పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

Date:04/12/2020

అమరావతి  ముచ్చట్లు:

ఏపీ శాసనసభ చివరి రోజు  శుక్రవారం సమావేశాల్లో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే టీడీపీ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. పెండింగ్లో ఉన్న రూ.2500 కోట్ల ఉపాధి హామీ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసారు.  పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు సభలో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించగా… దాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో వారు సభాపతి  పోడియం ముందు బైఠాయించారు. చివరి రోజు సమావేశాలు కావడంతో కీలక బిల్లుపై చర్చించాలి. సభ్యులు  సహకరించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులను అభ్యర్ధించారు. అయినా  టీడీపీ ఎమ్మెల్యే  తమ నిరసనను కొనసాగించారు. స్పీకర్ పోడియం ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో  స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ వినకపోవడంతో 10 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.  ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జోగేశ్వరరావు, అనగాని సత్యప్రసాద్, బెందాళం అశోక్, మంతెన రామరాజులు సస్పెండ్ కు గురయ్యారు.

 రాజులకు కలిసి రాని కాలం..

Tags: Ten TDP MLAs suspended

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *