సింగరేణిలో టెండర్లు పిలవాలి-ఎంపీ కోమటిరెడ్డి

భువనగిరి ముచ్చట్లు:
 
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి  సోమవారం  మీడియా సమావేశం నిర్వహించారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ కి లెటర్ రాసాం. సింగరేణి కంపెనీకి ఒడిశాలో ఓ మైన్ ని కేటాయించింది. దాని పేరు నైని కోల్ మైన్స్. భారత్ కి చెందిన కోల్ ఇండియా మనకి కేటాయించిందని అన్నారు.
8 వ తేదీన టెండర్ల పెట్టారు. 10 జనవరి న ప్రధానికి లెటర్ రాశాము.  కోల్ ఇండియా లో స్టాండింగ్ కమిటీ మెంబెర్ ని నేను. పోటీ ఎక్కువగా  ఉంటే తక్కువ రేట్ కి ఇవ్వటానికి ముందుకు వస్తారు. టెండర్లో ముగ్గురే అర్హత ఉందని తేల్చారు. అదాని అనే కంపెనీకి రాబోతుందని, కేసీఆర్ సమీప బంధువు ప్రతిభ ఇన్ఫ్రా అనే కంపెనీ తో లోపాయకారి  ఒప్పందం జరిగింది. టెండర్లు జరిగాయి. సింగరేణి సిఎండి స్వంతంగా నిర్ణయం తీసుకున్న నిర్ణయ మేనా ? కేసీఆర్ ఆదేశాల మేరకు జరిగిందా .. కోల్ ఇండియా లో ఉన్న నిబంధనలు , సింగరేణి లో ఎందుకు పెట్టలేదు. ఇరవై వేల కోట్లు చేతులు మరే టెండర్ ఇది. నిజాయితీ గా ఉంటే దేశంలో కోల్ ఇండియా టెండర్లు పిలిచిన విధంగా సింగరేణి లో కూడా టెండర్లు పిలవాలి. రాష్ట్ర సీఎం సమీప బంధువుసంస్థ ప్రతిమ సంస్థ సింగరేణి లో టెండర్లలో పాల్గొంది.  అస్సాం ముఖ్యమంత్రి మీద వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.  రాజీవ్ గాంధీ హయాంలో 60 కోట్ల విషయంలో బాధనం చేశారు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ కోట్ల స్కామ్ లు జరుగుతున్నాయి. భువనగిరి పట్టణంలో ని రోడ్డు విస్తరణలో కూల్చిన ఇళ్ల కి నష్టపరిహారం ఇవ్వలేదు.  ఎం ఎం టి సి కి 75 కోట్లు కట్టమంటే కట్టలేదు. కెసిఆర్ సమస్యలు వినలేదు. భువనగిరి అభివృద్ధి విషయం లో స్థానిక ఎమ్మెల్యే చేసింది చాలా తక్కువ అని అయన అన్నారు.
 
Tags: Tenders should be called in Singareni-MP Komatireddy