తాడిపత్రి లో ఉద్రిక్తత
అనంతపురం ముచ్చట్లు:
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో టెన్షన్ టెన్షన్ నెలకొంది. తాడపత్రి పట్టణంలో మున్సిపాలిటీ చెత్త సేకరణ వాహనాలు పనిచేయటం లేదని మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి పదరు వాహనాలతో ర్యాలీ చేయడానికి నిర్ణయించారు. అయితే పట్టణంలో 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ర్యాలీ చేయకూడదని పోలీసులు అంటున్నారు. బుధవారం ఉదయం జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసారు. తాడిపత్రి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి బిక్షాటకం చేపడుతాడానని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. మున్సిపాలిటీలో నిధులు లేక తాగునీరు అందించలేకపోతున్నాము. కనీసం చెత్త సేకరణ చేసే వాహనాలుకు కనీసం డిజల్ వేసుకోవడానికి కూడా నిధులు లేవని అయన అన్నారు. నిధులు కోసం నిరసన ర్యాలీ చేస్తున్నా ననిజేసీ ప్రభాకర్ రెడ్డి, అందుకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు.
Tags: Tension in Tadipatri

