చెరువులకు పటిష్ట భద్రత : మంత్రి కేటీఆర్ 

Date:13/04/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నెక్నాంపుర్ గ్రామం లో గ్రామ చెరువులు, శుద్ధి సుందరీకరణ పనులను శంకుస్థాపన పనులు రాష్ట్ర ఐటీ పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కేటి రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో కేటీ రామారావు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ మల్ల రెడ్డి, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ లు, తెరాస నాయకులు, జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, హెచ్ ఎండీయే కమిషనర్ చిరంజీవులు, అధికారులు పాల్గొన్నారు. సభ లో మంత్రి  మాట్లాడుతూ చెరువుల గురించి ముఖ్య అంశాలను ప్రసంగించారు.  గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మొత్తం 40 చెరువులను పూర్తీ స్థాయిగా ఆధునీకరణ, సుందరీకరణ మరియు అభివృద్ధి పనులను నిర్వహిస్తారని, దాని కోసం  తెలంగాణ ప్రభుత్వం మొత్తం 441 కోట్ల రూపాయిలు మంజూరు చేసిందనిమంత్రి అన్నారు. 1920 లో ఏర్పడిన గండిపేట చెరువు 2020 లో తన 100 సంవత్సరాలు పూర్తీ చేసుకుంటుంది. ఈ సందర్బంగా గండిపేట చెరువు సుందరీకరణ, అభివృద్ధి కోసానికి తెలంగాణ ప్రభుత్వం 100 కోట్ల రూపాయిలు మంజూరు చేసిందని అన్నారు. చెరువులు కబ్జాలకు గురు అవుతున్నాయి. చెరువుల భూములను కబ్జాలు చేస్తే, ఎంత పెద్ద అయినా వారందరి పై చర్యలు తీసుకుంటామని కేటీఅర్  అన్నారు. అదే విధంగా చెరువు ను రక్షణ కోసం ఓ సెక్యూరిటీ ను ఏర్పాటు చేసి, అతన్ని ఓ సైకిల్,  విజిల్  ఇస్తామని చెప్పారు. చెరువు చుట్టూ పక్కన ఒకవేళ 100 అపార్ట్మెంట్ కన్నా ఎక్కువ ఉంటె, ఆ అపార్ట్మెంట్ గాని గేటెడ్ కమ్యూనిటీ గాని, కాలనీ వాసులకు బరువు కాకుండా బిల్డర్ ల వద్ద ఎస్టీపీ  కట్టించుకోవాలని ఆదేశాలిచ్చారు. అదే విధంగా దత్తకు తీసుకున్న ప్రతి చెరువుకు దగ్గర ఉండి చూడాలని ఏమ్మెల్యే, ఎంపీ లకు కు కూడా విజ్ఞప్తి చేసారు.
Tags;’Strengthening of ponds: Minister Ketiar

ఇసుక స్కాంలో మంత్రి కృష్ణారావు : కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్  

Date:13/04/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
కేసీఆర్ సర్కార్ లో ఎవరికి తోచిన విధంగా వారు దోపిడీకి లాల్పడుతున్నారు. గాడికింద పండికొక్కుల్లా రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారు. మంత్రి జూపల్లి కృష్టారావు అక్రమ  ఇసుక రవాణాకు పాల్పడుతున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఆంద్రప్రదేశ్ లోని ప్రాజెక్ట్ కు ముప్పై కోట్ల విలువైన ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నాడు. కొల్లాపూర్ ఇసుక అక్రమ రవాణా లో జూపల్లి ఉన్నాడు కాబట్టే అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. అక్రమ ఇసుక రవాణా ను అరికట్టడంలో కేటిఆర్ ఫెయిల్ అయ్యాడు. పోలీసు లకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఫారెస్ట్ ల్యాండ్ లో అక్రమంగా రోడ్డు వేసి .. తిప్పర్ల ద్వారా లాంచీలల్లో లోడ్ చేసి రవాణా చేస్తున్నారని అయన అన్నారు. ఈ అక్రమ ఇసుక రవాణాపై ప్రభుత్వం విచారణ జరిపించాలని అన్నారు.
Tags: Krishna Rao in sand scam: Congress leader Dasasu Shravan

ప్లీనరీ తీర్మానాలు సిద్దమవుతున్నాయి :  కేకే

Date:13/04/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెరాస ప్లీనరీ కి తీర్మానాలు రూపొందించే పని ప్రారంభమయ్యింది. ఎన్ని తీర్మానాలు అనేది ఇంకా నిర్ణయించలేదని ప్లీనరి కమిటీ చైర్మన్ కె .కేశవ రావు అన్నారు. శుక్రవారం అయన మీడియా సమావేశంలో పాల్గోన్నారు. సంక్షేమంలో దేశం లోనే తెలంగాణ నంబర్ వన్ స్థానం లో ఉంది. సహజంగానే ప్లీనరీ లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఉంటుందని  అయన అన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగం లో తెలంగాణ సాధించిన ప్రగతిని ప్లీనరీ లో చర్చిస్తాం. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని కెసిఆర్ ఇచ్చిన పిలుపు పై ప్లీనరీ లో చర్చిస్తాం. కేంద్ర రాష్ట్ర సంబంధాల పై చర్చ ఉంటుంది. తండాలను గ్రామ పంచాయతీ లుగా చేసిన అంశం పై చర్చిస్తామని అయన అన్నారు. రాజకీయ తీర్మానం ఉంటుంది. .రెండు రోజుల్లో తీర్మానాలు సిద్దమవుతాయి. ఈ భేటీ కి హాజరు కాని సభ్యులు త్వరలోనే సమావేశం లో పాల్గొంటారు. మంచి తీర్మానాలు ప్రజలకు మేలు జరిగే రీతిలో రూపొందుతాయని ఆశిస్తున్నానని అయన అన్నారు.
Tags:Plenary resolutions are ready: keke

ఈనెల 21 నుంచి హోదా ఉద్యమాలు

 Date:13/04/2018
రాజమహేంద్రవరం ముచ్చట్లు:
ఈనెల 21 నుండి 27 వరకూ  ప్రత్యేకహోదా సాధనకోసం దశాలవారీ ఉద్యమం చేస్తామని ఎంపీ మురళీమోహన్ తెలిపారు. శుక్రవారం నాడు అయన రాజమండ్రీలో ఎమ్మెల్యేలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ లో అవిశ్వాసం పై చర్చకు అవకాశం ఉన్నా.. బిజెపి కావాలనే చర్చకు రానివ్వలేదు. రాబోయే కాలంలో బిజెపికి డిపాజిట్లకూడా రాకుండా చేస్తామని హెచ్చరించారు.
మంత్రి జవహర్ మాట్లాడుతూ మోడీ హిట్లర్ లాగా, నయంతలాగా దేశాన్ని విభజించి పాలించాలని చూస్తున్నారు. నిన్న మోడీ చేసిన దీక్ష దొంగజపంలా ఉంది. అధికారదాహంతో దేశాన్ని విభజించి పాలించాలను కుంటున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడంవల్లే వార్డు మెంబర్ కూడా కాలేని మాణిక్యాలరావు లాంటివాళ్ళు మంత్రి అయ్యారని అయన విమర్శించారు. ఎంపీ హరిబాబు లాంటివాళ్ళు గెలవడానికి కూడా టిడిపి మద్దతే కారణమని అయన అన్నారు.
Tags:Status movements from 21st of this month

న్యాయమూర్తి ఇంట్లో ఏసీబీ సోదాలు

Date:13/04/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
The judge searches ACB in the house
The judge searches ACB in the house
హైదరాబాద్ ఒకటో అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జి ఎస్ రాధాకృష్ణమూర్తి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఒక డ్రగ్స్ కేసు నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు అయన రూ. 7.5 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై గురువారం  అర్ధరాత్రి నుంచి ఏసీబీ సోదాలు జరిగాయి.  ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసిన ఓ వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు ఆయన డబ్బు డిమాండ్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఒక బెయిల్ విషయం లో అవినీతి ఆరోపణలు రావడంతో  హై కోర్ట్ ఆదేశాలతో జడ్జి రాధాకృష్ణ మూర్తి  ఇంట్లో సోదాలు చేస్తున్నాం. డ్రగ్స్ కేస్ లో ఒక వ్యక్తికి బెయిల్   ఇవడం  కోసం  డబూలు  డిమాండ్ చేశారని ఆరోపణ ఉందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.  హైదరాబాద్ అల్వాల్ తో పాటు మరి రెండు చోట్ల సోదాలు కొనసాగాయి. రాధ కృష్ణ మూర్తి ఇంటి తో పాటు మరో ఇద్దరు న్యాయవాదుల ఇళ్లపై కుడా సోదాలు నిర్వహించారు. రాధ కృష్ణమూర్తికి  డబ్బిచ్చి తాను బెయిల్ తెచ్చుకున్నానని బాధితుడు దత్తు  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, హైకోర్టు దీన్ని తీవ్రమైన నేరంగా పేర్కొంది. ఆయనపై వెంటనే కేసు నమోదు చేసి విచారించాలని ఆదేశించింది. గత సంవత్సరం ఓ నైజీరియన్ తో కలసి దత్తు అనే ప్రొఫెసర్ ను అరెస్ట్ చేయగా, బెయిల్ ఇచ్చేందుకు రూ. 11 లక్షలను రాధాకృష్ణ మూర్తి డిమాండ్ చేశారని, చివరకు రూ. 7.5 లక్షలకు బేరం కుదిరిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ ఈ న్యాయమూర్తిపై ఆరోపణలు వచ్చాయని, ఆదాయానికి మించిన ఆస్తులను సంపాదించారన్న ఆరోపణలపైనా సోదాలు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.ఇప్పటి వరకు ఆస్తులను గుర్తించాం కానీ అవి సక్రమంగా కాదా అని దర్యాప్తు లో తేలాలి. బ్యాంక్ లాకర్, వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు లభించాయి. కేసులో నిందితుడికి, జడ్జికి మధ్యవర్తులుగా వ్యవహరించిన న్యాయవాదులపైన కేసు నమోదైంది. న్యాయవాదులు శ్రీనివాస్‌రావు, సతీష్‌ కుమార్‌లను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జడ్జి, ఇద్దరు న్యాయవాదులను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానానికి తరలించామని ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రమణ కుమార్ వివరించారు.
Tags:The judge searches ACB in the house

 పనుల్లో నిర్లక్ష్యం.. వృధా అవుతున్న జలం..

Date:13/04/2018
కరీంనగర్ ముచ్చట్లు:
పట్టణీకీకరణ పుణ్యమాని కరీంనగర్ పరిధి విస్తరిస్తోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న జనాభాకు తగ్గట్లుగా స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రాంతీయంగా నీటి కొరతను తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే నిరంతరం నీరు అందుబాటులో ఉండేలా పైప్‌లైన్‌ పనులు సాగుతున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా.. తవ్వకాల సమయంలోనే అజాగ్రత్తల వల్ల ఇది వరకే నీటి కోసం వేసిన సిమెంట్‌ పైప్‌లు ధ్వంసమవుతున్నాయి. దీంతో నీరు వృధా అవుతోంది. అసలే వేసవి. ఆపై నీటి కొరత ఉంటోంది. ఇలాంటి తరుణంలో నీరు వృధా అవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రొక్లెయిన్లతో తవ్వకాలు సాగించేటప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని, పైప్‌లైన్లు పగిలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేనిపక్షంలో వేసవిలో నీటికి కటకట నెలకొంటుందని స్పష్టం చేస్తున్నారు. రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో  కరీంనగర్‌ పరిధిలో రహదారుల పనులు సాగుతున్నాయి. ఈ పనులను మే నాటికి పూర్తి చేయాలన్నది అధికారుల టార్గెట్. మొత్తం 14.5 కి.మీ రోడ్డు వేయాల్సి ఉండగా అందులో 7 కి.మీ మేర ఇప్పటికే పూర్తయింది. మిగతా 7.5 కి.మీ పొడవునా పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. రహదారులకు ఇరువైపులా డ్రైనేజీలు, విద్యుత్తు టవర్లు, తాగునీటి పైపులైన్లు వేసే పనులు కూడా  చేస్తున్నారు. అయితే తాగునీటి పైపులైన్లు వేసే సమయంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పనులు త్వరిగతిన పూర్తిచేయాలన్న తలంపుతో వేగంగా చేస్తున్నారు. హడావిడి పనుల ద్వారా పైప్‌లైన్లలో సమస్యలు వస్తున్నాయి. దీంతో స్థానికంగా పలు వీధుల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని నగరవాసులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి పనులు పక్కాగా సాగేలా చర్యలు తీసుకోవాలని, తాగునీటికి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
Tags:The neglect of works .. the water that is wasted

ఈ-పాస్‌తో ఇక్కట్లకు చెక్!

Date:13/04/2018
ఆదిలాబాద్ ముచ్చట్లు:
రేషన్ సరకులు పక్కదోవ పట్టకుండా లబ్ధిదారులకే అందేలా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఈ-పాస్ విధానాన్ని అమలు చేస్తోంది. అంతేకాక లబ్ధిదారులు సొంత ఊళ్లోనే కాక వారు బస చేస్తున్న ప్రాంతం నుంచీ రేషన్ పొందే సౌకర్యం కల్పించింది. దీంతో అనేకమందికి అవస్థలు తప్పడంతో పాటూ రవాణా చార్జీల భారం సైతం తగ్గిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కార్డు ఉన్నచోటనే సరకులు తీసుకోవాలన్న నిబంధనను మార్చింది సర్కార్. లబ్ధిదారుల నివాసానికి ఏ దుకాణం దగ్గరగా ఉంటుందో అక్కడికి వెళ్లి బియ్యం తీసుకునే వెసులుబాటు లభించింది. ఈ సేవలతో జిల్లా వాసులతో పాటు ఇతర జిల్లాలవారు ఎక్కడ ఉంటే అక్కడే సరకులు తీసుకుంటున్నారు. రెండువారాల వ్యవధిలో 10,470 మంది కార్డుదారులు ఈ తహా సేవలను వినియోగించుకున్నట్లు సమాచారం. పోర్టబిలిటీ సేవలు వినియోగించుకోవడం వల్ల కార్డుదారులకు దూరభారంతో పాటు ఆర్థికంగా కలిసొచ్చింది.ఆదిలాబాద్‌ పట్టణంలోనే దాదాపు 43 దుకాణాలు పోర్టబిలిటీ సేవలు అందిస్తున్నాయి. దీంతో ఈ దుకాణాల్లో కార్డుదారులు సేవలను వినియోగించున్నారు. ఫలితంగా 4,335 వరకూ లావాదేవీలు జరిగాయి. వారంతా కార్డు కలిగిన దుకాణంలో కాకుండా తమకు సమీపంలో ఉన్న దుకాణానికి వెళ్లి బియ్యం తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా పోర్టబిలిటీ సౌకర్యంతో ఈనెల ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు 10,470 మంది 3200 క్వింటాళ్ల బియ్యం తీసుకున్నట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా 355 దుకాణాలు ఉంటే 271 దుకాణాల్లో పోర్టబిలిటీ సేవలను కార్డుదారులు వినియోగించుకున్నారు. మొదట్లో  వేలిముద్ర వేస్తేనే బియ్యం పంపిణీ చేసేవారు. దీంతో తొలి మాసంలో వేలిముద్రలు పడక.. కార్డు ఒకచోట మనుషులు మరోచోట ఉండటంతో చాలా మంది రేషన్ తీసుకోలేకపోయారు. ఈ సమస్య గ్రహించి ఉన్నచోటనే రేషన్‌ తీసుకునేలా పోర్టబిలిటీ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో జిల్లావాసులు వేరే జిల్లాలో ఉన్నవారితో పాటు.. ఇతర జిల్లాల నుంచి జిల్లాకు వలస వచ్చిన వారికి రేషన్‌ సరుకులు తీసుకునే అవకాశం దక్కింది.
Tags:Check this e-mail with e-pass

.అంగన్‌వాడీలకు ఉపశమనం

Date:13/04/2018
కామారెడ్డి ముచ్చట్లు:
కామారెడ్డి జిల్లాలో పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో వసతుల లేమి తాండవిస్తోంది. ఉష్ణోగ్రతలు విజృంభిస్తుండడంతో సమస్యలు మరింతగా తీవ్రమయ్యాయి. ఇరుకు గదులు, మంచినీటి కొరత, ఉక్కపోతలతో చిన్నారులేకాక సిబ్బందీ ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఈ దుస్థితి గమనించిన సంబంధిత అధికార యంత్రాంగం అంగన్‌వాడీలను ఒంటిపూట నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచీ ఆదేశాలు జారీ అయ్యాయి. వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తున్న నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ వెసులు బాటు కల్పించినట్లు చెప్పారు. ఉష్ణోగ్రతలో చోటుచేసుకున్న మార్పులతో కేంద్రాల్లో సరైన వసతులు లేక పిల్లలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. దీంతో వచ్చే నెల 31 వరకు అంగన్‌వాడీలు ఒంటిపూటే కొనసాగుతాయి.
కామారెడ్డిలో 1193 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. నిజామాబాద్‌లో 1500 ఉన్నాయి. ఇరు జిల్లాల్లో అనేక కేంద్రాలకు సొంత భవనాలు లేవు. దీంతో అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రధానంగా కొన్ని కేంద్రాలు ఇరుకు గదుల్లో ఉండటంతో పిల్లలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఫ్యాన్ల సౌకర్యం లేకపోవడంతో లబ్ధిదారులు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. దీనికితోడు ఒకే గదిలో గర్భిణులు, పిల్లలు, బాలింతలు భోజనం చేయడం ఇబ్బందిగా మారుతోంది. వేసవిలో ఈ ఇబ్బందులకు చెక్ పెడుతూ అంగన్‌వాడీలను ఒంటిపూటే నిర్వహించేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అవడంతో అంతా హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇదిలాఉంటే ప్రభుత్వ సూచనల మేరకు అంగన్‌వాడీ కేంద్రాలను ఉదయం 7 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. 12 గంటల తరువాత చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పోషకాహారం అందిస్తారు.
Tags:.About the Angers