తాడిపత్రిలో ఉద్రిక్తత

 

తాడిపత్రిలో ఉద్రిక్తత

అనంతపురం ముచ్చట్లు:

 

Post Midle

తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. నా ఇల్లు నా సొంతం అనే ప్రజా ఉద్యమం ద్వారా టిడ్కో ఇళ్ల వద్ద వంటావార్పు కార్యక్రమానికి జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ఈనేపథ్యంలో తాడిపత్రిలో టిడ్కో ఇళ్ళ వద్దకు లబ్ధిదారులతో కలిసి వెళ్లేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి, తనయుడు అస్మిత్ రెడ్డితో ర్యాలీగా బయలుదేరారు. పట్టణంలో ర్యాలీగా వెళ్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని, అస్మిత్ రెడ్డిని పోలీస్ స్టేషన్ సమీపంలో పోలిసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టిడ్కో ఇళ్ల వద్దకు వెళ్లేందుకు పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

 

Tags:Tension in Tadipatri

Post Midle