దేవాలయాలు తెరిచేందుకు  సిద్ధంగా ఉండాలి

-ప్రతి భక్తుడు మనకు వి. ఐ . పీ నే

Date:03/06/2020

విజయవాడ ముచ్చట్లు:

దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన అధికారుల సమావేశంలో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  బ్రాహ్మణ వీధి లోని దేవదాయ శాఖ మంత్రి కార్యాలయం నుంచి పాల్గొని మాట్లాడారు.
మంత్రి మాట్లాడుతూ సంవత్సర కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, భక్తులు  అందించిన సేవలు మరియు దేవదాయ శాఖ, ఆలయ సిబ్బంది బాగా పని చేశారు. ప్రతి భక్తుడు దేవాలయం లోకి వచ్చి వెళ్లేంత వరకు సంతృప్తికరమైన సేవలు, దర్శనం చేయించే విధంగా చర్యలు చేపట్టాలి. లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంతో  త్వరలో దేవాలయాలు తెరిచేందుకు అందరూ సిద్ధం కావాలి. గతంలో డబ్ల్యూహెచ్వో నిబంధనల ప్రకారం సూచనలను, మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. దేవాలయ అమలు చేసే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. భూముల పరిరక్షణ పై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి అన్నారు.
ఇప్పటికే సీఎం పలు సూచనలు ఇవ్వడం జరిగింది. దేవాలయ భూములు కాపాడుకునేందుకు, భూముల విషయంలో లీగల్ సమస్యలు పరిష్కరించుకునేందుకు కమిషన్ కార్యాలయం నుంచి వచ్చే సూచనలు తూచా తప్పకుండా పాటించాలి.

 

 

ప్రతి దేవాలయం విధిగా  ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఇప్పటికే ప్రతి దేవాలయంలో పరోక్ష సేవలను ప్రోత్సహిస్తూ సూచనలు ఇవ్వబడ్డాయి. గతంలో ఇచ్చిన సూచనల ప్రకారం ఆన్లైన్ సేవలు , డిజిటల్ ట్రాన్సక్షన్ పై శ్రద్ధ చూపించాలి.  దేవాలయానికి వచ్చే చిన్నారులు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తో పాటు నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి. ప్రతి దేవాలయములో వృధా ఖర్చులు తగ్గించుకునేందుకు అధికారులు శ్రద్ధ చూపించాలి. సమావేశంలో దేవదాయశాఖ కమిషనర్ అర్జున్ రావు, 13 జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు, మరియు నాలుగు జోన్ల డిప్యూటీ కమిషనర్, ఆర్ జె సి లు తదితరులు పాల్గొన్నారు.

భౌద్దసంఘ్‌ సౌత్‌ ఇండియా ఉపాధ్యక్షుగా డాక్టర్‌ పైడి అంకయ్య

Tags: Temples should be ready to open

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *