బేతవోలు లో ఉద్రిక్తత

కోదాడ ముచ్చట్లు:

సూర్యాపేట జిల్లా, చిలుకూరు మండల బేతవోలు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు,గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. కోదాడ అధికార పార్టీలో మరో మారు వర్గ పోరు బయటపడింది. బేతావోలు గ్రామంలో కళ్యాణాలక్ష్మి, షాది ముబారక్ బతుకమ్మ చీరల, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపినతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో  ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గోంటున్న నేపధ్యంలో ఇరు వర్గాలు పంతాలకు పోయాయి. గ్రామపంచాయతీ ఆవరణలో కార్యక్రమాన్ని సర్పంచ్ వర్గం,  పంచాయతీ పాలకవర్గం సభ్యులు ఏర్పాటు చేసారు.
అయితే, ఎమ్మెల్యే వర్గం మాత్రం కళ్యాణ మండపంలో  పంపిణికి సిద్ధం చేసింది. దాంతో లబ్ది దారులంతా అయోమయంలో పడిపోయారు. గ్రామంలో గత కొంత కాలంగా గ్రామపంచాయతీ సర్పంచ్ కి ఎమ్మెల్యే కు మధ్య వర్గం పోరు నడుస్తున్న విషయం తెలిసిందే.

 

Tags: Tension in Betavolu

Leave A Reply

Your email address will not be published.