దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం-గవర్నర్ తమిళిసై
హైదరాబాద్ ముచ్చట్లు:
శుక్రవారం నాడు తెలంగాణ శాసనసభలో గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధి దేశానికే రోల్ మోడల్ అని కొనియాడారు. సీఎం కేసీఆర్..ప్రజా ప్రతినిధుల కృషి ఎంతో ఉందన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారి దళితబంధుని ప్రవేశపెట్టారన్నారు. గవర్నర్ ప్రసంగిస్తూ హైదరాబాద్ నలువైపుల 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం, నిమ్స్లో అదనంగా మరో 2వేల పడకలు, తెలంగాణలో గతంలో 3 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు 17కు పెంచుకున్నామని అన్నారు. మరో 9 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. . మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు అందించాం. రాష్ట్రం ఏర్పడగానే ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాం.. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాం.,. వృద్యాప్య పెన్షన్ వయసును 57ఏళ్లకి తగ్గించామన్నారు. తలసరి ఆదాయం రూ.3,17,115కి పెరిగిందన్నారు.మూడున్నరేళ్లలో
Tags; Telangana State-Governor Tamilisai is an ideal for the country

