దయనీయ స్థితిలో తెలంగాణ విశ్వవిద్యాలయాలు

Date:17/04/2018

హైద్రాబాద్  ముచ్చట్లు:

విద్యార్థి భవిష్యత్ ను తీర్చిదిద్దాల్సిన విశ్వవిద్యాలయం సమస్యల నిలయాలుగా మారుతున్నాయి..కనీస వసతులు లేక కోట్టుమిట్టాడుతున్నాయి ..ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియాలోను ఇదే పరిస్థితి. ప్రవేటు యూనివర్శిటి కి రేడ్ కార్పెట్ వేసిన ప్రభుత్వం..యూనివర్శిటిలను గాలికి వదిలేసింది అన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమైన 12 యూనివర్శిటీలలోను ఇదే పరిస్ధితి నెలకొంది. 50 శాతం కూడ స్టాప్ లేని పరిస్థితి నెలకొంది. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, అంబెద్కర్ యూనివర్శిటి ఇలా అన్ని యూనివర్శిటిలలోను తీవ్ర కొరత నెలకొంది. గతంలో యూనివర్శిటిలకి బడ్జెట్ లో కేటాయించిన వాటిలో 25 శాతం కూడా కేటయించలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అన్ని యూనివర్శటిలలో కలిసి 1061 పోస్టులు భర్తీ వున్నాయి అంటే సిబ్బంది కొరత ఏ విధంగా ఉందో తెలుస్తుంది. నాణ్యమైన విద్య పై పై పై పరిశోదనలే జరుగుతున్నాయి అని పదే పదేవిమర్శలు వస్తున్న పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇంక తేలంగాణ యూనివర్శిటీలకు మకుటం లాంటి ఉస్మానియా యూనివర్సిటి పరిస్థితి మరి దారుణంగా వుంది. ఉద్యమానికి ఊపిరి పోసి తెలంగాణఅంటేనే ఉస్మానియా అని పించుకున్న తెలంగాణ యూనివర్సిటి పరిస్థితి రోజు రోజు దిగజారుతూనే కనిపిస్తుంది. నిజానికి ఉస్మానియా కి 1268 మంది అధ్యాపకులు కావాలి. కాని ప్రస్తుతం వుంది కేవలం 514 మాత్రమే. మిగతా వారంత కాంట్రక్ట్, పార్ట్ టైం ఎంప్లాయిస్. ప్రస్తుతం వున్న వారి లో రిటైర్ అవుతున్నా వారి ప్లేస్ లో రిక్రూట్ మెంట్ కూడా జరగడం లేదు. తెలంగాణ వచ్చాక కూడా రెండు సంవత్సరాలుగా తెలంగాణ వీసి లేని పరిస్ధితి. ఉస్మానియాలో మూడు సార్లు రిక్రూట్ మెంట్ చేసారు. 2004 లో 25 మంది, 2007 లో 150 మంది, 2013 లో 170 మంది అయితే రిక్రూట్ చేసిన వారి కన్నా రిటైర్మెంట్ తీసుకున్న వారే ఎక్కువ కావడం విశేషం. 20 డిపార్గ్ మెంట్లలో హెడ్ లేని పరిస్థితి ప్రోఫెసర్ ప్లేస్ లో అసిస్టేంట్ ప్రోఫెసర్లు మాత్రమే వున్నారు. నిజానికి ప్రోఫెసర్ లేకుండా యూజిసి గ్రాంట్స్ అందడం కష్టం. ఇక గత సంవత్సర బడ్జెట్ కేటాయింపులు 200 ల కోట్లు. ఖర్చుచేసింది 50 కోట్లు మాత్రమే. అంటే ప్రభుత్వ చిత్తశుద్ది తేలుస్తుంది. ఈ సంవత్సరం తెలంగాణ బడ్జెల్లో విద్య వైద్యానికి పెద్ద పీట వేశాం అని ప్రభుత్వం చెబుతున్నా నిధులు మంజురు అయ్యే వరకు నమ్మకం లేదు అంటున్నారు విద్యావేత్తలు. గతంలోకేటాయించినా కేటాయింపులో దీనికి ఉదాహరణ అంటున్నారు. చాల యూనివర్శిటీలకు యూనివర్శిటి గ్రాంట్ నిధులు రావడం లేదు. ఓ వైపు అధ్యాపకుల కొరత, మరో వైపు వసతుల లేమి తో యూనివర్శిటిల ర్యాంకులు దిగజారుతున్నాయి. తెలంగాణ విద్యార్థుల లెక్క ప్రకారం అనేక కొత్త యూనివర్శిటిలు రావల్సిన అవసరం కనిపిస్తుంది. తెలంగాణ యూనివర్సిటీ, పోట్టి శ్రీరాములు యూనివర్శిటి, అచార్య ఎన్ జి రంగా యూనివర్శిటి, మహత్మగాంధి యూనివర్విటీలలో పరిశోదన విభగంలోఅనేక ఇబ్బందులు పడుతున్నమని అంటున్నారు విద్యార్ధులు. గ్రాంటులు ఇవ్వడానికి యూజిసి సిద్దంగా వున్నా, ల్స్ ప్రకారం యూనివర్శిటీలు లేవని అంటున్నారు యూజిసి గ్రాంట్ కమిషనర్ గోపాల్ రెడ్డి. ఓ వైపు నిధులు లేక సతమతమవుతున్నయూనివర్శిటిలలో ఇప్పుడు అధ్యాపకులు ధర్నాకు పిలుపునిచ్చారు. తమకు ఫెన్షన్ అందడం లేదని కనీసం ప్రభుత్వం ఇస్తున్న కంట్రిబ్యూటరి పెన్షన్ కూడా మాకు అందడం లేదని, గత నాలుగు సంవత్సరాలుగా అడుగుతున్నా తమను ఎవ్వరు పట్టించుకోవడం లేదని ఈనెల 18 నుండి ధర్నా చేయనున్నారు. మరి ఓ వైపు పరీక్షలు మరో వైపు పీజీ క్లాసులు జరుగుతున్న ఈ టైం లో ఆ ధర్నా విధ్యార్ధులను మరింత ఇబ్బంది పెట్టె అవకాశం మాత్రం లేకపోలేదు.

Tags:Telangana Universities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *