తెలంగాణకరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తత 

Date:10/05/2020

కరీంనగర్ ముచ్చట్లు:

జిల్లాలోని గంగాధర్ పోలీస్ స్టేషన్ ఎదుట తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భూసర్వే, అరెస్టులను నిరసిస్తూ రైతులు ధర్నా చేపట్టారు. స్టేషన్ ఎదుటే బైఠాయించారు. లక్ష్మిదేవిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు రైతుల మధ్య కొన్నేళ్లుగా భూ వివాదం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం రామడుగు తాహసీల్దార్ కోమల్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది భూ సర్వేకు వెళ్లారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సర్వే చేస్తున్నారని బాధిత రైతులు సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు కొత్త జైపాల్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. దీంతో ఆయన ఘటనా స్థలానికి వెళ్లి ఎమ్మార్వోను నిలదీశారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి భూ సర్వే ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. అసలు తమకు నోటీసులు ఇవ్వకుండా భూ సర్వే ఎలా చేస్తారని రైతులు ప్రశ్నించారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారని అధికారులు కేసులు పెట్టారు.దీంతో కొత్త జైపాల్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకువెళ్లారు. తమ నాయకుడిని అక్రమంగా అరెస్టు చేశారని, తమపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపిస్తూ రైతులు నిరసనకు దిగారు. పోలీస్ స్టేషన్ ఎదుట కొన్ని గంటలు బైటాయించారు. ఎమ్మార్వో కోమల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కీర్తి చేకూరికి జేసిగా పదోన్నతి, బదిలీ

Tags: Tension in Telangana Karimnagar district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *