తెలంగాణ పోలీసులను చూసి నేర్చుకోండి: మాయావతి

Telangana Police Watch and Learn: Mayawati

Telangana Police Watch and Learn: Mayawati

Date:06/12/2019

లక్నో ముచ్చట్లు:

దిశ హంతకుల ఎన్ కౌంటర్  పై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ పోలీసుల చర్యను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై బీఎస్సీ అధినేత్రి మాయవతి స్పందించారు. జాతీయ మీడియాతో మాట్లాడారు. దిశ హంతకుల ను ఎన్ కౌంటర్ చేసిన నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై తెలంగాణ పోలీసులను బీఎస్పీ అధినేత్రి మాయవతి అభినందించారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కారుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో అత్యాచారం కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై వచ్చిన నిందితులు తిరిగి ఆ అత్యాచార బాధితురాలిని సజీవదహనం చేసేందుకు ప్రయత్నించిన వైనం పై ఆమె మండి పడ్డారు. యూపీలో మహిళల పై దాడులు పదే పదే సాగుతున్నాయని.. యోగి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని బీజేపీ నిద్రపోతోందా అని నిలదీశారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలంగాణ పోలీసుల నుంచి స్ఫూర్తి  పొందాలని మాయవతి సూచించారు.దిశ హంతకులను ఎన్ కౌంటర్ చేసిన వైనం పై బీజేపీ ఢిల్లీ నేత కపిల్ మిశ్రా స్పందించారు. తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. దిశా కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేసినందుకు సంతోషమన్నారు.

 

 

 

 

 

 

 

 

రేపిస్టులతో ఇలాగే వ్యవహరించాలని.. మిగతా రాష్ట్రాల పోలీసులు తెలంగాణ పోలీసులను చూసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.ఇక దిశ హంతకుల ఎన్ కౌంటర్ పై ఏపీ లో ఇలాగే బలి అయిపోయిన అయేషా తల్లి స్పందించారు. రాజకీయ జోక్యంతోనే అయేషా కు అన్యాయం జరిగిందని.. ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. దిశ కేసు నిందితులు సామాన్యులు కాబట్టే ఎన్ కౌంటర్ చేశారని.. సజ్జనార్ లాంటి అధికారి అయేషా కేసును దర్యాప్తు చేసుంటే తమ బిడ్డకు న్యాయం జరిగేదని అయేషా తల్లి అన్నారు. అత్యాచారాలు ఆగేలా ప్రత్యేక చట్టాలు తేవాలని అయేషా తల్లి అన్నారు.దిశ హంతకుల ఎన్ కౌంటర్  పై మంత్రి గంగుల స్పందించారు. ఇదీ తెలంగాణ పోలీస్ సత్తా అని కొనియాడారు. ఆడ బిడ్డలకు తెలంగాణ సేఫ్ జోన్ అన్నారు. మహిళల  వైపు చూడాలంటే వణుకు పుట్టాలని.. అల్లరి మూకల ఆగడాలకు తెలంగాణ లో స్థానం లేదన్నారు.దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ కౌంటర్ చేసిన హైదరాబాద్ పోలీసులే మంచి న్యాయనిర్ణేతలు అని.. ఏ పరిస్థితుల్లో ఈ ఎన్ కౌంటర్ జరిగిందో తనకు తెలియదని అన్నారు. నిందితుల ఎన్ కౌంటర్ పై నేనెంతో సంతోషించానని తెలిపారు. నేరస్థులకు ఇలాంటి ముగింపు సరైనదన్నారు.శంషాబాద్ లో నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ పై పోలీసులూ స్పందించారు. మంచి పని చేసినప్పుడు ప్రజలు హర్షిస్తారని తెలిపారు.దిశ హంతకుల ఎన్ కౌంటర్ పై దిశ నివాసం ఉంటున్న కాలనీవాసులు స్పందించారు. పోలీసులు న్యాయం చేశారని.. తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

 

వైజ్ఙానిక ప్రదర్శనను ప్రారంబించిన కలెక్టర్

 

Tags:Telangana Police Watch and Learn: Mayawati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *