పేపర్ యాడ్ లో తెలంగాణ సింబల్

Date:27/01/2021

విజయవాడ ముచ్చట్లు:

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ముందే ఎన్నికల సంఘం వర్సెస్ జగన్ సర్కారుగా పోరు నడిచింది. సుప్రీం కోర్టు తీర్పుతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో రాష్ట్రం ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహణకు సహకరిస్తామని తెలిపింది. కాగా పంచాయతీ ఎన్నికలకు పార్టీలతో సంబంధం లేదని.. ఏకగ్రీవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ సర్కారు చెబుతోంది.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను పెంచడం కోసం ప్రోత్సాహకాలను గతంలో కంటే పెంచింది. 2 వేల లోపు జనాభా ఉన్న గ్రామపంచాయతీలు ఏకగ్రీవమైతే.. రూ.5 లక్షలు.. 2 వేల నుంచి 5 వేల జనాభా ఉన్న పంచాయతీ ఏకగ్రీవమైతే రూ.10 లక్షలు, పది వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, 10 వేల పైబడిన జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు జీవో జారీ చేయడంతోపాటు.. పత్రికా ప్రకటన సైతం జారీ చేసింది.కానీ ఈ ప్రకటన ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. ఈ యాడ్ కోసం తెలంగాణ గ్రామ పంచాయతీ భవనం ఫోటో వాడి తప్పులో కాలేశారు. సమాచార, పౌరసంబంధాల శాఖ ఇచ్చిన యాడ్‌లో పంచాయతీ ఆఫీసు భవనంపై.. తెలంగాణ సర్కారు చిహ్నం ఉండటంతో విపక్షాలు జగన్ సర్కారును టార్గెట్ చేశాయి. పంచాయతీ ఎన్నికల ప్రకటన కోసం ఏపీలో ఒక్క పంచాయతీ భవనమైనా మీకు దొరకలేదా..? అని ప్రశ్నిస్తున్నాయి.

ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 ల‌క్ష‌లు విరాళం

Tags; Telangana symbol in paper ad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *