నెల్లూరు నగర కార్పొరేషన్ వద్ద ఉద్రిక్తత

నెల్లూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో తమకు ఇచ్చిన హామీ ప్రకారం తమ సమస్యలు పరిష్కరించి, తమని వెంటనే పర్మినెంట్ చేయాలి  అంటూ నెల్లూరు నగర కార్పొరేషన్ ను  నగర పారిశుధ్య,ఇతర కార్మికులు ముట్టడించారు.శనివారం  జు  నెల్లూరు నగర కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది,ఈ సందర్బంగా నెల్లూరు నగర కార్పొరేషన్ లో 54 వార్డులకు గాను 54 వార్డులు వైసిపి పార్టీ గెలిచిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో కార్పొరేషన్ లో పనిచేసే కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులును,ఇతర కొన్ని విబాగా  కార్మికులను రెగ్యులర్ చేస్తా మని హామీ ఇచ్చారని కానీ రాష్ట్రం లో ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ పారిశుధ్య కార్మికులు ను రెగ్యులర్ చేయలేదని కరోనా సమయం లో ప్రాణాలకు తెగించి ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేసిన  కార్మికులకు ఇచ్చిన హామీ లు నెరవేర్చలేదని ఈ రోజు నెల్లూరు నగర కార్పొరేషన్ లో జరుగుతున్న కౌన్సిల్ సమావేశం లో పారిశుధ్య కార్మికులను రెగ్యులర్ చేసే విధంగా కౌన్సిల్ లో చర్యలు తీసుకోవాలని పారిశుధ్య కార్మికులు ఇతర విభాగం కార్మికులు సిపిఎం, సీపీఐ, సీఐటీయూ నాయకులతో కలిసి నెల్లూరు  నగర కార్పొరేషన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు.

 

Tags: Tension at Nellore City Corporation

Post Midle
Post Midle