తెలంగాణ జనసమితి ఆవిర్బావం

Date:02/04/2018
హైదరాబాద్ ముచ్చట్లు;
తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ  ప్రారంభం అయింది. తెలంగాణ ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్. కొత్తగా తెలంగాణ జన సమితి పేరుతో పార్టీని ప్రకటించారు. ఈనెల 29న హైదరాబాద్లో పార్టీ ఆవిర్భావ సభ భారీఎత్తున నిర్వహిస్తామని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డా ఉద్యమ ఆకాంక్ష నెరవేరలేదని అందుకే తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని కోదండరామ్ అన్నారు. సోమవారం నాడు లక్డీకాపూల్ లోని సెంట్రల్ కోర్టు హోటల్ లో అయన ప్రకటన చేసారు. చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం..చాలా మంది మేధావులతో ,ప్రోఫెసర్లతో చర్చించాం.  దేనికోసం అయితే తెలంగాణ సాధించుకున్నామో దాని కోసం ఈ ప్రభుత్వం పనిచేయట్లేదని అయన అన్నారు. ఉద్యమ ఆకాంక్ష తో ఏ వర్గాలకు న్యాయం జరుగుతుందని భావించామో ఆ వర్గాలకు న్యాయం జరగలేదు.రైతులకు గిట్టుబాటు ధరలేదు. రాష్ర్టంలో ప్రజాస్వామ్యం లేదు..క్యాబినెట్ లో మహిళా మంత్రిలేరు. మంత్రి సంబంధం లేకుండానే ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటంన్నారని అయన విమర్శించారు. సెక్రటేరియట్ కు ముఖ్యమంత్రి రారు ,ప్రజలను కలవరు.. హైదరాబాద్ నగరంలో సభలకు అనుమతి ఇవ్వరు. గొర్రెల పంపిణీ కీ లాట్రి తీస్తరు ,కాని ట్రాక్టర్ల పంపిణీ కి లాట్రీ తీయరని అయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అవినీతి వేళ్ళూరుకు పోయింది. యాత్రలు చేయాలంటె కోర్టు కు వెళ్ళి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి.  జేఏసీ జేఏసీ గానే ఉంటుంది.. జేఏసీ వెలుపల పార్టీ వ్యవహారాలు ఉంటాయని అయన స్పష్టం చేసారు. తెలంగాణ అభివృద్ధి. సామాజిక న్యాయం, దిశగా మా విధానాలు ఉంటాయి. తెలంగాణ జనసమితి గా మా పార్టీ పేరును కరారు చేసుకున్నామని అయన వెల్లడించారు.  జనం కోసమే జనసమితి.  పార్టీ జెండా రూపకల్పనకు కళాకారుల సహాయం తీసుకున్నామని అయన అన్నారు. 12 సబ్ కమిటీలను వేసాం.  సభ నిర్వాహనవ్యవహరాలు  ఈ కమిటీలు చూసుకుంటాయని అయన అన్నారు.
మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ మాట్లాడుతూ అందరు జండాలను పక్కన పెట్టి అందరు పోరాడితేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వస్తే ఆశించింది ఒకటి కాని జరుగుతుంది మరోటి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రశ్నించడమే నేరమా అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. టీ జేఏసీ ఏ కార్యక్రమం చేపట్టిన అరెస్టు లు చేసారు. కోదండరాం తెల్ల కాగితం లాంటివారని అయన అన్నారు.
Tags:Telangana population evolution

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *