Natyam ad

రఘునాథపురంలో ఉద్రిక్తత

ఖమ్మం ముచ్చట్లు :

 

నాగపూర్ అమరావతి గ్రీన్ ఫాల్డ్ హైవే భూ సేకరణ ఉద్రిక్తతకు దారి తీసింది.  ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలో  భూసేకరణకు వచ్చిన నేషనల్ హైవే అధికారులను రైతులు  అడ్డుకున్నారు.భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆందోళనకారులను అదుపులో తీసుకునే సమయంలో రైతులకు పోలీసులకు మధ్య తోపులాట నెలకొంది. మా ప్రాణం పోయినా రోడ్డుకుభూమి ఇవ్వమంటున్నా రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. భూమి సర్వే చేస్తే పురుగుమందు తాగి చేస్తామని పురుగుమందు డబ్బాతో నిరసన తెలిపిన రైతులు. రైతులను, వారికి మద్దతుగా వచ్చినరాజకీయ పార్టీ నాయకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం పోలీస్ బందోబస్తు మధ్య నేషనల్ హైవే అధికారులు భూ సర్వేను కొనసాగించారు.

 

Tags: Tension in Raghunathapuram

Post Midle
Post Midle