తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలు

బాధ్యతాయుత ప్రతిపక్షంగా వుంటాం
ఎమ్మెల్సీ తాత మధు
ఖమ్మం ముచ్చట్లు:

 
Post Midle

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చాయి. బి.ఆర్.ఎస్ పార్టీ గెలుపు కోసం అహోరాత్రులు కష్ట పడిన వారికి ధన్యవాదాలని ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. సోమవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో అయన మీడియాతో మాట్లాడారు.
నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులకు శుభాకాంక్షలు. రాష్ట్రం కోసం పోరాటాలు చేసిన చరిత్ర మాది.  75 ఏళ్లు గా చేయలేని పనులు బి.ఆర్.ఎస్ చేసింది. రాష్ట్ర సంక్షేమం కోసం ఓ బాధ్యత కల్గిన ప్రతీ పక్షా పాత్ర పోషిస్తాం. మా ఎమ్మెల్యే లు, ఎంపి లు జిల్లా అభివృద్ది కి కృషి చేశారు. కాంగ్రెస్ కూడా అదే తరహా లో కాంగ్రెస్ కృషి చేస్తుందని ఆశిస్తున్నాని అన్నారు.
కాంగ్రెస్ 6 గ్యారంటీ లు అమలు కు ఇచ్చిన హామీ అమలు శ్రీకారం చుట్టాలి. ప్రజా స్వామ్య వ్యవస్థ లో ప్రజా తీర్పు గౌరవం ఇస్తున్నాం. ప్రజలు ఏమీ కోరుకుంటే అదీ జరుగుతుంది. రాబోవు కాలంలో మా టీమ్ అందరం అన్ని వర్గాల, ప్రజా సమస్యలపై పోరాడుతాం.  విలక్షణ తీర్పు ఇచ్చిన భద్రాచలం ప్రజలకు దన్యవదాలని అన్నారు.

Tags: Telangana state election results

Post Midle