ప్రాంతీయ కార్యాలయంతో ప్రమాదాలకు చెక్!

Date:04/07/2018
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ ప్రాంతీయ మేనేజర్‌ కార్యాలయం జడ్చర్లలో ఏర్పాటుచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 44వ నంబర్‌ జాతీయ రహదారి విస్తరణ సందర్భంగా ఈ ప్రాంతంలో వాహనాల పార్కింగ్ కు ప్రభుత్వ అతిథిగృహం పక్కన ఏర్పాటుచేసిన భవన సముదాయాన్ని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమాన్ని 28 ఏళ్ల కిత్రమే చేపట్టారు. అయితే.. అప్పట్నుంచి అటకెక్కిన ఈ ప్రోగ్రామ్ కు కార్యరూపం ఇవ్వనున్నారు అధికారులు. దీనిని త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లే ప్రధాన జాతీయ రహదారులకు జడ్చర్ల జంక్షన్ గా ఉంది. దీంతో హైదరాబాద్‌ కార్యాలయానికి అనుబంధంగా ప్రాంతీయ మేనేజర్‌ కార్యాలయం ఏర్పాటుచేయాలని అనుకుంటున్నారు. జడ్చర్లలో ప్రస్తుతం వృథాగా ఉన్న జాతీయ రహదారుల నిర్వహణ సంస్థకు చెందిన భవనాల సముదాయంలో ఆఫీస్ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇది ఏర్పాటైతే ఇక్కడి జాతీయ రహదారులపై పర్యవేక్షణ పెరగటంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. త్వరలో జడ్చర్ల నుంచి ఉదండాపూర్‌ వెళ్లే మలుపు వద్ద జాతీయ రహదారిపై రూ. 11కోట్ల వ్యయంతో అంతర్గత వంతెన కూడా నిర్మించాలని అనుకుంటున్నారు. మాచారం వద్ద అంతర్గత వంతెన, హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌ వరకు ఆరు వరుసల రహదారి విస్తరణ పనులు జరగనున్నాయి. రీజనల్ మేనేజర్ ఆఫీస్ అందుబాటులోకి వస్తే ఈ పనుల పర్యవేక్షణ సులువు అవుతుంది. మంత్రులు, ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణలోకి తీసుకుని జాతీయ రహదారుల పర్యవేక్షణ కోసం అన్ని ప్రాంతాలకు అనువుగా ఉండే జడ్చర్లలో ప్రాంతీయ మేనేజర్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఉన్నత అధికారులు నిర్ణయించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మూడు నెలల్లోనే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి కార్యాలయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఇదిలాఉంటే జడ్చర్లలో ఉన్న జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ భవనాలను ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఇచ్చారు. తర్వాత ఎల్‌అండ్‌టీ కార్యకలాపాలకు అప్పగించారు. అనంతరం పర్యాటక శాఖకు కేటాయించేందుకు ఉత్తర్వులు ఇచ్చినా అమలుకాలేదు. ఎట్టకేలకు జాతీయ రహదారుల సంస్థ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుతో ఈ భవనాలు వినియోగంలోకి వస్తాయి. జడ్చర్ల ప్రాంతంలో వరుస ప్రమాదాలతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. సమస్యను గమనించిన ప్రజాప్రతినిధులు చొరవ చూపి ప్రమాదాలను అరికట్టాలని నిర్ణయించారు. వారి చొరవ వల్లే రీజనల్ మేనేజర్ ఆఫీస్ ఏర్పాటవుతోంది. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు నేతలు, అధికారులు తీసుకుంటున్న చర్యలపై అంతా హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ప్రాంతీయ కార్యాలయంతో ప్రమాదాలకు చెక్! https://www.telugumuchatlu.com/check-the-dangers-with-regional-office/
Tags:Check the dangers with regional office!

అసిఫాబాద్ అభయారణ్యంలో మూడు పిల్లలకు జన్మనిచ్చిన పెద్దపులి తెలంగాణ అడవులకు దక్కిన మరో అరుదైన ఘనత 

Date:03/07/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ అడవులు ప్రకృతి రమణీయతకు, వన్యప్రాణుల ఆవాసానికి అనువుగా మారుతున్నాయి. దేశంలోనే అరుదైన సంఘటనకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అడవులు, కవ్వాల్ పులుల అభయారణ్యం సాక్షిగా నిలిచాయి. కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఫల్గుణ అనే పెద్ద పులి ఇటీవల మూడు పిల్లలకు జన్మనిచ్చింది. రెండేళ్ల కింద ఇదే ప్రాంతంలో నాలుగు పిల్లలను కన్న, ఈ ఆడపులి ఇప్పుడు మరో మూడింటికి జన్మ నివ్వటం అత్యంత అరుదైన సంఘటనగా అటవీ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట తల్లీ, పిల్లల పాదముద్రలను అటవీ ప్రాంతంలో గుర్తించిన సిబ్బంది, ఆ తర్వాత కెమెరాల సహాయంలో మూడు పిల్లలను గుర్తించారు. పాదముద్రలతో పాటు, పులుల వంటిపై ఉండే మచ్చలను కూడా శాస్త్రీయంగా విశ్లేషించిన అధికారులు, తల్లీ తో పాటు, ఈ మూడు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయని, అడవిలో స్వేచ్ఛగా విహరిస్తున్నాయని తెలిపారు. కదంబ అటవీ ప్రాంతంలో పుట్టిన ఈ పిల్లల్లో మొదటి నాలుగింటికి K1, K2, K3, K4 గా పేర్లు పెట్టిన అధకారులు, ప్రస్తుత మూడింటికి K5, K6, K7 గా పిలుస్తున్నారు.  గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు, మహారాష్ట్ర సరిహద్దు వెంట విస్తరించిన అడవుల్లో కొంత భాగాన్ని 2012లో ప్రభుత్వం కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది. ఇక మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, తెలంగాణ అటవీ ప్రాంతాలను కలిపి టైగర్ కారిడార్ గా కేంద్ర అటవీ శాఖ గుర్తించింది. ప్రస్తుతం ఈ కారిడార్ లోనే ఫల్గుణతో పాటు మిగతా పులుల సంచారం ఎక్కువగా ఉండని అటవీ అధికారులు చెబుతున్నారు.  తెలంగాణకు చెందిన అటవీ భూ భాగంలో వన్యప్రాణులకు, పులుల వృద్దికి అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు అటవీ శాఖ చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఈ దిశగా చర్యలు మరింత ముమ్మరం అయ్యాయి. ప్రణాళికాబద్ధంగా అటవీ శాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, కవ్వాల్ ప్రాంతం పులులకు ఆవాసయోగ్యం మార్చటం, నీటి సౌకర్యం, వేట కోసం జింకల సంతతికి పెంచటం, వేట నియంత్రణ, వేటగాళ్ల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించటం, స్థానికులకు వన్యప్రాణుల సంరక్షణ ప్రాధాన్యత తెలిసేలా చేసిన ప్రయత్నాలన్నీ ఫలితాలు ఇస్తున్నాయని అదనపు అటవీ సంరక్షణ అధికారి (వైల్డ్ లైఫ్) మునీంద్ర తెలిపారు.  తల్లి ఫల్గుణతో పాటు మూడు పిల్లలను కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తున్నామని, వాటి రక్షణ చర్యలు తీసుకుంటున్నామని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ సి.శరవనన్ అన్నారు. ప్రత్యేకంగా సిబ్బందిని, బేస్ క్యాంప్ వాచర్స్ ను నియమించామని, వేటగాళ్ల కదలికలను నిరోధించటంతో పాటు, అటవీ ప్రాంతంలో ఉన్న ఉచ్చులను, వైర్లను గుర్తించి తొలగిస్తున్నామని అసిఫాబాద్ అటవీ అధికారి రంజిత్ నాయక్ తెలిపారు.
అసిఫాబాద్ అభయారణ్యంలో మూడు పిల్లలకు జన్మనిచ్చిన పెద్దపులి తెలంగాణ అడవులకు దక్కిన మరో అరుదైన ఘనత https://www.telugumuchatlu.com/another-rare-achievement-is-the-large-forest-of-telangana-forest-that-gave-birth-to-three-children-in-the-asifabad-sanctuary/
Tags:Another rare achievement is the large forest of Telangana forest that gave birth to three children in the Asifabad Sanctuary

రుణమాఫీ, ఉచిత విద్యుత్ తాత్కాలిక ఉపశమనంమాత్రమే

Date:03/07/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడువ్యవసాయ రంగం, రైతుల బలోపేతం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఐసీఏఆర్ అనుబంధ సంస్థలు, విశ్వవిద్యాలయాలు దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. దేశంలో రుణమాఫీ, ఉచిత విద్యుత్ సరఫరా.. వ్యవసాయ రంగానికి, రైతులకు శాశ్వత పరిష్కారం కాదని, కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని వెంకయ్యనాయుడు అన్నారు. ఇప్పటికే వ్యవసాయ రంగం సంక్షోభం నేపథ్యంలో… సవాళ్లు అధిగమించలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, మరికొందరు సేద్యాన్ని వీడి ఇతర రంగాల వైపు మళ్లిపోతున్నారని పేర్కొన్నారు. సంతోష్ నగర్ ఐసీఏఆర్ – జాతీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థలో రైతుల ఆదాయాల రెట్టింపుపై జరిగిన సమావేశానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.వ్యవసాయ సాంకేతిక అవసరాలు, పెట్టుబడి ఖర్చుల తగ్గింపు, విస్తరణ సేవలు, సంస్థాగత రుణాలు, మార్కెటింగ్ నిర్వహణ తదితర అంశాలపై రైతులు, ఎన్జీఓలు, శాస్త్రవేత్తలతో వెంకయ్యనాయుడు ముఖాముఖి మాట్లాడారు. రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే… వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలను కూడా ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు.
రుణమాఫీ, ఉచిత విద్యుత్ తాత్కాలిక ఉపశమనంమాత్రమే https://www.telugumuchatlu.com/debt-relief-free-electricity-temporary-relief/
Tags:Debt relief, free electricity temporary relief

స్వచ్ఛతకు పట్టం

Date:03/07/2018
కరీంనగర్‌ ముచ్చట్లు:
జాతీయ స్వచ్ఛ్‌ విద్యాలయ్‌ పురస్కారాల రేస్ కు కరీంనగర్‌ జిల్లాలోని రెండు పాఠశాలలు ఎంపికయ్యాయి. గత విద్యాసంవత్సరానికి గాను అందజేసే ఈ అవార్డ్ కు అర్హత సాధించడంతో సదరు పాఠశాల విద్యార్ధులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే గంగాధర మండలం ఓడ్యారం, సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలు స్వచ్ఛ్ విద్యాలయ్ కోసం రాష్ట్రం నుంచి పోటీ పడుతున్నాయి. యూనిసెఫ్‌ వారు నియమించిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కూడా ఇటీవలే ఈ రెండు పాఠశాలలను పరిశీలించారు. పాఠశాలల నిర్వహణ, సౌకర్యాలు, పరిశుభ్రత కోసం చేపడుతున్న కార్యక్రమాలు, విద్యార్థుల క్రమశిక్షణ, అలవాట్లు, మధ్యాహ్న భోజనం వంటి వాటిని వారు ప్రత్యక్షంగా గమనించారు. వాస్తవానికి ఈ అవార్డుల కోసం 90 శాతం పాఠశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లో స్వచ్ఛతలో మెరుగైన స్కోరు సాధించిన ఓడ్యారం జడ్పీ పాఠశాల 100 శాతం స్కోరుతో టాప్ లో నిలిచింది. జడ్పీ పాఠశాల వెన్నంపల్లి 94 శాతంతో పోటీకి అర్హత సాధించింది. జాతీయ స్థాయి పురస్కారాలతో పాటు రాష్ట్రస్థాయి పురస్కారాలను ఆగస్ట్ లేదా అక్టోబరు లో ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇదిలాఉంటే ప్రస్తుతం అర్హత సాధించిన పాఠశాలలకు జాతీయ పురస్కారాలు లభించే అవకాశం ఉందని అక్కడి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.ఇప్పటికే కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర మండలంలోని ఆదర్శ పాఠశాల, తిమ్మాపూర్‌ మండలంలోని కొత్తపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, జగిత్యాల జిల్లాలోని అంబారిపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో జాతీయ స్థాయి స్వచ్ఛ్‌ విద్యాలయ్‌ అవార్డులtను కైవసం చేసుకున్నాయి. తాజాగా కరీంనగర్‌ జిల్లాలోని మరో రెండు ప్రభుత్వ పాఠశాలలు ఈ అవార్డులకు పోటీపడుతున్నాయి. ఈ పాఠశాలల స్ఫూర్తితో.. జిల్లాలోని ఇతర బడులు కూడా పురస్కారాలకు అర్హత సాధించాలన్న పట్టుదల పెరుగుతోంది. జిల్లాలో 671 ప్రభుత్వ, 306 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. సుమారు 1.40 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. రెండు మూడేళ్లుగా స్వచ్ఛ్‌ విద్యాలయ్‌ పురస్కారం పోటీలో భాగంగా సర్కారు బడుల్లో పరిశుభ్రమైన వాతవారణానికి ప్రాధాన్యతనిస్తున్నారు.. తాగునీరు, మరుగుదొడ్లు, పరిశుభ్రత వంటివి మెరుగయ్యాయి. అంతేకాక విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకే కాక పాఠశాల, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటున్నారు. మొత్తంగా స్వచ్ఛ్ విద్యాలయ్.. అవార్డులు.. పాఠశాలల్లో మంచి మార్పులే తీసుకొచ్చాయని అంతా అంటున్నారు.
స్వచ్ఛతకు పట్టం https://www.telugumuchatlu.com/purity/
Tags:Purity

 చిరు వ్యాపారాలు..చిక్కులు..

Date:03/07/2018
ఆదిలాబాద్‌ ముచ్చట్లు:
ఆదిలాబాద్ టౌన్ లో ఫుట్ పాత్ లపై వ్యాపారాలతో పాదాచారులు నానాపాట్లు పడుతున్నారు. చిరువ్యాపారుల కోసం అనువైన ప్రణాళిక రూపొందించటంలో బల్దియా అధికారులు విఫలమవడంవల్లే ఈ దుస్థితి అని స్థానికులు అంటున్నారు. అధికారుల ఉదాసీనతతో పలువురు వ్యాపారులు నడక దారిని ఆక్రమించేసుకున్నారని.. దీంతో ఫుట్ పాత్ ఉన్నా రోడ్లపైనే నడవాల్సి వస్తోందని స్థానికులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. పట్టణంలో రహదారుల పక్కన చిరు వ్యాపారాలు చేసుకోవటానికి వీలు ఉన్న ప్రాంతాలు, నిషేధ ప్రాంతాలు, నిర్ణీత సమయంలో ఈ వ్యాపారాలు చేసుకునే స్థలాలను పురపాలక అధికారులు గుర్తించారు. ఈ స్థానాలను వెండింగ్, నాన్ వెండింగ్, నిర్ణీత సమయాల్లో విక్రయాలు జరుపుకునేలా.. విభజించారు. ఈ కార్యక్రమం సాగి ఏళ్లు గడిచినా.. ఆచరణలోకి మాత్రం రాలేదు. దీంతో ప్రజలకు పాట్లు తప్పడంలేదు. పట్టణంలో కొన్ని దారులు ఇరుకుగా ఉంటాయి. ఇలాంటి రోడ్లలో కొంత భాగాన్ని చిరువ్యాపారులు ఆక్రమించడంతో.. వాహనదారులు ముప్పుతిప్పలు పడాల్సి వస్తోంది. కొన్నిచోట్ల డ్రైనేజీలపైనా వ్యాపారాలు సాగిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా రోడ్లు ఇరుకైపోవడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పలువురు గాయాలపాలవుతున్నారు. ఈ విషయం తెలిసినా సంబంధిత అధికార యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. కొన్నిప్రాంతాల్లో నిర్ణిత సమయంలో మాత్రమే వ్యాపారాలు చేసుకోవటానికి రిస్ట్రిక్టెడ్‌ జోన్‌గా గుర్తించారు. కానీ స్థానిక నేతల చేతివాటం కారణంగా ఇక్కడ శాశ్వత దుకాణాలు ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ఏర్పాటైన షాపుల్లో ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలు, కొబ్బరి బోండాల విక్రయ కేంద్రాలు సైతం ఉన్నాయి. వీటిని తరలించాలని పట్టణవాసులు పలు మార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో కొంత స్థలాన్ని నాన్‌వెండింగ్‌ జోన్‌ గా పరిగణించారు. అయితే ప్రాంతంలో తోపుడు బండ్లు ఉండటంతో పాటు ఎక్కడబడితే అక్కడ ఇష్టారీతిన వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో రహదారి అంతా ఇరుకుగా మారి ట్రాఫిక్ కు ఇబ్బంది ఏర్పడుతోంది. తరచూ ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ సమస్యపై స్పందించిన అధికారులు చిరువ్యాపారులకు వారి వ్యాపారాలు సాగటానికి వీలున్న ప్రాంతాలను అన్వేషిస్తున్నట్లు వివరించారు. వ్యాపారాలు కొనసాగించటానికి నిర్దేశించిన వెండింగ్‌ జోన్ల వల్ల తమకు నష్టాలు వస్తాయని వ్యాపారులు అంటున్నట్లు చెప్పారు. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు యత్నిస్తున్నామని త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
 చిరు వ్యాపారాలు..చిక్కులు.. https://www.telugumuchatlu.com/small-business/
Tags:Small business ..

మురుగునీరు సమస్య పరిష్కారానికి ఇండి సైక్లర్ యంత్రాన్ని పరిశీలించిన మేయర్

Date:03/07/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
జీహెచ్ఎంసీ శివారు ప్రాంతాల్లో మురుగునీరు సమస్య పరిష్కారానికిగాను జెట్టింగ్, సక్కింగ్, రీసైక్లింగ్ చేసే ఆధునిక యంత్రాన్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ నేడు పరిశీలించారు. సీవరేజ్ పనులను మ్యాన్వల్గా కాకుండా యంత్రాలతో చేపట్టేందుకుగాను ఆధునిక యంత్రాలను సమకూర్చుకునేందుకుగాను ఆర్యన్ ఎన్విరో సొల్యూషన్ రూపొందించిన ఇండి సైక్లర్ అనే ఈ యంత్రాన్ని మేయర్ నేడు ఉదయం పరిశీలించారు. ఈ యంత్రం ద్వారా ఒకే సారి 12,000 లీటర్ల మురుగునీటిని పీల్చడంతో పాటు డ్రైనేజీలలోని మట్టిని కూడా పీల్చుతుంది. అయితే పీల్చిన మురుగునీరును రీసైక్లింగ్ చేసి అదేనీటితో సీవరేజ్ నాలాలను కూడా శుభ్రపరుస్తుంది. ఈ మిషన్ పనితీరును ఇంజనీర్లు పరిశీలించి ధృవీకరించిన అనంతరం ప్రతి జోన్కు ఒకటి సమకూర్చే అంశాన్ని పరిశీలిస్తామని మేయర్ రామ్మోహన్ తెలిపారు. చర్లపల్లి డివిజన్లో మన నగరం-మన డివిజన్మన నగరం, మన డివిజన్ కార్యక్రమంలో భాగంగా నేడు చర్లపల్లి డివిజన్ పై సమీక్ష సమావేశాన్ని మేయర్ బొంతు రామ్మోహన్ నిర్వహించారు.  ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్తో పాటు వివిధ శాఖల అధికారులు, 63 కాలనీల ప్రతినిధులు, మహిళా సంఘాలు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలు, ఇంజినీరింగ్ విభాగం, శానిటేషన్, పార్కులు, ఎలక్ట్రికల్, మంజీరా, డ్రైనేజీ, రోడ్లు, రెవెన్యు విభాగానికి సంబంధించి 58, 59 జీవోలకు సంబంధించి ఇంటి నెంబర్లతో పాటు పలు సమస్యలపై సమీక్ష నిర్వహించి సమస్యల సత్వర పరిష్కారానికై అధికారులకు సూచించి త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులను మేయర్ ఆదేశించారు.
మురుగునీరు సమస్య పరిష్కారానికి ఇండి సైక్లర్ యంత్రాన్ని పరిశీలించిన మేయర్ https://www.telugumuchatlu.com/mayor-who-examined-the-indo-cycling-machine-to-solve-the-problem-of-sewage/
Tags:Mayor who examined the Indo-Cycling machine to solve the problem of sewage

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై న‌గ‌ర‌వ్యాప్తంగా చైత‌న్య కార్య‌క్ర‌మాలు

Date:03/07/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదంపై నేడు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున చైత‌న్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించింది. న‌గ‌రంలోని అధిక శాతం పాఠ‌శాల‌ల్లో నిర్వ‌హించిన ప్రేయ‌ర్‌ల సంద‌ర్భంగా ప్లాస్టిక్ వినియోగం వ‌ల్ల క‌లిగే అన‌ర్థాలు ఒకే సారి వాడి పారేసే ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌ను ఉప‌యోగించ‌డం నిషేదిస్తున్న‌ట్టు ప్ర‌తిజ్ఞ‌ను నిర్వ‌హించారు. సికింద్రాబాద్ సెంట్ ప్యాట్రిక్ హై స్కూల్‌లో నిర్వ‌హించిన అంత‌ర్జాతీయ ప్లాస్టిక్ నిషేద దినోత్స‌వంలో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థుల‌ను ఉద్దేశించి క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా ప్లాస్టిక్ వ‌స్తువుల వాడ‌కంపై స్వియ నిషేదాన్ని విధించాల‌ని, ఈ విషయంలో త‌మ కుటుంబంతో పాటు ప‌రిస‌ర ప్రాంతాల వారిని చైత‌న్య ప‌ర్చాల‌ని విద్యార్థినీవిద్యార్థుల‌కు సూచించారు. నేడు ఉద‌యం జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో న‌గ‌రంలోని హోట‌ళ్లు, రెస్టారెంట్లు, ఫంక్ష‌న్‌హాళ్ల నిర్వాహ‌కుల స‌మావేశం నిర్వ‌హించి వారిచే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదించేలా ప్ర‌తిజ్ఞ చేయించారు. ఎల్బీన‌గ‌ర్ ఇండోర్ స్టేడియంలో నేడు నిర్వ‌హించిన జాబ్‌మేళాకు హాజ‌రైన వంద‌లాది మంది నిరుద్యోగ యువ‌త‌తో ఎల్బీన‌గ‌ర్ శాస‌న స‌భ్యులు ఆర్‌.కృష్ణ‌య్య ప్లాస్టిక్ వాడ‌కాన్ని పూర్తిగా మానివేస్తాన‌ని, కూర‌గాయ‌ల‌కు ఇత‌ర అవ‌స‌రాల నిమిత్తం వెళ్లేట‌ప్పుడు విధిగా క్లాత్ లేదా జూట్ బ్యాగ్‌ల‌ను వినియోగిస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేయించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేద దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని న‌గ‌ర వ్యాప్తంగా ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌లు, కాల‌నీ సంక్షేమ సంఘాల‌తో క‌లిసి ర్యాలీల‌ను జీహెచ్ఎంసీ అధికారులు నిర్వ‌హించారు. న‌గ‌రంలోని పార్కుల్లో మార్నింగ్ వాక‌ర్స్‌తో ప్లాస్టిక్ నిషేదంపై ప్ర‌తిజ్ఞ నిర్వ‌హించారు. అన్ని కూర‌గాయల మార్కెట్లు, వీక్లి మార్కెట్ల‌లో ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌ను ఉప‌యోగించ‌కూడ‌ద‌ని చైత‌న్య కార్య‌క్ర‌మాల‌ను జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్వ‌హించారు. జీహెచ్ఎంసీ నిర్వ‌హించే అన్ని క్రీడా మైదానాల్లో శిక్ష‌ణ పొందే క్రీడాకారుల‌తో ప్లాస్టిక్ నిషేదంపై ప్ర‌తిజ్ఞ నిర్వ‌హించారు. జీహెచ్ఎంసీ ఎంట‌మాల‌జి సిబ్బంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌ల‌గ‌డంతో పాటు దోమ‌ల వ్యాప్తికి కార‌ణ‌మ‌య్యే అంశంపై చైత‌న్య కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై న‌గ‌ర‌వ్యాప్తంగా చైత‌న్య కార్య‌క్ర‌మాలు https://www.telugumuchatlu.com/citywide-awareness-programs-on-single-use-plastic/
Tags:Citywide awareness programs on single use plastic

మిషన్ భగీరథ భేష్ : కేంద్రమంత్రి

Date:03/07/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ లోని ప్రతీ ఒక్కరికి సురక్షిత తాగునీటిని అందించబోతున్న సీఎం కేసీఆర్ కు హాట్సాఫ్ అన్నారు కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రి రమేష్ చంద్రప్ప జిగజిగాని. మిషన్ భగీరథ స్పూర్తితో దేశంలోని ప్రతీ ఇంటికి నల్లాతో నీళ్లు ఇచ్చే పథకాన్ని చేపడతామని చెప్పారు. ఇవాళ సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని మిషన్ భగీరథ నిర్మాణాలను రమేష్ చంద్రప్ప పరిశీలించారు. ముందుగా సంగారెడ్డి జిల్లా బోరుపట్ల లోని హెడ్ వర్క్స్ ను చూసారు. తాగునీరు శుద్ధి అయ్యే విధానాన్ని Rws&s ఈఎన్.సి సురేందర్ రెడ్డి, కేంద్ర మంత్రి కి వివరించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తో కలిసి హెడ్ వర్క్స్ లోని ప్రతి విభాగాన్ని రమేష్ చంద్రప్ప పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను చూశారు. సంగారెడ్డి సెగ్మెంట్ లో తాగునీటి సరాఫరా తీరును తెలిపే ఫ్లో డయాగ్రామ్ ను చూసారు. ఆ తర్వాత మీడియా తో మాట్లాడిన రమేష్ చంద్రప్ప,చాలారోజుల నుంచి భగీరథ ను  చూడాలనుకుంటున్నానని  ఇవాల్టి తో ఆ కోరిక తీరిందన్నారు. తాను ఇప్పటిదాకా ఎన్నో తాగు నీటి పథకాలను చూశానని అయితే రాష్ట్రం మొత్తానికి ఒకేసారి నీళ్లు అందించే ఇలాంటి భారీ  పథకాన్ని ఎక్కడా చూడలేదన్నారు.యావత్ దేశానికి మిషన్ భగీరథ మోడల్ అన్నారు. ఆతర్వాత మాట్లాడిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి, తెలంగాణ ప్రజల దుప తీరుస్తున్న అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అన్నారు. అక్కడి నుంచి మెదక్ జిల్లా రామచంద్రపురం వెళ్లిన కేంద్ర మంత్రి, ఇంటింటికి ఇచ్చిన నల్లా కన్నెక్షన్స్ ను పరిశీలించారు. నల్లాలో సరాఫరా అవుతున్న నీటిని తాగారు. చాలా బాగా ఉన్నాయని మెచ్చుకున్నారు. ఆతర్వాత సంగారెడ్డి జిల్లా పెద్దారెడ్డిపేట్ దగ్గర నిర్మించిన ఇంటెక్ వెల్, హెడ్ వర్క్స్ ను చూశారు. మీడియా తో మాట్లాడారు. మంచి పని ఎవరు చేసినా మెచ్చుకోవాలన్నారు. మిషన్ భగీరథ కోసం సీఎం కేసీఆర్ పడుతున్న తాపత్రయం అభినందనీయమన్నారు. కేంద్ర నిధులతో సంభందం లేకుండానే ఇంత భారీ ప్రాజెక్ట్ ను చేపట్టడం సాహసం అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల కృషి తో సీఎం కేసీఆర్ అనుకున్నది సాధిస్తున్నారని చెప్పారు.మిషన్ భగీరథ పై కేంద్ర మంత్రుల స్థాయిలో చర్చ జరుగుతోందని చెప్పారు. దేశం లో ఉన్న తాగునీటి కష్టాలకు చెక్ పెట్టాలంటే మిషన్ భగీరథ లాంటి పథకమే శరణ్యం అన్నారు. ఈ దిశగా కేంద్రం ఇప్పటికే ఆలోచించిందన్నారు. అయితే ఇందుకు 5 లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయన్నారు. తన స్వంత రాష్ట్రం కర్ణాటకలో మిషన్ భగీరథ లాంటి పథకం కోసం గత సీఎం సిద్ధరామయ్య తో చర్చించానని, త్వరలోనే కర్ణాటక RWS&S అధికారులను తెలంగాణకు పంపిస్తామని చెప్పారు.
మిషన్ భగీరథ భేష్ : కేంద్రమంత్రి https://www.telugumuchatlu.com/mission-bhagirath-bhesh-union-minister/
Tags:Mission Bhagirath Bhesh: Union Minister