అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ.. మేరీలాండ్ గవర్నర్‌గా అరుణా మిల్లర్
ఏడేళ్ల వయసులో ఏపీ నుంచి అమెరికాకు వెళ్లిన అరుణ
మిస్సోరి యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా
తనను ఉన్నత స్థానానికి తీసుకెళ్లారంటూ మేరీలాండ్ ప్రజలకు కృతజ్ఞతలు
అమెరికా ముచ్చట్లు:

అమెరికాలో మరో తెలుగు మహిళ చరిత్ర సృష్టించారు. మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పోటీ చేసి విజయం సాధించిన అరుణా మిల్లర్ (58) బాధ్యతలు చేపట్టారు. అరుణా మిల్లర్ తల్లిదండ్రులది ఆంధ్రప్రదేశ్. అరుణకు ఏడాది వయసు ఉన్నప్పుడు ఆమెను అమ్మమ్మ వద్ద వదిలిపెట్టి తల్లిదండ్రులు అమెరికా వెళ్లారు. ఆ తర్వాత 1972లో వచ్చి ఆమెను తీసుకెళ్లారు. మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్‌లో అరుణ పట్టా అందుకున్నారు.ఇప్పుడు మేరీలాండ్ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించి ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ అమెరికన్‌గా రికార్డులకెక్కారు. ప్రారంభ ఉపన్యాసంలో అరుణ మాట్లాడుతూ.. తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఇండియాలో జరిగిన తన బాల్యమంతా తల్లిదండ్రులు దగ్గర లేరన్న బెంగతోనే గడిచిందన్నారు. తన తండ్రి, తోబట్టువులు, అమ్మమ్మ కూడా పరాయి వారే అయిపోయారని అన్నారు. కాబట్టే ఇండియాలో గడిచిన అప్పటి విషయాలు.
Tags:Telugu woman who created history in America.. Aruna Miller as Governor of Maryland
