తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నవర్షాలపొంగి పోరలుతున్న వాగులు వంకలు

Telangana vulvarvaravaraiyattu vayalukalaiyatukalukku swinging clogs
Date:11/08/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో పలుచోట్ల రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. కూసుమంచి మండలం నర్సింహులగూడెంలో నల్లకుంట వాగు పొంగుతోంది. దీంతో నర్సింహులగూడెం – పోచారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముదిగొండ మండలం చిరిమరిలో చెరువు అలుగు పొంగి ఇళ్లలోకి నీరు చేరింది. మణుగూరు మండలంలో కోడిపుంజుల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రహదారిపైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నేలకొండపల్లి మండలం ఆరెగూడెంలో చెరువుకట్ట తెగిపోయింది. 150 ఎకరాల పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారం, మహాదేవాపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాల్లో భారీ వర్షం పడుతోంది. మహాముత్తారం – కాటారం మధ్య లోలెవల్ వంతెనపై నుంచి వాగు ప్రవహిస్తోంది. ధౌత్పల్లి, పోతులవాయి వాగులు పొంగుతున్నాయి. వర్షాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు అంతరాయం ఏర్పడింది. అన్నారం బ్యారేజీ వద్ద కరక్కట్ట నిర్మాణం పనులు నిలిచిపోయాయి. కన్నెపల్లి పంప్‌హౌస్, గ్రావిటీ కెనాల్, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాంక్రిట్ పనులు నిలిచిపోయాయి. మందమర్రిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కల్యాణికణి, ఆర్కేపీ ఉపరితల గనుల్లో 9వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి, శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణాపూర్, బైరిగూడలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.శ్రీరాంపూర్‌లో ఉపరితల గనిలో మట్టి పనులు నిలిచిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షం పడుతోంది. వర్షాల కారణంగా వ్యవసాయ పనులకు తీవ్ర ఆటకం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాయగూడెం వద్ద గోదావరిలో ముగ్గురు యువకులు చిక్కుకున్నారు. చేపల వేటకు వెళ్లిన యువకులు నదిలో చిక్కుకుపోయాయి. జాలర్ల సాయంతో యువకులను బయ్యారం పోలీసులు కాపాడారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బోనకల్లు మండలంలోని కలకోట పెద్ద చెరువు అలుగు పోస్తుంది. చెరువు అలుగు పోస్తుండటంతో.. భారీగా గ్రామస్తులు అక్కడికి చేరుకుంటున్నారు. ఈ చెరువు కింద 463 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. చెరువుకు భారీగా నీరు రావడంతో.. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువులో చేపలు పట్టేందుకు మత్స్యకారులు చేరుకుంటున్నారు. ఇక చెరువు వద్ద యువకులు సెల్ఫీలు దిగుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం : ఉమ్మడి ఖమ్మం జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజుక్టుకు వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తడంతో.. 9 గేట్లు ఎత్తి దిగువకు 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కిన్నెరసాని ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 50 వేల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 50 వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 406.8 అడుగులు.
Tags:Telangana vulvarvaravaraiyattu vayalukalaiyatukalukku swinging clogs