Natyam ad

సోమలలో వైఎస్సార్‌సీపీలో చేరిన తెలుగుదేశం కార్యకర్తలు

పుంగనూరు ముచ్చట్లు:

సోమల మండలం నెల్లిమంద కమ్మపల్లెకి చెందిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు 15 కుటుంబాలకు చెందిన వారు బుధవారం రాత్రి వైఎస్సార్‌సీపీలో చేరారు. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు బాబురావు, చంద్రశేఖర్‌నాయుడు ఆధ్వర్యంలో కమ్మపల్లె గ్రామస్తులు సయ్యద్‌, వల్లి, రియాజ్‌, అఫ్సర్‌, ముభారక్‌, మస్తాన్‌, బావాజి, షేక్‌మస్తాన్‌, షంషీర్‌, పటాన్‌బావాజాన్‌, మునాఫ్‌, మల్లి, మాలిక్‌, రెడ్డిబాషా, మహమ్మద్‌లు చేరారు. వీరిని పార్టీలో చేర్చుకుని , పార్టీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ విధానాలు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గానికి చేస్తున్న అభివృద్ధి పనులు చూసి పార్టీలో చేరామన్నారు. వైఎస్సార్‌సీపీకి రెండు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు.

 

Post Midle

Tags; Telugudesam activists who joined YSRCP among Somalis

Post Midle