పంచాయితీ ఎన్నికలపైనే టెన్షన్

Tension is the panchayat election

Tension is the panchayat election

 Date:14/07/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఓవైపు అన్నిఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికలు నిర్వహిస్తారని అన్ని గ్రామాల్లో ఆశావహులు ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. జూలై నెలలో ఎన్నికలు నిర్వహిస్తారనే వచ్చిన సమాచారం ఆధారంగా చేసుకొని కొత్తగా ఏర్పడిన పంచాయతీలతోపాటు పాత పంచాయతీల్లోని ఓ స్థాయి నాయకులు రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయని ఎదురుచూస్తున్నారు. ఈనెల చివరిలో రిజర్వేషన్లు ప్రకటిస్తారని ఎదురుచూస్తున్న వారికి బీసీ రిజర్వేషన్ల లెక్క తేల్చాలంటూ న్యాయస్థానం నుంచి వచ్చిన తీర్పుతో కొంత నిరుత్సాహం కనిపిస్తోంది. మండంలో పాతవి 14 పంచాయతీలు కాగా కొత్తవి 18 ఏర్పడగా మొత్తం 32 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.గ్రామాల్లో, మండల కేంద్రంలో నలుగురు కలిశారంటే తాజాగా పంచాయతీ ఎన్నికల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ‘అయ్యో..ఏటేటా ఎన్నికలు ఆగిపోతాయా ఏంది..’అంటూ ముచ్చట్లు సాగుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్నిఏర్పాట్లు చేసుకుంటూ ఎన్నికలు త్వరలో వస్తాయని ఆశిస్తున్న ఆశావహులు, వారికి మద్దతుగా నిలిచిన వారంతా కొంత ఖంగుతిన్నారు. బీసీ జనాభా లెక్కలు, రిజర్వేషన్ల వ్యవహారంలో కోర్టుకు వెళ్లడం, ఆ లెక్కలు తేల్చాలని ధర్మాసనం చెప్పడంతో ఎన్నికలు ఇప్పట్లో జరగవా ఏంటి అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అధికారులైతే మండలస్థాయి వరకు ఎన్నికలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.ఎన్నికల సిబ్బందికి కరదీపికలు, నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. రిజర్వేషన్లు ప్రకటించడం, ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడం కోసమే ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడున్న సర్పంచులు మాత్రం ఎన్నికలు వాయిదా పడితే తామే ఇంకొద్ది కాలం ఇన్‌చార్జిలుగా కొనసాగుతామనే ఆనందం వారిలో కనిపిస్తోంది. అయినా ఏమి జరుగుతుందేమోననే చర్చలు వినిపిస్తున్నాయి.
పంచాయితీ ఎన్నికలపైనే టెన్షన్ https://www.telugumuchatlu.com/tension-is-the-panchayat-election/
Tags:Tension is the panchayat election

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *