జిల్లా కలెక్టర్ హామీతో మామిడి రైతుల ఉద్యమానికి తాత్కాలిక తెర

-తోతాపురి కి కిలోకు ₹12 చెల్లించేందుకు,
-గుజ్జు ఫ్యాక్టరీల వద్ద ధరల పట్టిక ప్రదర్శించేందుకు కలెక్టర్ అంగీకారం,
-రైతు ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు రైతు సంఘం ప్రకటన.
-హామీలు అమలు కానిచో భవిష్యత్తులో తిరిగి ఉద్యమం

 

చిత్తూరు ముచ్చట్లు:

 

చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు గిట్టుబాటు ధర కోసం గత మూడు వారాలుగా కొనసాగిస్తున్న రైతు ఉద్యమాన్ని సోమవారం కలెక్టర్ హామీతో విరమింప చేస్తున్నట్లు ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టీ. జనార్దన్ పేర్కొన్నారు. సోమవారం చిత్తూర్ కలెక్టర్ కార్యాలయంలో రైతు సంఘ ప్రతినిధులను కలెక్టర్ చర్చలకు ఆహ్వానించి, గిట్టుబాటు ధర విషయం, ధరల పట్టిక పొందుపరిచే అంశాలపై స్పష్టమైన హామీ ఇచ్చినందున ఉద్యమానికి తాత్కాలికం గా వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 రోజుల క్రితం రాష్ట్ర వ్యవసాయ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ప్రకటన మేరకు తోతాపురి కి ₹14 ఇవ్వాలని రైతు సంఘం నేతలు పట్టుబట్టగా కలెక్టర్ దానికి స్పందిస్తూ ముఖ్య కార్యదర్శి ₹12 కు అంగీకారం తెలిపారని ఆ మేరకు ఫ్యాక్టరీలు అమలు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.అలాగే ఫ్యాక్టరీ ఆవరణలో ధరల పట్టిక ఏర్పాటు చేసేలా, రాజకీయ జోక్యం లేకుండా మామిడి రైతుకు కటింగ్ ఆర్డర్లు ఇచ్చేందుకు కలెక్టర్ స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు..

 

 

 

నేటి నుండి ప్రభుత్వ ఆదేశాల మేరకు కచ్చితంగా ధరలను నియంత్రించి రైతులకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తామని కలెక్టర్ సమ్మతించారన్నారు. మామిడి బోర్డు ఏర్పాటు , అదనంగా ఐదు రూపాయలు సబ్సిడీ అంశాలను ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ హామీ తో సంతృప్తి చెందిన రైతు నాయకులు యజమానులు కచ్చితంగా కలెక్టర్ ఆదేశాలు అమలు చేయాలని పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాలను ఉల్లంఘిస్తే భవిష్యత్తులో ఉద్యమాన్ని పునః ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు హరిబాబు చౌదరి కోదండయాదవ్, శ్రీనివాస్ రెడ్డి, బాలాజీ, ఆనంద నాయుడు , ప్రభాకర్ రెడ్డి, బాలాజీ రెడ్డి, గోపి నాయుడు, తదితరులు పాల్గొన్నారు. అంతకు మునుపు కలెక్టర్ కార్యాలయం వద్ద గిట్టుబాటు ధర కోసం కొంతసేపు నిరసన తెలియజేశారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Temporary screen for mango farmers’ movement with District Collector guarantee

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *