పోలవరంలో ఉద్రిక్తతఏలూరు
పోలవరం ముచ్చట్లు:
టీడీపీ నేతల పోలవరం ప్రాజెక్టు పర్యటన ఉద్రిక్తంగా మారింది. ప్రాజెక్టు పరిశీలనకు బయలుదేరిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఏలూరు నుంచి గోపాలపురం మీదుగా పోలవరం బయలుదేరిన టీడీపీ నేతలను కొవ్వూరుపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, గన్ని వీరాంజనేయులు, బడేటి రాధాకృష్ణ, టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రమంలో టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకొనే వాహనాల్లోకి ఎక్కించారు. అయితే పోలీసులను దాటుకొన్న దేవినేని ఉమ ద్విచక్రవాహనంపై పోలవరం బయలుదేరారు. పోలవరం గ్రామంలో దేవినేని ఉమను పోలీసులు అదుపులోకి తీసుకొని కొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. టీడీపీ నేతలను గోపాలపురం పోలీసుస్టేషన్‌కు తరలించారు. టీడీపీ నేతలు పోలవరం పర్యటనతో పోలీసులు భారీగా మోహరించారు.టీడీపీ నేతలు నేతలు దేవినేని ఉమ, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జులు బడేటి చంటి, మద్దిపాటి వెంకటరాజు, గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, పలువురు పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు బయలుదేరారు.
అయితే గోపాలపురం మండలం కొవ్వూరుపాడు శివారులో టీడీపీ బృందాన్ని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లి తీరుతామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమ పోలీసుల కన్నుగప్పి మోటార్ సైకిల్‌పై పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు బయలుదేరారు. మార్గమధ్యలో పోలీసులు దేవినేని ఉమను అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ల కక్కుర్తితో పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ నాశనం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో వైఫల్యాలు బయటపడతాయనే తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో లక్షలాది మంది ప్రజలు ప్రాజెక్టును సందర్శించారని గుర్తుచేశారు. ప్రాజెక్టు సందర్శనకు వెళ్తామంటే వైసీపీ సర్కార్ ఎందుకు భయపడుతుందని టీడీపీ నేతలు ప్రశ్నించారు.

Tags; Tension in Polavaram
