భారత్, పాకిస్తాన్ మ్యాచ్ పై అంతా టెన్షన్

Tension is all over India and Pakistan match

Tension is all over India and Pakistan match

Date:18/09/2018
ముంబై ముచ్చట్లు:
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్, పాక్ మ్యాచ్‌కి సమయం ఆసన్నమైంది. ఆసియా కప్‌లో భాగంగా ఇరు జట్లు బుధవారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చూడటానికి అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం సన్నిహితుడు కూడా హాజరవుతాడని సమాచారం.
దీంతో వివిధ దేశాలకు చెందిన ఆరు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ మ్యాచ్‌కు వచ్చే వారిపై ఓ కన్నేసి ఉంచాయి. బుధవారం జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ గురించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నెట్‌వర్క్‌కి ముఖ్యమైన సమాచారం అందింది. దావూద్ ఇబ్రహీం, డి కంపెనీకి చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు ఈ మ్యాచ్‌ వీక్షించనున్నారని ఏజెన్సీలకు సమాచారం అందింది.
ఇప్పటికే ముంబై, కరాచీ నగరాల నుంచి దావుద్ కుటుంబ సభ్యులు, బంధువులు మ్యాచ్ చూడటం కోసం దుబాయ్‌ వెళ్లారు. దీంతో భారత్, బ్రిటన్, అమెరికా, రష్యా, చైనాలకు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు ఈ మ్యాచ్‌పై నిఘా పెట్టారు.
Tags:Tension is all over India and Pakistan match

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *