింహులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యార‌ని అంటున్నారు. ఏదేమైనా వ‌చ్చే ఆరేడు నెల‌ల్లోనే తెలంగాణ‌లో బీజేపీ కాంగ్రెస్ ప్లేస్‌ను ఆక్ర‌మించే సూచ‌న‌లు పుష్క‌లంగా ఉన్నాయి. మ‌రి ఇంత సంక్లిష్ట ప‌రిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎలా పుంజుకుంటుందో ? చూడాలి.

 

జగన్ బడ్జెట్ పై భారీ ఆశలు

 

Tags: Number game of parties in Telangana

కోదండరామ్ సార్ దారెటు…

Date:26/06/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ ఉద్యమ వ్యూహకర్త. మేధావులను, విద్యావంతులను ఉద్యమం వైపు నడిపించిన వ్యక్తి. రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్‌తో విబేధించి కొత్త పార్టీ పెట్టారు. ఆయనే ప్రొఫెసర్ కోదండరాం. జేఏసీ చైర్మన్‌గా అందరి ఆదరాభిమానాలు చూరగొన్న కోదండరాం పార్టీ పెట్టి తప్పు చేశారా? ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కోదండ మంత్రం రాజకీయాల్లో మాత్రం ఎందుకు తుస్సుమంది? నిన్నా మొన్నటి వరకు అందరికీ కావాల్సివచ్చిన ఆ సారు ఇప్పుడు ఎందుకు ఒంటరివాడయ్యారు?తెలంగాణ ఉద్యమంలో అటు కేసీఆర్ నుంచి ఇటు అన్ని పార్టీల నేతలతో పాటు సాధారణ ప్రజల వరకు సారు అని పిలిపించుకున్న వ్యక్తి ప్రొఫెసర్‌ కోదండరామ్‌. మలిదశ ఉద్యమంలో ఆయనది చాలా కీలక పాత్ర. జేఏసీ ఛైర్మన్‌గా రాజకీయ పార్టీలు స్తబ్దుగా ఉన్న సమయంలోనూ ఉద్యమం సజీవంగా ఉండేందుకు ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు. రాష్ట్ర సాధన తరువాత టీఆర్ఎస్‌కు వ్యతిరేక జెండా ఎగురవేసి తనదైన శైలిలో పోరుబాట పట్టారు. తెలంగాణ జన సమితి పేరుతో ఓ పార్టీ ఏర్పాటు చేసిన ఆయన ఎన్నికల్లో సత్తా చాటాలని భావించారు. కానీ అక్కడే సీను రివర్సైంది.  మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ మైండ్ గేమ్‌తో షాక్క్‌కు గురైన కోదండరాం అటు కూటమిని వీడలేక ఇటు ఏమి చేయాలో తోచక నానా హైరానా పడ్డారు.

 

 

 

 

 

వాస్తవానికి టీఆర్ఎస్ వ్యతిరేకతే ప్రధాన అజెండాగా ఉద్యమ నేపథ్యమే అండగా తెలంగాణ జనసమితిని ఏర్పాటు చేసిన కోదండరాం ఆదిలోనే తప్పటడుగులు వేశారు. పార్టీ స్థాపించే కన్నా ముందు పలువురు నాయకులు కోదండరాంను కలిసినా పార్టీ స్థాపించిన తరువాత మాత్రం ఎవరూ చేరిన పాపాన పోలేదు. కోదండరాం, కపిలవాయి దిలీప్‌కుమార్ తరువాత పెద్దగా జనాలకు పరిచయం ఉన్న నాయకులు పార్టీలో ఒక్కరంటే ఒక్కరు లేకుండా పోయారు. ఇక ప్రజా సమస్యల పోరాటం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎన్నో కార్యక్రమాలు చేసినా పెద్దగా స్పందన రాలేదు. నిజానికి జేఏసీ చైర్మన్‌గా ఉన్నప్పుడు కోదండరాం వెంట ఉండి నడిచిన వారు ఎవరూ పార్టీ పెట్టిన తరువాత వెంట లేకుండా పోయారు. ఎన్నికల ఫలితాల్లో కోదండరామ్‌ నేతృత్వంలోని పార్టీ ఘోరంగా ఓడిపోవడం టీజేఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకపోవటంతో ఆ పార్టీ పవర్ ఏంటో తేలిపోయింది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ ఆ పార్టీ బోణీ కోట్టలేకపోయింది. ఎన్నికల సమయంలో కాస్త సందడిగా కనిపించిన టీజేఎస్ ఆఫీస్ ఆ తరువాత బోసిపోయింది. పార్టీని మరో ఐదేళ్లు నెట్ట్టుకు రావటం అంత ఈజీ విషయమైతే కాదు.

 

 

 

 

 

 

చట్టసభల్లో చోటుదక్కుంచుకోని టీజేఎస్ అటు బయట కూడా పెద్దగా ప్రజా సమస్యలపై పోరాటం చేయటంలో ప్రభావం చూపలేకపోతోంది. ఉద్యమ సమయంలో తిరుగులేని వ్యక్తిగా గుర్తింపు పొందిన కోదండరామ్ ఇపుడు మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారని, కోదండరామ్‌లాంటి సున్నిత మనస్కులకు రాజకీయాలు ఏమాత్రం సూట్ కావని తెలంగాణ వాదులు గుసగుసలాడుతున్నారు. ఉద్యమసారధిగా జేజేలు అందుకున్న కోదండరామ్ రాజకీయాల్లో కొనసాగాలా వద్ద అనే విషయంలో తన సన్నిహితులతో సీరియస్‌గానే చర్చిస్తున్నారని టాక్. ఏదేమైనా ఉద్యమంలో అందరికీ అవసరమైన వ్యక్తి ఇప్పుడు మాత్రం ఎవ్వరికీ కాకుండా పోయాడని పాపం కోదండరాం సర్ అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

ముప్పేట దాడిలో తెలుగుదేశం

Tags: Kodandaram Sir Darethu … Close Button

మూడు బ్లాకుల్లో తెలంగాణ సచివాలయం

-5.6 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం
-మరి కాసేపట్లో శంకుస్థాపన పనులు

 

Date:26/06/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

తెలంగాణలో నూతన సచివాలయం, అసెంబ్లీ భవనాల శంకుస్థాపనకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు ప్రస్తుతం సచివాలయంలోని కార్యాలయాలను తాత్కాలికంగా ఎక్కడకు తరలించాలి? మొత్తం సచివాలయ భవనాలను ఒకేసారి కూల్చివేయాలా? లేక విడుతలవారీగా కూల్చాలా? అన్నదానిని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయిస్తుంది. మొత్తం కార్యాలయాలను ఒకేసారి తరలించకుండా మొదట ఏ, బీ, సీ బ్లాక్‌లలోని కార్యాలయాలను ఎల్, జే, డీ బ్లాక్‌లకు తరలించి.. ఏ,బీ,సీ,కే బ్లాక్‌లను కూల్చివేయాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూడుబ్లాక్‌లు కలిపితే 5.6 లక్షల చదరపు అడుగులు ఉంటుందని చెప్తున్నారు. అయితే నిర్మాణ సమయంలో ఈ స్థలంలోని ఇతర బ్లాక్‌లలో కార్యాలయాలు ఉండటం భద్రత కారణాలరీత్యా మంచిది కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నదిఈ నెల 27వ తేదీన రెండు భవనాల నిర్మాణాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భూమిపూజ నిర్వహించనున్నారు.

 

 

 

 

 

 

ఇప్పుడున్న ప్రాంగణంలోనే సచివాలయం, ఎర్రమంజిల్‌లో అసెంబ్లీకి నూతన భవనాలను నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ముందుగా సచివాలయ భవననిర్మాణానికి భూమిపూజచేస్తారు. ఇందుకోసం సచివాలయంలో ఈశాన్యంలో డీ బ్లాక్ వెనుకవైపుఉన్న ఉద్యానవనంలో ఏర్పాట్లుచేస్తున్నారు. అనంతరం ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ భవన నిర్మాణపనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రగతిభవన్‌లో లంచ్ ఏర్పాటుచేశారు. నూతన సచివాలయాన్ని సుమారు ఆరులక్షల చదరపు అడుగుల వైశాల్యంతో అన్నిహంగులతో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. పక్కావాస్తుతోపాటు అన్నిరకాల వసతులు ఉండేలా నిర్మించనున్నారు. మంత్రులు, అధికారుల సమీక్షలు, సమావేశాలు అన్నీ సచివాలయం వేదికగా జరిగేలా నిర్మాణం జరుగనున్నది. ఇందుకోసం సమావేశహాళ్లు, కలెక్టర్ల సమావేశం కోసం కాన్ఫరెన్స్‌హాల్ నిర్మించనున్నారు. అలాగే విశాలమైన పార్కింగ్ ఏర్పాటుకూడా చేయనున్నారు. పూర్తి పర్యావరణ హితంగా సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సచివాలయం ప్రాంగణంలో ఉన్న భారీ వృక్షాలను ట్రాన్స్‌రిలోకేషన్ పద్ధతిలో సంరక్షించాలని అధికారులు యోచిస్తున్నారు.భవనాలు అన్నింటినీ ఒకేసారి కూల్చకుండా.. విడుతల వారీగా కూల్చి నిర్మాణం చేపడితే .

 

 

 

 

 

భారీయంత్రాలను వినియోగించి రెండోవిడుతలో నిర్మించే భవనాలను కూల్చేసమయంలో మొదటి విడుతలో నిర్మించిన భవనాలకు పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంటుందని మరో ఆలోచన కూడా చేస్తున్నారు. ఈ విధంగా అన్నిరకాల విషయాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించి సచివాలయ తరలింపుపై నిర్ణయిం తీసుకోనున్నది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా సచివాలయంలోని కార్యాలయాలను తరలింపుపై నిర్ణయం తీసుకుంటారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సచివాలయం మొత్తాన్ని ఒకేసారి తరలించి, కూల్చాలని నిర్ణయిస్తే మంత్రిత్వశాఖలను ఆయా శాఖాధిపతుల కార్యాలయాలకు తలించాల్సి ఉంటుంది. ఇదేసమయంలో జీఏడీ, ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కార్యాలయాలను ఎక్కడికి తరలించాలన్న దానిపై కూడా మంత్రివర్గ ఉపసంఘం చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

 

 ప్రజల చెంతకు చేరని సంచార వైద్యం

Tags: Telangana Secretariat in three blocks

తెలంగాణ పూర్తి బడ్జెట్ ఎప్పుడు

-కొత్త ఆర్ధిక మంత్రా, కేసీఆర్ ప్రవేశపెడతారా

 

Date:25/06/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్‌ను వచ్చే నెలలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు అందరి దృష్టీ ఆర్థికశాఖ మంత్రిపై పడింది. రెండోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ ఆ శాఖకు మంత్రిని నియమించని సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్‌… ఆ శాఖను తన వద్దే ఉంచుకున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయనే స్వయంగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ రూపకల్పనకు కసరత్తులు ఊపందుకున్న తరుణంలో… మళ్లీ ముఖ్యమంత్రే పద్దును ప్రవేశపెడతారా..? లేక క్యాబినెట్‌ బెర్తులన్నింటినీ నింపటం
ద్వారా కొత్త ఆర్థిక మంత్రి చేత బడ్జెట్‌ను ప్రవేశపెట్టిస్తారా…? అనేది చర్చనీయాంశమవుతున్నది. దీనికి కొనసాగింపుగా ఇప్పటికిప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాల్లేవనే వాదన కూడా ముందుకొస్తున్నది. అందువల్ల ఆర్థిక శాఖకు కొత్త మంత్రి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది డిసెంబరులో రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి కేసీఆర్‌.. పాలనలో నిదానంగా ముందుకు సాగుతూ వస్తున్నారు. తొలుత తనతోపాటు డిప్యూటీ సీఎంగా మహమూద్‌ అలీతో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత దాదాపు రెండు నెలల వరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. ఫిబ్రవరిలో క్యాబినెట్‌ను విస్తరించినప్పటికీ కొన్ని శాఖలకే మంత్రులను నియమించారు. ఇదే సమయంలో కీలకమైన ఆర్థిక శాఖను మాత్రం ఎవ్వరికీ కేటాయించకుండా తన దగ్గరే ఉంచుకున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే వీలు లేకపోవడంతో సీఎం ఓటాన్‌ అకౌంట్‌తో సరిపెట్టారు. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. కేంద్రం కూడా పూర్తిస్థాయి బడ్జెట్‌కు రంగం సిద్ధం చేసింది.

 

 

 

 

 

 

 

 

ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ, కొత్త ఆర్థిక మంత్రి అనే అంశాలు ముందుకొస్తున్నాయి. అయితే సీఎం దృష్టి మాత్రం వీటిపై లేదని అధికార పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.  కాళేశ్వరం ప్రారంభోత్సవంతో కొనసాగిన హడావుడి ఇప్పుడు ముగిసింది. దీని వెంటనే ఈనెల 27న నూతన సచివాలయానికి శంకుస్థాపన చేస్తామంటూ ముఖ్యమంత్రి ప్రకటించారు. మరోవైపుజిల్లాల్లో టీఆర్‌ఎస్‌ కార్యాలయాలకు శంకుస్థాపనలు, వాటి పనులు, ప్రారంభోత్సవాల కార్యక్రమాలు జులై వరకూ కొనసాగనున్నాయి. ఈ మధ్యలో మున్సిపాల్టీ ఎన్నికల ప్రక్రియ ముందుకు రానుంది. ఇవన్నీ పూర్తయ్యే లోపే జులై మొదటి లేదా రెండో వారంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అందువల్ల మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండబోదని టీఆర్‌ఎస్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇదే
జరిగితే పూర్తిస్థాయి బడ్జెట్‌ను కూడా ముఖ్యమంత్రే ప్రవేశపెడతారని ఆర్థికశాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.

 

ఉపాధి పెంపే లక్ష్యంగా ఐకార్

Tags: When is the full budget of Telangana