పది మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వైసీపీ

Date:15/03/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
రాజ్యసభ ఎన్నికలకు ముందు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. మొత్తం మూడు స్థానాలకు ఈ ఎన్నిక జరిగింది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు 44 మంది మాత్రమే ఉన్నారు. మరో నలుగురిని పార్టీలో చేర్చుకుంటే మూడో అభ్యర్థిని కూడా గెలుపించుకోవచ్చన్నది టీడీపీ వ్యూహం. మూడో అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలని తెలుగుదేశం పార్టీ తొలుత భావించింది. స్వతంత్ర అభ్యర్థిని బరిలోకి దించి వైసీపీ అభ్యర్థిని ఓడించాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం ప్రయత్నాలనూ ప్రారంభించింది.అయితే రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టారు. 44 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు కొత్త ఫోన్లను కొనుగోలు చేసి ఇచ్చారు. ఆ ఫోన్లో వాయిస్ రికార్డింగ్ ఆటోమేటిక్ గా అయ్యే విధానం ఉంది. దాదాపు పది మంది వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ నేతల నుంచి ఫోన్లు వచ్చాయి. తమ పార్టీలోకి వస్తే ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. దీంతో రికార్డయిన ఆ వాయిస్ ను రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సేకరించి ఎన్నికల కమిషన్ కు నివేదించారు. ప్రలోభాలకు గురిపెట్టింది టీడీపీకి చెందిన ఒక రాజ్యసభ సభ్యుడు, ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఉన్నట్లు విజయసాయి రెడ్డి రాష్ట్రపతితో పాటు ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు.తమ వద్ద ఆధారాలున్నాయని విజయసాయి రెడ్డి ఘంటాపథంగా చెప్పారు. దీంతో టీడీపీ వెనక్కు తగ్గింది. ఈ లోపు రాష్ట్ర రాజకీయాలు కూడా మారిపోయాయి. ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పడంతో కేంద్రమంత్రి వర్గం నుంచి టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు వైదొలగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మూడో అభ్యర్థిని నిలబెట్టడం వృధా అని భావించిన చంద్రబాబు ఆ ఆలోచనను విరమించుకున్నారని చెబుతున్నారు. దీంతో వైసీపీ రాజ్యసభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చంద్రబాబు వ్యూహాన్ని తొలిసారి విజయసాయిరెడ్డి దెబ్బకొట్టినట్లయింది. మొత్తం మీద విజయసాయిరెడ్డి ప్లాన్ సూపర్ సక్సెస్ అయిందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు.
Tags: Ten men were treated as red handed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *