Natyam ad

బీజేపీ స్పెషల్ మీట్‌ లో తెలంగాణ మెను

హైదరాబాద్ ముచ్చట్లు:


బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ ముస్తాబవుతుంది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ, జాతీయ స్థాయి నాయకులు, అతిరథ మహారథులకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం స్పెషల్ ఏర్పాటు చేస్తుంది. రెండు, మూడు తారీఖుల్లో ప్రధాని మోదీ సహా నేతలకు తెలంగాణ రుచులు చూపించాలని నిర్ణయించారు. ఈమేరకు బీజేపీ స్పెషల్ మీట్ లో తెలంగాణ స్పెషల్ వంటకాలను సిద్ధం చేస్తున్నారు.జులై 2,3 తేదీల్లో జరగబోయే బీజేపీ స్పెషల్ మీట్‌ లో స్పెషల్ మెనును ఫైనల్ చేశారు. మధ్యాహ్నం భోజనంలో తెలంగాణ వంటకాలు ఉండేలా చూస్తున్నారు. పచ్చిపులుసు, పంటికూర పప్పు, గంగవాయిలి- మామిడి పప్పు, తెల్లజొన్నరొట్టెలు, బూందీలడ్డూను ఆల్ మోస్ట్ మెనులో చేర్చారు. సాయంత్రం స్నాక్స్ గా సర్వపిండి, సకినాలు, గారెలు వడ్డించనున్నారు. ఇప్పటికే ఈ వంటల్లో కరీంనగర్‌ కు చెందిన యాదమ్మ ఆయా పరిసరాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు.జాతీయ కార్యవర్గ సమావేశాల్లో స్పెషల్ మెనునూ సిద్ధం చేసేందుకు కరీంనగర్‌ నుంచి యాదమ్మను హైదరాబాద్ కు రప్పించారు. యాదమ్మతో పాటు నోవాటెల్‌ చెఫ్‌లతో బండి సంజయ్‌ ఇప్పటికే భేటీ అయ్యారు. వంటకాలు అదరహో అనేలా ఉండాలని చెఫ్ లకు సూచించినట్లు తెలుస్తుంది.బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఫుడ్ కమిటీ నేతృత్వం వహిస్తున్న హన్మకొండ మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘జూన్ 29న నోవాటెల్‌లో షెఫ్‌లతో కలిసి టెస్ట్‌ రన్‌ నిర్వహించాలని యాదమ్మను ఆహ్వానించాం. “తెలంగాణలో అందించే అత్యుత్తమ ఆహారాన్ని ప్రతినిధులకు అందజేస్తామని మా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గట్టిగా చెప్పారు. అదే మేము చేస్తాము” అని ఆయన అన్నారు.

 

Tags: Telangana menu at BJP special meet

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.