Natyam ad

కోటిలింగాల పేట లో ఉద్రిక్తత

రాజమండ్రి ముచ్చట్లు:

రాజమండ్రిలోని  కోటిలింగాలపేట పేపర్ మిల్లు ఇంటెక్ పాయింట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంటెక్ పాయింట్ వద్ద ధర్నాకు వెళ్లిన గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టికే విశ్వేశ్వర్ రెడ్డిని స్థానిక నాయకులు మర్రి పుష్పరాజ్ తదితరులు అడ్డుకున్నారు. ఇక్కడ ధర్నా చేయడానికి వీల్లే దంటు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. అయితే స్థానిక వైసీపీ నాయకులకు మహిళలు ఎదురుతిరిగారు. ఈ నేపధ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలని ఆందోళన చేస్తుంటే అడ్డుకోవడం దారుణమని  విశ్వేశ్వర రెడ్డి అన్నారు. పేపర్ మిల్లు యాజమాన్యం రౌడీలను పంపిందంటూ టీకే ఆందోళన వ్యక్తం చేసారు. పేపర్ మిల్లు వ్యవహారం సీఎం జగన్ దృష్టికి వెళ్లిందని దీనిపై కచ్చితంగా పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఎవరు అడ్డుకున్న ఉద్యమాన్ని ఆపేది లేదని అయన అన్నారు.

 

Tags: Tension in the cotylinga’s stomach

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.