ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత
ఆదిలాబాద్ ముచ్చట్లు:
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది…. గిరిజన యూనివర్సిటీ ఏర్పటు చెయ్యాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడానికి వెళుతున్న సమయంలో అదే రహదారి గుండా వెళుతున్న కలెక్టర్ వాహనాన్ని విద్యార్థులు అడ్డుకోవడం తో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. దీనితో విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది….ఒక్కే సారి గాంధీ చౌక్ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకోవడం తో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ఏబీవీపీ కార్యకర్తలను చెదరగొట్టారు.
పుంగనూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా ముత్యాలు
Tags: Tension in Adilabad district center