దీపికారెడ్డి బృందంచే తెలంగాణ వైభవం నృత్యరూపకం

Telangana vibrant dance by Deepika Reddy team

Telangana vibrant dance by Deepika Reddy team

Date:12/01/2019
వరంగల్ ముచ్చట్లు:
ఈ నెల 16 న సాయంత్రం 6 గంటలకు వేయి స్తంబాల గుడి ఆవరణలో పర్యాటక శాఖ భాగస్వామ్యంతో దీపికారెడ్డి బృందంచే తెలంగాణ వైభవం కూచిపూడి నృత్యరూపకం ప్రదర్శించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ తెలిపారు. అందరికీ ఉచితంగా ప్రవేశంగా కల్పింస్తున్నట్లు తెలిపారు. నగరంలోని సంగీతం, సాహిత్య సాంస్కృతిక, కళల అభిమానులందరూ ఈ ప్రదర్శనను తిలకించాలని కోరారు. ఈ కార్యక్రమం గురించి శనివారం కలెక్టర్ లో సమాచార పౌరసంబంధాల శాఖ ఉపసంచాలకుడు యాసా వెంకటేశ్వర్లు, జిల్లా పర్యాటక అధికారి శివాజి, పరంపర సాంస్కృతిక సంస్థ ప్రతినిధులు డా.జి.సురేష్ కుమార్, డా.హరిత లతో చర్చించారు. గుడిసంబరాలు పేరిట భారతీయ ప్రాచీన సాహిత్యం, సంగీతం, నాట్యం, ఆధ్యాత్మికను భవితరాలకు అందించాడానికి  రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి యోట జనవరి,ఫిబ్రవరి మాసాల్లో  పరంపర సంస్థ నృత్య ప్రదర్శనలు ఇస్తున్నాది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 24 మంది కళాకారులు 90 నిమిషాలు పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో తెలంగాణ సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలిపే ఘట్టాలను నృత్య రూపకంగా ప్రదర్శిస్తారని తెలిపారు.
Tags:Telangana vibrant dance by Deepika Reddy team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *