శ్రీకాళహస్తి లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
శ్రీకాళహస్తి ముచ్చట్లు:
శ్రీకాళహస్తి పట్టణంలోని 10,వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు సీయస్ మస్తాను, మునీంద్ర ,రమేష్ ,సుబ్రహ్మణ్యం, ఫక్రుద్దీన్ ,బాబు, మధు ,శివ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్నది ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు మరియు రాష్ట్ర టిడిపి కార్యదర్శులుమళ్లీ శెట్టి వెంకటేశ్వర్లు , రెడ్డివారి గురవారెడ్డి మరియు పట్టణ అధ్యక్షులుజి విజయకుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం వల్ల కలుగు ప్రయోజనాలను వివరించడం జరిగినది . ఈ మూడు సంవత్సరాలలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారిని రోడ్డున పడేసి అన్నిటి పైన పన్నుల భారం మోపి సామాన్యుని జీవితం నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తామని పెరిగిన నిత్యావసర ధరలు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వివరించడం జరిగినది .ఈ కార్యక్రమము నందు రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి షాకీర్ ఆలీ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు షఫీ
తిరుపతి పార్లమెంటు కోశాధికారి కంట రమేష్ తిరుపతి రైతు ఉపాధ్యక్షుడు ప్రకాష్ రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి రవి,
ప్రసాద్ రావు ,సురేష్, కరీం, ఖాదర్ బాషా, వెంకటేష్ చౌదరి, ఖలీల్ భాషా ,మరియు వార్డు సభ్యులు పాల్గొనడం జరిగినది.

Tags: Telugudesam party membership registration program in Srikalahasti
