తెలంగాణ లో పడి లేస్తున్న తెలుగుదేశం పార్టీ.

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ లో బలం పుంజుకుంటున్న తెలుగుదేశం పార్టీ. BRS పార్టీ నుంచి కీలక నేత, ఓ మాజీ మంత్రి తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు స్వీకరించే అవకాశం. ఇప్పటికే ఆతలాకుతలం అయినా BRS నాయకులు అటు కాంగ్రెస్ కు పోలేక. ఇటు BRS పరిస్థితి బాగా లేకపోవడం తో తెలుగుదేశం వైపు చూస్తున్నట్లు విశ్వాసనీయ వర్గాల సమాచారం. గతం లో మాజీ తెలుగుదేశం నాయకులతో నిండిపోయిన BRS పార్టీ. BRS పార్టీ పతనం అవ్వడం తో తిరిగి తెలుగుదేశం లోకి చేరేందుకు BRS మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే లు కలిసి తిరిగి తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ కి పునర్జీవం పొసేందుకు ఒకరికి ఒకరు మంతానాలు జరుపుతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో బంపర్ మెజారిటీ తో అధికారం చెప్పట్టిన తరువాత, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ లో ఉంటుంది అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు తో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన తరువాత ఒక్కసారిగా తెలంగాణ తెలుగుదేశం లో మారిన పరిణామాలు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి బలం గా ఉండటం. అలాగే తెలంగాణ తెలుగుదేశం పార్టీ లో కార్యకర్తలు కొదవ లేకుండా ఉండటం. బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలవడం, జనసేన కూడా కొన్ని ప్రాంతాల్లో బలం గా ఉండటం తో BRS నాయకుల చూపు ఒక్కసారి గా తెలుగుదేశం వైపు చూస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా BRS లో ఉన్న నాయకులు కెసిఆర్ పై నమ్మకం లేకపోవడం, కవిత అరెస్ట్, భవిష్యత్ లో KTR, కెసిఆర్ కూడా అరెస్ట్ అవుతారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో… ఎంతో మందికి రాజకీయ బిక్ష పెట్టిన పార్టీ తెలుగుదేశం అని గ్రహించి, తెలుగుదేశం పార్టీ లోనే ఉండటం మంచిది అని భావిస్తున్నా కొందరు BRS సీనియర్ నాయకులు, మంత్రులు,కొందరు ఎమ్మెల్యే లు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు స్వీకరించే ఆ కీలక నాయకుడిని బట్టి భవిష్యత్ లో తెలంగాణ లో సైలెంట్ గా ఉన్న నాయకులు అంత దాదాపు టీడీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశం.

 

 

 

Tags:Telugu Desam Party is rising in Telangana.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *