పోలీసు స్పందన కార్యక్రమం తాత్కలిక రద్దు.
కర్నూల్ ముచ్చట్లు:
కర్నూలు టు టౌన్ పోలీసుస్టేషన్ ప్రక్కనున్న స్పందన భవనంలో రేపు ( జూలై 4 సోమవారం) జరగబోయే ” స్పందన కార్యక్రమము”ను తాత్కలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి జూలై 5వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటనలో భాగంగా పోలీసు అధికారులు అందుబాటులో లేకపోవడం వలన సోమవారం ( జూలై 4 సోమవారం) జరిగే స్పందన కార్యక్రమం వాయిదా పడింది.సుదూర ప్రాంతాల నుండి వ్యయ , ప్రయాసలతో జిల్లా ఎస్పీ గారి స్పందన కార్యక్రమం కు రావొద్దని, ప్రజలు ( ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించగలరని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.వచ్చే సోమవారం (జూలై 11) నుండి “ స్పందన కార్యక్రమం” యధావిధిగా కోనసాగుతుంది.
Tags:Temporary cancellation of police response program.