వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆలయాలు అభివృద్ధి- మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోని రాగానే ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పురాతన ఆలయాలకు కోట్లాది రూపాయలు నిధులు విడుదల చేసి అభివృద్ధి చేపట్టారని రాష్ట్ర విద్యుత్‌ , అటవీ, గణులు, పర్యావరణశాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం ఆయన సతీమణి స్వర్ణమ్మ, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో క లసి పట్టణంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని, యాదవ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా యాదవ సంఘ నాయకులు వెంకటరెడ్డి యాదవ్‌, సుబ్రమణ్యయాదవ్‌ ఆధ్వర్యంలో మంత్రి దంపతులకు ఘన స్వాగతం పలికి, గజమాలతో సత్కరించారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పుంగనూరు నియోజకవర్గంలోని పురాతన ఆలయాలను గుర్తించి, రూ.78 కోట్ల రూపాయలతో ఆలయాలు అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. యాదవులు ఐకమత్యంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్మించడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబరు పోకల అశోక్‌కుమార్‌, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, జెడ్పిటిసి జ్ఞానప్రసన్న, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, పార్టీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్‌, చెంగారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, సుదాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Temple Development in YSSRCP Government- Minister Dr. Peddireddy Ramachandrareddy

Post Midle
Natyam ad