బైరెడ్డిపల్లిలో ఉద్రిక్తత
పలమనేరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. లోకేష్ పాదయాత్ర ముగిశాక బ్యానర్ల గొడవ మొదలయింది. గుర్తు తెలియని దుండగులు ఇండియన్ బ్యాంక్ ఎదురుగా టిడిపి శ్రేణుల బ్యానర్లను తగలబెట్టారు. విషయం తెలుసుకొని టిడిపి నేతలు బైరెడ్డిపల్లి చేరుకునేసరికి దుండగలు పరారయ్యారు. ఇది పక్కా వైసీపీ నాయకుల పనే అని టిడిపి శ్రేణులు అంటున్నాయి. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఈ తతంగం అంతా జరిగిన పోలీసులు ఏం చేస్తున్నారని నేతలు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ పట్ల పెరుగుతున్న జనాదరణ ఓర్వలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని బైరెడ్డిపల్లి టిడిపి ప్రెసిడెంట్ కిషోర్ గౌడ అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడుతున్నారని తీవ్ర విమర్శలు చేసారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా 2024 లో రాబోయేది తెలుగుదేశం పార్టీనే, బ్యానర్లను చింపగలరేమో గాని ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న అభిమానాన్ని చెరపలేరని వైసిపి నాయకులకు సవాల్ విసిరారు.
Tags; Tension in Baireddypally

