Natyam ad

భక్తులతో ఆలయాలు కిటకిట

విశాఖపట్నం ముచ్చట్లు:


దసరా శోభతో రెండు తెలుగు రాష్ట్రాలు కళకళలాడుతున్నా యి.తెల్లవారుజాము నుంచే అమ్మ వారి ఆలయాలు భక్తులతో కిటకిట లాడుతు న్నాయి.శోభాయమానంగా దర్శనమి స్తున్న అమ్మవారిని దర్శించు కుంటున్న భక్తులు తన్మయత్వం చెందు తున్నా రు.ప్రత్యేక కుంకుమార్చ నలతో ఆలయాలు సందడిగా మారాయి.ప్ర త్యేక అలంకరణతో దేదివ్యమానంగా కాం తులీడుతున్న ఆలయాలు … ఆద్యాత్మికశోభను సత రించుకొని భక్తులను సన్మోహనపరుస్తున్నాయి. విశాఖ లో ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీ కనక మహా లక్ష్మీ అమ్మవారి దేవా లయంలో అమ్మవారి శరన్న వరాత్రి మహోత్సవాలు అంగ రంగ వైభవంగా ప్రారంభ మయ్యాయి. తొమ్మిది రోజున అమ్మవారు ఆదిలక్ష్మీ అమ్మవారి అవతారంలో భక్తులకు దర్శ నమిచ్చారు.దసరా ఉత్సవాల సంద ర్బంగా లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆల య ధర్మకర్తల మండలి చైర్మన్ కొల్లి సింహాచలం తెలిపారు. ఆలయానికి తరలి వస్తున్న భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.మొదటి రోజు జరిగిన ప్రత్యేక కుంకుమార్చనలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు.

 

Tags:Temples are crowded with devotees

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.