తెలంగాణ మంత్రులు హద్దులు దాటారు :  జగన్

విజయవాడ ముచ్చట్లు:

 

ఏపీ క్యాబినెట్ భేటీలో మంత్రివర్గ సహచరులతో సీఎం వైఎస్ జగన్ పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగా తెలంగాణతో నెలకొన్న జలవివాదం..తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలపై జగన్ క్యాబినెట్ భేటీలో సీరియస్‌గా చర్చించినట్లు సమాచారం. తెలంగాణ నేతలు దూకుడు పెంచినా సంయమనం పాటించడంపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని.. వాళ్లని ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతోనే ఆగుతున్నట్లు సీఎం జగన్ మంత్రులతో అన్నట్లు సమాచారం.అలాగే ఏపీ రైతులకి నష్టం జరిగితే చూస్తూ ఊరుకోబోమని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ మంత్రుల వ్యవహార శైలిపై కూడా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తెలంగాణ మంత్రులు పరిధి దాటి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయంలో ఆలోచించి ముందుకు వెళ్లాలని సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తోంది. విద్యుదుత్పత్తి కోసం కృష్ణా జలాలను తెలంగాణ ప్రభుత్వం వాడుకోవడంపై కృష్ణా బోర్డుకి మరోమారు లేఖ రాయాలని సీఎం జగన్ మంత్రులను ఆదేశించారు. నీటి వివాదంపై సీఎం జగన్ క్యాబినెట్ సమావేశంలో చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరురాష్ట్రాలు పట్టువదలకుండా ముందుకెళ్లడంతో ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Telangana ministers cross borders: Jagan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *