Natyam ad

తెలుగు జెండా మరింత పైకి

ఎక్స్ లెన్స్ కు అవార్డు…ముచ్చట్లు:

విజయవాడ,
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ప్రపంచ ప్రఖ్యాత పురస్కారం అయిన ఆస్కార్ గెల్చుకోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ అవార్డుతో తెలుగు వారి ఖ్యాతి మరింత పెరిగిందని ట్వీట్ చేశారు. ఎక్స్‌లెన్స్ అనే పదానికి ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎంఎం కీరవాణి సరికొత్త నిర్వచనం చెప్పారని సీఎం జగన్ కొనియాడారు. తెలుగువారినే కాక, భారతదేశం మొత్తాన్ని గర్వపడేలా చేశారని కొనియాడారు.‘‘తెలుగు జెండా మరింత పైకి ఎగిరింది. ఈ తెలుగు పాట మనకు ఎంతో గర్వకారణం. అంతర్జాతీయంగా గుర్తింపు పొందడమే కాకుండా మన జానపద వారసత్వాన్ని చాటింది. ఎక్స్‌లెన్స్ అనే పదానికి ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎంఎం కీరవాణి సరికొత్త నిర్వచనం చెప్పారు. ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎంఎం కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఇంకా ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తానికి ధన్యవాదాలు తెలుగు వారినే కాక, దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు’’ అని సీఎం ట్వీట్ చేశారు.

Post Midle

Tags;Telugu flag further up

Post Midle