Telugu brothers and sisters

ముఖం చాటేస్తున్న తెలుగు తమ్ముళ్లు

Date:09/04/2020

ఏలూరు ముచ్చట్లు:

వారంతా పెద్ద మనుషులు. నారా చంద్రబాబు నాయుడు నమ్మిన నేతలు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించిన వాళ్లే. కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పడు మాత్రం వారు మొహం చాటేశారు. క్యాడర్ కు కూడా దొరకడం లేదు. ఇది చంద్రబాబు కు కూడా ఆందోళన కల్గించే అంశమే. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన తర్వాత చంద్రబాబు ఒక్కొక్క నేత పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్లు ఏమాత్రం చొరవ చూపారన్న దానిపై ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ నేత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యులు కాలేదని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసిందిపశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుకు ఎటువంటి డౌట్ లేదు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ హేమాహేమీలున్నారు.

 

 

 

పితాని సత్యనారాయణ, జవహర్ వంటి నేతలు మంత్రులుగా కూడా పనిచేశారు. మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ఆరుమిల్లి రాధాకృష్ణ, గన్ని వీరాంజనేయులు తదితరులున్నారు. ఒక్కొక్కరూ రెండు సార్లు గెలిచిన అనుభవం ఉంది. క్యాడర్ కూడా వీరికి పెద్ద సంఖ్యలో ఉంది.అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరిప్రమేయం ఏమాత్రం లేదని తెలుస్తోంది. డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందన్న భయమో? లేక అధికార పార్టీ నుంచి కేసులు భయమో? తెలియదు కాని నామినేషన్ల ప్రక్రియలో కూడా వీరు పాలుపంచుకోలేదు. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ బడేటి బుజ్జి మరణంతో టీడీపీకి నాయకత్వం లేకుండా పోయింది.

 

 

 

ఈ నేపథ్యంలో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను చూడాల్సిన మాగంటి బాబు పత్తా లేకుండా పోయారంటున్నారు. కార్యకర్తలకు కూడా అందుబాటులో లేరట.అలాగే కొవ్వూరు నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. మీడియా ముందుకు పదే పదే వచ్చే మాజీ మంత్రి జవహర్ స్థానిక సంస్థల ఎన్నికలను పట్టించుకోలేదు. తనకుబాధ్యతలను అప్పగించక పోవడంతోనే దూరంగా ఉన్నానని జవహర్ చెబుతున్నారు.

 

 

 

 

ఇక మాజీ మంత్రి పితాని సత్య నారాయణ కూడా ఎన్నికలు వాయిదా పడిన తర్వాత నియోజకవర్గంలో కాలు మోపారట. చివరకు ప్రభుత్వంపై చిందులేసే చింతమనేని కూడా నామినేషన్లు పూర్తయ్యే వరకూ కనపడలేదట. ఎన్నికలు వాయిదా పడిన తర్వాత మాత్రమే దర్శనమిచ్చారట. మొత్తం మీద తాను నమ్మిన నేతలే స్థానిక సంస్థల ఎన్నికల్లో రివర్స్ గేర్ వేయడంతో చంద్రబాబు నివేదికలు చూసి నివ్వెర పోయారంటున్నారు. మొత్తం మీద పెద్దమనుషులనుకున్న వారే పనికిరాకుండా పోయారు.

శాస్త్రోక్తంగా స్వామి వారికి ప్రసాదాలు

Tags: Telugu cousins chatting face

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *