ఎన్టీఆర్ జిల్లా తిరువూరు లో ఉద్రిక్తత
విజయవాడ ముచ్చట్లు:
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు కొమ్ము బాబురావు బోసుబొమ్మ సెంటర్ కి చేరుకున్నారు. బోసుబొమ్మ సెంటర్ కి భారీగా టీడీపీ నేతలు తరలిరానున్న నేపధ్యంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కళ్లుగప్పి బహిరంగ చర్చ వేదిక దగ్గరకు వచ్చేందుకు టీడీపీ నేతలు సిద్దమయ్యారు. అయితే పోలీసులు ఒక రోజు ముందు నుండే టీడీపీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ లు చేసార.
టీడీపీ ప్రభుత్వం, ఎంపీ కేశినేని నాని చేసింది అభివృద్ధిపై చర్చకు వస్తామని ఎమ్మెల్యే కి మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్, వాసం మునియ్య, ఎస్సీ సెల్ నాయకులు సవాలు విసిరిన విషయం తెలిసిందే. ఇంకా గృహ నిర్బంధంలోనే మాజీఎమ్మెల్యే స్వామిదాస్ టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వాసం మునియ్య వున్నారు.
Tags: Tension in NTR district Tiruvuru

