Telugu Desam leader arrested in raffle ticket business

లాటరీ టికెట్ల వ్యాపారంలో తెలుగుదేశం నాయకుడు అరెస్ట్

– మరో ఇద్దరు అరెస్ట్

Date:04/06/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు చంద్రశేఖర్‌ చట్టవిరుద్ధంగా లాటరీ టికెట్లు వ్యాపారంలో అరెస్ట్ అయ్యాడు. గురువారం సీఐ గంగిరెడ్డి విలేకరులకు తెలిపిన మేరకు పట్టణంలోని మాజీ కౌన్సిలర్‌ భర్త చంద్రశేఖర్‌ తన అనుచరులైన రియాజ్‌బాషా, రషీద్‌బాషాలతో కలసి లాటరీ టికెట్లు విక్రయిస్తుండగా ఈనెల 2న కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. దీనిపై దర్యాప్తు చేసి ఉదయం 9 గంటలకు బస్టాండులో ఉండగా చంద్రశేఖర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి , వారి వద్ద నుంచి 12 లాటరీ టికెట్లను, రూ.4,790 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండుకు తరలించారన్నారు.

లేబర్‌కార్డు కలిగిన వారు సంప్రదించాలి

Tags: Telugu Desam leader arrested in raffle ticket business

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *