Natyam ad

మదనపల్లి దేశంలో కంచుకోటకు బీటలు

– భారంగా తొక్కుతున్న సైకిల్
-నానాటికి తగ్గుతున్న ఆదరణ
– ఎన్నికలు వేళ అసంతృప్తి

మదనపల్లి ముచ్చట్లు:


అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన క్యాడర్ ఉంది. అది ఎన్నికలు వస్తే అభ్యర్థితో సంబంధం లేకుండా సైకిల్ గుర్తుకి ఓటు వేసే ప్రజలు దాదాపు 80,000 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉన్న, కాంగ్రెస్ పార్టీ భావజాలాలు ఉన్న వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాష తాజాగా టిడిపి తీర్థం పుచ్చుకొని తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా మదనపల్లి బరిలో నిలిచారు. అయితే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి శాశ్వతంగా ఏర్పడిన క్యాడర్ మాత్రం షాజహాన్ భాషకు మద్దతు ఇవ్వడంలో మొదట్లో కాస్త ఉత్సాహం చూపించినా ఎన్నికలు దగ్గర పడే సమయానికి నిరుత్సాహపడుతున్నారు. మొదటి నుంచి వర్గపోరుతో సతమతమైన టిడిపి క్యాడర్ ప్రచార కార్యక్రమాల్లో సైతం నిరుత్సాహపడుతున్నారు. షాజహాన్ భాషాకి కానీ తన సోదరుడు నవాజ్ భాషా కి గాని సొంత క్యాడర్ ఉన్నప్పటికీ కూడా అది ఎన్నికల్లో ఏమాత్రం బలం చేకూరే విధంగా లేదు.

 

 

 

 

Post Midle

ప్రస్తుతం ఎన్నికల్లో టిడిపిలో జోష్ ఉందంటే అది ఒక్క కంచుకోటగా నిలబడ్డ కార్యకర్తల వల్ల మాత్రమే. అలాంటి కంచుకోట లో నిర్మతులైన నాయకులు కార్యకర్తలు సైతం నానాటికి డీలా పడుతున్నారు. సొంత మనుషుల మాటలు నమ్ముతూ వారికి ప్రాధాన్యత ఇస్తూ పైకి మాత్రం చిరునవ్వును చిందిస్తూ గెలుపే ధ్యేయంగా పనిచేస్తున్న షాజహాన్ భాష మనస్తత్వం అర్థం చేసుకుంటున్న టిడిపి క్యాడర్ మాత్రం ఎలాగైనా టిడిపి జెండా ఎగరవేయాలనే ధ్యేయంతో ముందుకు వెళుతున్నారే తప్ప అభ్యర్థికి మాత్రం జేజేలు పలకడం లేదు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ రాష్ట్రంలో ఉమ్మడి బరిలో ఉన్నా కానీ, పక్క నియోజకవర్గమైన పీలేరుకి చెందిననాయకుడు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నప్పటికీ ఆయన ఫోటోని గాని ఎన్నికల గుర్తు అయిన కమలాన్ని గాని ప్రజలు లేకి తీసుకుపోవడంలో షాజహాన్ భాష వెనకడిగేశారు.

 

 

 

 

దీనికి ప్రధాన కారణం షాజహాన్ భాష ఒక మైనార్టీ నాయకుడు అందులోను కాంగ్రెస్ పార్టీ భావజాలాలు ఉన్న వ్యక్తి. ఇందుకు అనుగుణంగానే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వర్గం అయితేనేమి, బిజెపి క్యాడర్ అయితే నేమి తమదైన శైలులో ముందుకెళ్తున్నారు. ఎన్నికలవేళ వివిధ సందర్భాల్లో వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించినా, ప్రతి సమావేశంలో కూడా ప్రోటోకాల్ విషయంలో పలు తప్పిదాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. స్వలాభం కోసం ముందుకొస్తున్న వ్యక్తులను నాయకులుగా భావించి, వారి మాటలు నమ్ముతూ ముందుకెళ్తున్న షాజహాన్ భాషకి ఎక్కడో ఒక చోట నిరసనసగా తగులుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ శ్రమిస్తూ సొంత డబ్బుని ఖర్చు పెడుతూ వైసిపి పాలనను ఎండగడుతూ వివిధ సందర్భాల్లో పలు కేసుల్లో నిందితులుగా మారి పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులను సైతం అవమానపరిచే విధంగా సరైన గుర్తింపు ఇవ్వకుండా షాజహాన్ భాష ముందుకు వెళ్లడంతో తన హావ భావాన్ని గమనిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అంతర్గతంగా నలిగిపోతున్నారు. ఇలాంటి నాయకుడు ఎమ్మెల్యేగా గెలుపొందితే రానున్న రోజుల్లో తమ గతి ఏంటంటూ పార్టీ హై కమాండ్ కి చెప్పేవారు కొందరైతే చెప్పుకోలేని వారు మరికొందరు ఉన్నారు.

 

 

 

 

జిల్లా అధికార ప్రతినిధి అయిన ఆర్జే వెంకటేష్ ని సైతం సముచిత గౌరవం ఇవ్వకపోవడంతో ఒక సభలో నుంచి అలిగి వెళ్లిపోవడం, మదనపల్లి పట్టణంలో నిర్వహించిన సభలో పట్టణ అధ్యక్షుణ్ణి సైతం వేదిక మీదకు ఆహ్వానించకపోవడం ఇలా పార్టీ కోసం కష్టపడిన వారు పార్టీ క్యాడర్ లో ఉన్న వారిని గౌరవించకపోవడంతో ఆ నాయకులంతా సతమతమవుతున్నారు. తాజాగా పట్టణంలో నిర్వహించిన కురబల ఆత్మీయ సమావేశానికి స్థానికంగా ఉన్న రాటకొండ హర్షవర్ధన్ రెడ్డి రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. అలాగే తెలుగు యువత రాజంపేట పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు అయిన విష్ణువర్ధన్ రెడ్డికి సైతం అలాంటి అవమానమే చోటు చేసుకుంది. వీరు ఇరువురు కూడా అవమాన భారంతో ఇక పార్టీలో గుర్తింపు ఉండదనే అనుమానంతో తమ పదవులకు రాజీనామా చేస్తూ ఆ లేఖలను టిడిపి రాష్ట్ర అధ్యక్షుడికి తెలుగు యువత అధ్యక్షుడికి అందించారు.

 

 

 

ఇక నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతుంటే, టిడిపి అభ్యర్థి మాత్రం హంగు ఆర్భాటాలతో, ఎలాగైనా గెలుపు మనదే అనే గర్వంతో ముందుకెళ్తున్నాడు. గ్రామంలో ఉన్నటువంటి వార్డు ఇన్చార్జిలకు గాని పట్టణంలో ఉన్నటువంటి నాయకులకు గానీ ఎలాంటి సహకారం అందించక పోయినా తమ తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని టిడిపిని గెలిపించాలనే ధ్యేయంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. షాజహాన్ భాష సోదరుడైన నవాజ్ భాష ఇద్దరు ఒకటయ్యమంటూ గొప్పలు చెప్పుకుంటూ జబ్బలు తడుచుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ఉన్నా అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వల్లే జరగనుంది. ఒకవేళ షాజహాన్ భాష ఎమ్మెల్యేగా గెలుపొందితే నికార్సైన శాశ్వతమైన టిడిపి క్యాడర్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న దొమ్మలపాటి రమేష్ గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో టిడిపి క్యాడర్ కోసం గట్టిగా నిలబడి కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారు.

 

 

 

అయితే ఆయనకి టికెట్ లభించకపోవడంతో కొంత నిరుత్సాహపడినా ఆయనని కలుపుకుని పోవడంలో డీలా పడ్డారు.ప్రస్తుత అభ్యర్థి షాజహాన్ భాష సొంత మనుషులకి ఇచ్చే గౌరవం ఇన్ని సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డ నిలబడ్డ నాయకులకు ఇవ్వకపోవడం టిడిపి జెండా ఎగిరినా ఆ నీడలో బ్రతకడం కార్యకర్తలకు కష్టంగా మారనుంది. దీనికి ప్రధానమైన ఉదాహరణ టిడిపి అభ్యర్థిగా షాజహాన్ భాషని ప్రకటించిన మొదట్లో ఆయనకు వచ్చిన ఆదరణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ లేకపోవడం గమనార్హం. వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన నిస్సార్ అహ్మద్ చదువుకున్న విద్యావంతుడిగా ప్రతి గ్రామం ప్రతి మండలం తిరిగిన వ్యక్తిగా ప్రజల కష్టాలను నేరుగా చూసిన నాయకుడిగా నియోజకవర్గ అభివృద్ధికి సైతం పక్క ప్రణాళిక కలిగిన ఇంజనీరుగా ప్రజలు ముందుకు వెళుతుంటే ఏ కొత్త అభ్యర్థికి లేనటువంటి ఆదరణ ఆయనకు అందుతోంది. దీన్ని బట్టి చూస్తే మదనపల్లిలో జెండా ఎవరు ఎగరేస్తారంటూ ప్రజల్లో ఒక రకమైన అవగాహన కలుగుతోంది.

 

Tags:Temples of Kanchkota in Madanapalli country

Post Midle